For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగం కోల్పోయిన 7 లక్షలమందికి ఉపాధి కల్పించిన రంగాలివే!!

|

ఏడాదికి పైగా భారీగా తగ్గిన ఆటో సేల్స్ అక్టోబర్ నెలలో కాస్త పుంజుకున్నాయి. కొంతకాలం సేల్స్ లేక ఆటో రంగం డీలాపడటంతో వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆటో రంగంతో పాటు వివిధ రంగాల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఆయా దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. భారత్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. అయితే ఇలా ఉద్యోగాలు కోల్పోయినవారిలో చాలామందికి కొత్తతరం కంపెనీలు ఉపాధి కల్పించాయి.

అలర్ట్: మీరు ఇలా చేయకపోతే పెన్షన్ ఆగిపోయే ప్రమాదం!

7 లక్షల మందికి ఉపాధి

7 లక్షల మందికి ఉపాధి

ఇలా ఉద్యోగాలు కోల్పోయిన వారిలో 7 లక్షలమందిని కొత్త తరం పరిశ్రమలు ఆదుకున్నాయట. ఆన్ లైన్ మార్కెటింగ్, ఫుడ్ టెక్ అగ్రిగేటర్లు, ఫిన్ టెక్ సంస్థలు ఈ పండుగ సీజన్లో 7,00,000 మందిని ఉద్యోగులుగా నియమించుకున్నాయి. ఆర్థిక మందగమన ప్రభావం వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది వీటిల్లో చేరారు.

తాత్కాలిక ఉపశమనం

తాత్కాలిక ఉపశమనం

అయితే ఈ ఉద్యోగాలు వారికి 6 నుంచి 8 నెలలు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే వీరిని ఉద్యోగంలోకి తీసుకొని సేల్స్ ఎక్కువగా ఉన్న సమయంలో ఉపయోగించుకుంటారు. ఆ తర్వాత చాలామందికి ఉద్యోగాలు ఉండవు. అంటే ఈ ఉద్యోగాలు చాలామందికి తాత్కాలిక ఉపశమనం. ఈ 7 లక్షల ఉద్యోగాల్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలో 1,40,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాయట.

సరాసరిగా రూ.30వేల వేతనం

సరాసరిగా రూ.30వేల వేతనం

సేల్స్‌లో ఉద్యోగాలు 30 శాతం మేర పెరిగాయట. ఓ సంస్థ లెక్కల ప్రకారం దసరా, దీపావళి పండుగ సీజన్లో ఆరున్నర లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ వంటి రంగాల్లో డిమాండ్ తగ్గినా పై రంగాల్లో నియామకాలు పెరిగాయి. డెలివరీ, అనుబంధ విభాగాలు, సరఫరా వ్యవస్థ, విక్రేతల గోడౌన్‌లలో నియామకాలు జరిగాయి. వీరి సరాసరి వేతనాలు రూ.30వేల వరకు ఉన్నాయి.

English summary

Firms hire 700,000 people who lost jobs in slowdown hit sectors

Online marketplaces, foodtech aggregators, and fintech firms have hired about 700,000 people, temporarily, in the festive season. Most people who have been hired are those who lost their jobs in other industries, such as automobile, hit by a slowdown.
Story first published: Sunday, November 3, 2019, 18:59 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more