ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్, హౌస్ అడ్వాన్స్ వడ్డీ రేటు భారీగా తగ్గింపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. ఇప్పుడు ఉద్యోగులు మార్చి 2023 వరకు 7.10 శాతం తక్కువ వడ్డీ రేటుతో ఇంటి నిర్మాణం కోసం అడ్వాన్స్‌ను పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణ రుణం వడ్డీ రేటును 7.9 శాతం నుండి 7.10 శాతానికి తగ్గించింది. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఆఫీస్ మెమోరాండం ప్రకారం FY22-23లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ వడ్డీ రేటు 7.10 శాతంగా ఉంటుంది. మార్చి 2022 వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంవత్సరానికి 7.90 శాతం వడ్డీ రేటుకు గృహనిర్మాణ అడ్వాన్స్ అందుబాటులో ఉంది. ఇప్పుడు తగ్గించింది.
అంటే కేంద్ర ప్రభుత్వం 2022 ఏప్రిల్ 1వ తేదీ నుండి 80 బేసిస్ పాయింట్లు లేదా 0.8 శాతం మేర వడ్డీ రేటును తగ్గించింది. ఇది 2022 మార్చి 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఏడో వేతన సంఘం సిఫార్సు మేరకు హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ రూల్స్ 2017 ప్రకారం ఇంటిని నిర్మించుకోవడానికి లేదా ఇంటిని కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సింపుల్ వడ్డీ రేట్లలో అడ్వాన్స్‌ను పొందవచ్చు.

ఈ రూల్ కింద 34 నెలల వరకు లేదా బేసిక్ వేతనం ప్రకారం గరిష్టంగా రూ.25 లక్షల వరకు అడ్వాన్స్‌ను ఉద్యోగులు తీసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఇంటి ధర లేదా చెల్లింపు సామర్థ్యం ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని ఉద్యోగులు పొందవచ్చు. ఈ అడ్వాన్స్ తాత్కాలిక, శాశ్వత ఉద్యోగులు... ఇద్దరికీ అందుబాటులో ఉంది. తాత్కాలిక ఉద్యోగులు వరుసగా అయిదేళ్లు పని చేసి ఉండాలి.