For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్ న్యూస్: ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులకు సీఈఓ ఏం చెప్పారో తెలుసా!

|

దేశంలోనే అతి పెద్ద ఈ-కామర్స్ కంపెనీ అయిన ఫ్లిప్ కార్ట్... తన ఉద్యోగులకు ఒక శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ దెబ్బతో దేశంలోనే కాకుండా ప్రపంచమంతా ఉద్యోగాల తీసివేత, వేతనాల కోత విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్ మాత్రం తమ ఉద్యోగులకు అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదని స్పష్టం చేసింది. ఉద్యోగాల తీత లేదా వేతనాల కోత విధించే ఆలోచనలు తమకు లేవని వెల్లడించింది. ఈ మేరకు దేశంలో 21 రోజుల లాక్ డౌన్ మొదలైన తర్వాత మొట్ట మొదటి సారి టౌన్ హాల్ నిర్వహించిన సందర్భంగా ఫ్లిప్ కార్ట్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి ఈ మేరకు ఉద్యోగాలకు హామీ ఇచ్చారని సమాచారం. దీంతో కంపెనీ ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసిందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. దాదాపు 15 రోజులుగా దేశం మొత్తం ఇంటికే పరిమితం అయిన ప్రస్తుత సందర్భంలో అందరిదీ ఒకటే బాధ. ఈ దెబ్బతో చాలా కంపెనీలు మూత పడే పరిస్థితులు నెలకొన్నాయి. చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తీసేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఏదో ఇప్పటి వరకైతే వర్క్ ఫ్రొం హోమ్ తో వెళ్లదీస్తున్నాం కానీ... ముందు ముందు జాబ్ ఉంటుందో లేదో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది.

షాక్: అమెరికాలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఉడిపోయే అవకాశముందంటే? ఇండియన్స్ ఏమంటున్నారు?

మూతపడ్డ కార్యకలాపాలు...

మూతపడ్డ కార్యకలాపాలు...

దేశంలో కరోనా అలజడి మొదలవగానే ... ఆ ప్రభావం ఈ కామర్స్ కంపెనీలపై పడింది. తొలుత ఆర్డర్లు పెరగ్గా... 21 రోజుల లాక్ డౌన్ ప్రారంభం అవటంతో తాత్కాలికంగా ఫ్లిప్ కార్ట్ తన సేవలను సస్పెండ్ చేయాల్సి వచ్చింది. అత్యవసర సరుకుల రవాణాకు లాక్ డౌన్ నుంచి మినహాయింపులు లభించటంతో గ్రోసరీస్ వంటి కొన్ని రకాల ఉత్పత్తుల డెలివరీ సాధ్యమవుతోంది. కానీ, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్స్ సహా ప్రధాన డెలివరీ సేవలు నిలిచిపోయాయి. డెలివరీ బాయ్స్ కూడా ఇల్లు విడిచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా లేకపోవటంతో మెజారిటీ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. దేశంలో సుమారు 16 కోట్ల మంది వినియోగదారులను కలిగి ఉన్న ఇంత పెద్ద కంపెనీకి కూడా లాక్ డౌన్ తిప్పలు తప్పలేదు. అయితే, కిరానా షాపులు, బిగ్ బజార్ వంటి హైపర్ మార్కెట్లు మాత్రం నడుస్తుండటంతో వాల్ మార్ట్ స్టోర్లు కూడా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.

ఆర్థికంగా ఇబ్బందులు లేవు...

ఆర్థికంగా ఇబ్బందులు లేవు...

ఫ్లిప్ కార్ట్ ఉద్యోగులతో టౌన్ హాల్ సమావేశం సందర్భంగా ఆ సంస్థ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి ఒక ఆసక్తికరమైన విషయాన్నీ వెల్లడించారు. ఫ్లిప్ కార్ట్ ఆర్థికంగా పరిపుష్టంగా ఉందని అయన తెలిపారు. కాబట్టి ఉద్యోగులు ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదని వ్యాఖ్యానించారు. రెండేళ్ల క్రితం ఫ్లిప్ కార్ట్ ను అమెరికా కు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ సంస్థ అయిన వాల్మార్ట్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఫ్లిప్ కార్ట్ ను కొనుగోలు చేసేందుకు ఎవరూ ఊహించనంత పెద్ద మొత్తం వాల్మార్ట్ చెల్లించింది. ఫ్లిప్ కార్ట్ కు మొత్తంగా 16 బిలియన్ డాలర్ల (రూ 1,20,000 కోట్లు) విలువ కట్టిన వాల్ మార్ట్ .. అందులో 74% వాటాను కొనుగోలు చేసింది. దీంతో ఫ్లిప్ కార్ట్ ఇప్పుడు పూర్తిగా విదేశీ కంపెనీగా మారిపోయింది. 2007 లో ప్రారంభమైన ఫ్లిప్ కార్ట్ ... ఇప్పటి వరకు ఒక్క రూపాయి లాభం కూడా ఆర్జించలేదు. రూ వేల కోట్ల నష్టాల్లోనే నడుస్తోంది. కానీ, ఇన్వెస్టర్ల నుంచి సమకూరిన నిధులు పెద్ద మొత్తంలో కంపెనీ వద్ద పోగుపడి ఉన్నాయి.

6,000 మంది ఉద్యోగులకు భరోసా ...

6,000 మంది ఉద్యోగులకు భరోసా ...

ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం 6,000 మంది పర్మనంట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరందరి ఉద్యోగాలకు కంపెనీ సీఈఓ భరోసా ఇచ్చారు. చివరకు ఇంటర్న్ గా పనిచేస్తున్న వారికి కూడా ఇది వర్తిస్తుందని చెప్పారు. కాబట్టి ఫ్లిప్ కార్ట్ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా... దేశ వ్యాప్తంగా తమ ఆర్డర్ల ను డెలివరీ చేసేందుకు ఈ కార్ట్ పేరుతొ ఒక అనుబంధ సంస్థ పనిచేస్తుంది. అందులో లక్షకు పైగా డెలివరీ బాయ్స్ పనిచేస్తుంటారు. గత 15 రోజులుగా మెజారిటీ సేవలు నిలిచిపోవటంతో వారంతా ఇంటికే పరిమితం అయ్యారు. అలాగే మరో 10 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుంది కాబట్టి వారి భవిష్యత్ ఏమిటి అనే దానిపై మాత్రం స్పష్టత కొరవడింది. డెలివరీ విభాగం ఒక ప్రత్యేక అనుబంధ సంస్థ కాబట్టి, అందులో పనిచేసే ఉద్యోగులు మెజారిటీ కాంట్రాక్టు పై పనిచేస్తుంటారు. డెలివరీ పార్టనర్స్ అందరూ ప్రతి డెలివరీ కి ఇంత మొత్తం చెల్లించాలనే విధానంలో పనిచేస్తారు కాబట్టి వారి కి కంపెనీ చెల్లించాల్సిన జీత భత్యాలు ఏమి ఉండవని తెలిసింది. లాక్ డౌన్ అయిపోగానే మళ్ళీ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి కాబట్టి... డెలివరీ బాయ్స్ అందరికీ మళ్ళీ పని దొరుకుతుందని చెబుతున్నారు.

English summary

Flipkart reassures staff, says will honour all job offers

Walmart-owned ecommerce marketplace Flipkart has assured its employees that there would be no pay cuts and that all job offers, including internships, will be honoured.
Story first published: Saturday, April 4, 2020, 17:28 [IST]
Company Search
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more