For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బడ్జెట్, ఆర్బీఐ ఎఫెక్ట్: ఫిబ్రవరి తొలి అర్ధభాగంలో FPIల దూకుడు

|

ఇటీవల బడ్జెట్ అనంతరం ఫారెన్ ఇన్వెస్టర్స్ (FPI) భారత మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. బడ్జెట్‌తో పాటు రిజర్వ్ బ్యాంకు తీసుకున్న అకామోడేటివ్ స్టాన్స్ కారణంగా ఫిబ్రవరి తొలి అర్ధభాగంలో FPI పెట్టుబడులు పెట్టారు. 14వ తారీఖీ లోపు రూ.24,617 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. డిపాజిటరీస్ డేటా ప్రకారం FPIలు రూ.14,191 కోట్లు రుణ పత్రాల మార్కెట్లో, రూ.10,426 కోట్లు ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు.

2020-21 బడ్జెట్లో కంపెనీలపై డివిడెండ్ పంపిణీ పన్ను (DDT) రద్దు ఈ సంస్థల్ని ఆకర్షించింది. అలాగే ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానానికి సంబంధించి సర్దుబాటు వైఖరి అవలంబిస్తామని పేర్కొనడంతో రుణ పత్రాల మార్కెట్లోనూ FPI జోరు కనిపించింది. ఈ పెట్టుబడులు ఫిబ్రవరి 3వ తారీఖు నుండి ఫిబ్రవరి 14వ తేదీ మధ్య వచ్చాయి.

స్మార్ట్ ఫోన్లపై రూ.14,000 వరకు తగ్గింపు

 ఫిబ్రవరి తొలి అర్ధభాగంలో FPIల దూకుడు

సెప్టెంబర్ 2019 నుండి ఇండియన్ మార్కెట్లో FPI నెట్ బయ్యర్స్‌గా ఉన్నట్లు డేటా వెల్లడిస్తోంది. అదే సమయంలో డిసెంబర్ 2019తో ముగిసిన క్వార్టర్లో ఈక్విటీ షేర్లలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు తగ్గాయి. ఈ కాలానికి మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ మార్కెట్లో రూ.11,837 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశాయి. సెప్టెంబరు 2019తో ముగిసిన క్వార్టర్లో నమోదైన రూ.23,874 కోట్లతో పోలిస్తే 50% తక్కువ. జీడీపీ వృద్ధి రేటు తగ్గడం, కంపెనీల షేర్ల విలువ అధికంగా ఉన్నాయనే భయాలు ఇందుకు కారణంగా చెబుతున్నారు.

English summary

FPIs invest Rs 24,617 crore in February

Foreign investors remained net buyers in the first half of February by investing a net sum of Rs 24,617 crore in the Indian markets due to positive sentiments post-Budget and the central bank's decision to maintain an accommodative stance in its recent monetary policy review.
Story first published: Monday, February 17, 2020, 12:04 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more