For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ నెలలోనే అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ జంట ఆఫర్ల మేళా!

|

ఈ కామర్స్ అంటేనే ఆఫర్లు అనేంతగా అమెజాన్ కొత్త ప్రపంచాన్ని సృష్టించింది. అమెరికా మొదలు ఇండియా వరకు అమెజాన్ కార్యకలాపాలు ఉన్న అన్ని దేశాల్లోనూ వినియోగాగురులకు ఆఫర్ల గురించి బాగా తెలుసు. పండుగలు పబ్బాలు, ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని అమెజాన్ పెద్ద ఎత్తున ఆఫర్లను ప్రకటిస్తోంది. అలాగే దేశంలో అతిపెద్ద రిటైల్ చైన్ వ్యవస్థ కలిగిన ఫ్యూచర్ గ్రూప్ కూడా. అదేనండి బిగ్ బజార్, ఫుడ్ బజార్ వంటి భారీ హైపర్ మాల్స్ ఓనర్ కిషోర్ బియాని కంపెనీ.

ఒకటేమో ఆన్లైన్ దిగ్గజం. మరోటేమో ఆఫ్-లైన్ దిగ్గజం. అయితే, ఈ రెండూ కలిసి మొట్టమొదటి సారి ఒక జుగల్బందీ ఆఫర్ పెట్టబోతున్నాయి. అది కూడా జనవరిలోనే కావటం విశేషం. రిపబ్లిక్ డే సందర్భంగా షబ్ సే సస్తే దిన్ సేల్ అంటూ 4-5 రోజుల పాటు భారీ డిస్కౌంట్ సేల్ ప్రకటించబోతున్నాయి. ఈ విషయాన్నీ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం బిగ్ బజార్ లో లభించే డిస్కౌంట్లన్నీ అమెజాన్ వెబ్సైటు లోనూ బుక్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.

మీరు అకౌంట్ తెరవండి... మేము ఒక మొక్కను నాటుతాం..

ఇంటికే డెలివరీ...

ఇంటికే డెలివరీ...

ఇప్పటి వరకు ఫ్యూచర్ గ్రూప్ ఆధ్వర్యంలోని బిగ్ బజార్ సహా ఇతర రిటైల్ షాప్స్ లో లభించే ఆఫర్లు... ఇకపై అమెజాన్ లో లభిస్తాయి. మొట్టమొదటి సారి డిస్కౌంట్ సేల్ ఇలా ఆన్లైన్ - ఆఫ్ లైన్ ఫార్మటు లో జరుగుతున్నాయి. వినియోగదారులు గతంలో ఈ డిస్కౌంట్ల ను వినియోగించుకోవాలంటే స్టోర్ల కు వెళ్లి వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉండేది. కానీ ఈ సారి కస్టమర్లను తమ మొబైల్ ఫోన్లు ద్వారా కూడా అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు. వాటిని మనకు సమీపంలోని బిగ్ బజార్ స్టోర్ల నుంచి ఇంటికి డెలివరీ చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే బిగ్ బజార్ వస్తువులను ఆన్లైన్ లో కొనుగోలు చేస్తున్నట్లే. దీని ద్వారా వినియోగదారులకు చాల సమయం అదా అవుతుంది. స్టోర్లో లభించే అన్ని ఆఫర్లు వర్తిస్తాయి.

అమెజాన్ చేతికి ఫ్యూచర్...

అమెజాన్ చేతికి ఫ్యూచర్...

కిషోర్ బియాని కి చెందిన ఫ్యూచర్ గ్రూప్ లో సుమారు 49% వాటాను అమెజాన్ కొనుగోలు చేసింది. దీంతో ఈ రెండు గ్రూపులు కలిసి పనిచేయబోతున్నాయి. ఈ కొంగలు వల్ల అమెజాన్ కు పెద్ద మొత్తంలో ఫాషన్ నుంచి గ్రోసరీస్ వరకు వస్తువుల ఇన్వెంటరీ లభిస్తుంది. తమ ఆర్డర్లను ప్రాసెస్ చేసేందుకు దగ్గరలోని బిగ్ బజార్ వంటి స్టార్లను అమెజాన్ ఉపయోగించుకుంటుంది. తద్వారా అమెజాన్ కు డెలివరీ ఖర్చులు కలిసివస్తాయి. అదే సమయంలో ఫ్యూచర్ గ్రూప్ కు ఇప్పటివరకు ఆన్లైన్ లో అమ్మకాలు జరిపే సౌకర్యం లేదు. అమెజాన్ తో ఆ సమస్య తీరనుంది. ఆఫ్- లైన్ ఇన్వెంటరీ మొత్తాన్ని రియల్ టైం లో మేనేజ్ చేసేందుకు ఫ్యూచర్ గ్రూప్ నాకు మార్గం సుగమం అవుతుంది.

1 బిలియన్ ఆదాయం...

1 బిలియన్ ఆదాయం...

ప్రస్తుతం అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ కలయిక వల్ల రెండు గ్రూప్ లో లాభపడనున్నాయి. వచ్చే రెండేళ్లలో సంయుక్తంగా 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ 7,000 కోట్ల ) ఆదాయాన్ని ఆర్జించాలని ఫ్యూచర్ గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో ఇది అమెజాన్ కు కూడా కలిసిరానుంది. రెండు సంస్థల అమ్మకాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక వినియోగదారులకు డబల్ ధమాకా అన్నట్లే. ఎందుకంటే ఇప్పటి వరకు అమెజాన్ ఇచ్చే ఆఫర్లు బిగ్ బజార్లో లభించవు. అలాగే బిగ్ బజార్ ఆఫర్లు అమెజాన్ లో దొరకవు. కానీ, ఇకపై ఎక్కడి ఆఫర్లు ఎక్కడైనా లభిస్తాయి. సో, కస్టమర్లు రెండు ప్రయోజనాలను పొందవచ్చు. తమ కొనుగోళ్లపై భారీగా పొదుపు చేయవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

English summary

Future's sabse saste din sale to debut on Amazon

Future Group’s ‘Sabse Saste Din’ sale, centred around Republic Day, will also feature on Amazon.in, reflecting a broadening of the alliance between the two sides, said two persons with knowledge of the matter. Items are offered at a discount during the sale that runs for five-six days at Future Group stores such as Big Bazaar and Food Bazaar. Amazon acquired a stake in Kishore Biyani’s retail venture last year.
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more