For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యూచువల్ ఫండ్స్ కూ కరోనా సెగ... మారనున్న పథకాలు?

|

మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ ఇప్పుడిప్పుడే ఇండియా లో ప్రాచుర్యంలోకి వస్తోంది. గత 5-6 ఏళ్ళ నుంచి మదుపు దారులు విభిన్న మార్గాల్లో ఇన్వెస్ట్ చేయటానికి మొగ్గు చూపుతున్నారు. స్టాక్ మార్కెట్లో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసే రిస్క్ చేయలేని ఇన్వెస్టర్ల కు మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన మార్గంగా కనిపిస్తున్నాయి. దీర్ఘ కాలంలో బ్యాంకు వడ్డీ రేట్లతో పోల్చితే మంచి రాబడులను స్థిరంగా అందించే వెసులుబాటు ఉండటం వల్ల ప్రజలు ఇటు వైపు మొగ్గు చూపుతున్నారు.

దీంతో ఇటీవల దేశంలో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు భారీ స్థాయిలో ఇన్వెస్టర్లను ఆకర్షించగలుగుతున్నాయి. వీటికి తోడు కొన్ని రకాల పన్ను రాయితీలు కూడా లభిస్తుండటం ఇందులో అదనపు ఆకర్షణ గా ఉంటోంది. అయితే, ప్రస్తుత కరోనా వైరస్ దెబ్బకు ఈ రంగం కూడా భారీ మార్పులకు లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బకు జనాలు పిట్టల్లా రాలుతున్నారు. దేశాలకు దేశాలు లాక్ డౌన్ లో ఉంటూ రేపేమిటో తెలియని పరిస్థితిలో రోజులు గడిచిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా లో మ్యూచువల్ ఫండ్స్ లో మార్పులు జరిగే సంకేతాలు ఇప్పటికే వెలువడుతున్నాయి.

వడ్డీ రేటు భారీగా తగ్గింపు: LIC హోమ్‌లోన్ సూపర్ ఆఫర్, కానీ కండిషన్స్ అప్లై

6 పథకాలకు గుడ్ బై ...

6 పథకాలకు గుడ్ బై ...

దేశంలో ఇప్పటికే ఒక ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్ సంస్థ ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఫ్రాంక్లిన్ టెంపుల్టోన్ అనే ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ ఇప్పటికే 6 పథకాలకు గుడ్ బై చెప్పేసింది. ఇవన్నీ కూడా ఫిక్స్డ్ ఇన్కమ్ ను అందించే డెట్ పథకాలు కావటం గమనార్హం. ఏప్రిల్ 23 నుంచే ఈ పథకాలు అందుబాటులో ఉండవని కంపెనీ వెల్లడించింది. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది.

కరోనా వైరస్ నేపథ్యంలో పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేందుకు అధిక సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కంపెనీకి సంబంధించిన 6 పథకాలు సుమారు రూ 26,000 కోట్ల అసెట్స్ అండర్ మానేజ్మెంట్ ను కలిగి ఉండటం విశేషం. మిగితా పథకాలతో పోల్చితే డెట్ ఫండ్స్ లో కచ్చితమైన రాబడులకు అవకాశం ఉండటంతో ఇన్వెస్టర్లు ఇలాంటి పథకాలవైపు మొగ్గుచూపుతారు. కానీ, ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులను అందించే అవకాశం లేకపోవటంతో ఈ పరిణామం తలెత్తింది.

రూ 24 లక్షల కోట్ల పెట్టుబడులు...

రూ 24 లక్షల కోట్ల పెట్టుబడులు...

అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే.. భారత్ లో మ్యూచువల్ ఫండ్స్ పై అవగాహన చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే ట్రెండ్ మారుతోంది. ఈ మధ్య కాలంలో ఇన్వెస్టర్ల లో అవగాహన పెరుగుతోంది. అదే సమయంలో బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల పై వడ్డీ రేట్లు తగ్గిన తర్వాత ఇన్వెస్టర్లకు సాంప్రదాయ పొదుపు మార్గాలపై ఆసక్తి తగ్గుతోంది. వేగంగా, అధికంగా తమ పెట్టుబడులపై రాబడులు రావాలన్న ఆశ ఇన్వెస్టర్ల లో పెరిగింది. దీంతో వారు స్టాక్ మర్కెట్స్ సహా అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు.

ఇందులో కొంత లో రిస్క్ ఉండే మ్యూచువల్ ఫండ్స్ ఫై మొగ్గు చూపుతున్నారు. అందుకే, ప్రస్తుతం దేశంలో సుమారు 44 మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఇవన్నీ సంయుక్తంగా దాదాపు రూ 25 లక్షల కోట్ల ఆస్తులను (అసెట్స్ అండర్ మానేజ్మెంట్) నిర్వహిస్తుండటం విశేషం.

15% రాబడి..

15% రాబడి..

కొన్నేళ్లుగా ఇండియా లో మ్యూచువల్ ఫండ్స్ కు గిరాకీ పెరుగుతూ వస్తోంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఈ రంగం ఆకర్షణీయంగా మారింది. గత 10 ఏళ్లలో మ్యూచువల్ ఫండ్స్ 15% మేరకు ఇన్వెస్టర్లకు రాబడులను అందించాయి. దీంతో ఇన్వెస్టర్లలో క్రమంగా ఆసక్తి పెరుగుతూ వస్తోంది. బ్యాంకుల అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల తో పోల్చితే రాబడులు ఆకర్షణీయంగా ఉన్నాయి.

ద్రవ్యోల్బణాన్ని పరిగణన లోకి తీసుకున్నాక కూడా ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులను మ్యూచువల్ ఫండ్స్ అందించాయని చెప్పొచ్చు. అయితే, మరి ఇప్పుడు కరోనా ప్రభావంతో ఈ రంగంలో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి. ఒక సంస్థ ఇప్పటికే ఒక అడుగు ముందుకు వేయటంతో మిగితా కంపెనీలు కూడా వారి పథకాలను సమీక్షించుకునే పనిలో పడ్డట్లు సమాచారం. తద్వారా ఇప్పటికే ఉన్న పథకాల్లో మార్పులు చేయటం, లేదా కొత్త పథకాలను తక్కువ రాబడులు గ్యారెంటీ తో అందించటం జరగొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

English summary

Franklin Templeton MF winds up 6 debt schemes

Franklin Templeton Mutual Fund has voluntarily decided to wind up six of its fixed-income debt schemes effective April 23, 2020. The fund house has taken this step as it believes that the market will not return to normalcy soon because of coronavirus disruption.
Story first published: Friday, April 24, 2020, 16:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X