For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

GST Council: 28న కీలక భేటీ: నిర్మలమ్మపైనే ఫోకస్: హైటెన్షన్

|

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజూ మూడు లక్షలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మూడున్నర నుంచి నాలుగు వేల మంది మృత్యువాత పడుతున్నారు. కంటికి కనిపించని ఈ మహమ్మారి వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌లోకి జారుకున్నాయి. సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తోన్నాయి. లాక్‌డౌన్ లేని ఏపీ వంటి ఒకట్రెండు రాష్ట్రాలు సైతం కర్ఫ్యూను అమలు చేస్తోన్నాయి. రాత్రివేళ కఠిన ఆంక్షలను విధించాయి. ఈ పరిణామాలతో ఆయా రాష్ట్రాల ఆర్థిక వనరులు దెబ్బతిన్నాయి. రాబడి క్షీణించింది.

Walmart కీలక ప్రకటన: ఆ ఇబ్బందికర నిబంధన ఎత్తివేత..వారికి మాత్రమే

28న జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీ..

ఈ పరిస్థితుల నేపథ్యంలో- వస్తు, సేవా పన్ను కౌన్సిల్ (GST Cuncil) భేటీ కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల 28వ తేదీన ఉదయం 11 గంటలకు దేశ రాజధానిలో ఈ సమావేశం ఏర్పాటు కానుంది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్.. ఈ సమావేశానికి నేతృత్వం వహిస్తారు. వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఈ భేటీ కొనసాగుతుంది. ఆ శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్, ముఖ్య కార్యదర్శులు.. పన్నుల విభాగం ఉన్నతాధికారులు, జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థికమంత్రులు దీనికి హాజరు కానున్నారు. కరోనా సంక్షోభ పరిస్థితుల మధ్య ఈ భేటీ ఏర్పాటు కాబోతోండటం అందరి దృష్టీ అటు మళ్లుతోంది.

బెంగాల్ ఆర్థికమంత్రి సూచించిన మూడోరోజే..

బెంగాల్ ఆర్థికమంత్రి సూచించిన మూడోరోజే..

దేశంలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరువాత ఈ కౌన్సిల్ సమావేశం కావడం ఇది 43వ సారి. చివరిసారిగా జీఎస్టీ కౌన్సిల్ భేటీ గత ఏడాది అక్టోబర్‌లో ఏర్పాటైంది. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటూ పశ్చిమబెంగాల్ ఆర్థిక శాఖ మంత్రి అమిత్ మిత్రా నిర్మల సీతారామన్‌ మూడురోజుల కిందటే ఓ లేఖ రాశారు. ఆ తరువాతే నిర్మల సీతారామన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ కూడా ఇటీవలే నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసింది. జీఎస్టీలో పలు సవరణలను చేయాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొంది. దీనికోసం వెంటనే కౌన్సిల్‌ను సమావేశపర్చాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.

ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు.. స్పుత్నిక్ వీపై జీఎస్టీ..

ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు.. స్పుత్నిక్ వీపై జీఎస్టీ..

విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోన్న ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, సిలిండర్లు, వెంటిలేటర్లు, ఐసీయూ ఉపకరణాలపై కేంద్ర ప్రభుత్వం 12 శాతం జీఎస్టీని వసూలు చేస్తోన్న విషయం తెలిసిందే. రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లపైనా 12 శాతం జీఎస్టీని విధించింది. ఇక పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్లపై ఏకంగా 18 శాతం జీఎస్టీని వసూలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అక్కడితో ఆగలేదు. తాజాగా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోన్న స్పుత్నిక్ వీ (Sputnik V) వ్యాక్సిన్‌పైనా జీఎస్టీ విధించింది. అయిదు శాతం జీఎస్టీ (5% GST)ని వసూలు చేస్తోంది. దీనివల్ల స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ రేటు 47 రూపాయల మేర పెరిగింది.

 వాటిపై జీఎస్టీ ఎత్తేయాలంటూ డిమాండ్..

వాటిపై జీఎస్టీ ఎత్తేయాలంటూ డిమాండ్..

దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను చూసి, చలించి విదేశాలు సహాయరూపంలో అందిస్తోన్న ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్లతో పాటు స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌పై జీఎస్టీని వసూలు చేయడం పట్ల దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమౌతోన్న విషయం తెలిసిందే. జీఎస్టీని ఎత్తేస్తే రేట్లు పెరుగుతాయంటూ నిర్మలా సీతారామన్ చేసిన కామెంట్ల పట్లా తీవ్ర వ్యతిరేకత ఎదరైంది. ఈ పరిణామాల మధ్య జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కాబోతోండటం ఆసక్తి రేపుతోంది. ఆమె సారథ్యంలో ఈ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటుందనేది ఉత్కంఠతను రేపుతోంది.

English summary

FM Nirmala Sitharaman to chair GST Council meet on May 28

FM Sitharaman to chair GST Council meet on May 28 as states seek enhanced compensation amid COVID-19 rage.
Story first published: Saturday, May 15, 2021, 16:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X