ఫినో బ్యాంకింగ్.. మారుమూల ప్రాంతాలకు విస్తరణ, లోన్లు కూడా
ఇప్పుడు బ్యాంకింగ్ సేవలు అంతా ఆన్ లైన్ అయ్యాయి. అందరూ డిజిటల్ పేమెంట్స్ వాడుతున్నారు. అయితే వారి సేవ.. నెట్ బ్యాంకింగ్, చెక్కులు, డీడీ.. లోన్లు కోసం బ్రాంచులు తప్పనిసరి. అందుకే ప్రభుత్వ బ్యాంకులతోపాటు.. ప్రైవేట్ బ్యాంకుల కార్యాలయాలు భారీగానే ఉన్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో బ్యాంకులు లేవు. దీనికి ఓ కారణం ఉంది. రూరల్ ప్రాంతాల్లో బ్యాంకులు లాభదాయకం కాదు. అందుకే పెద్దగా పట్టించుకోరు. మరీ అందరికి బ్యాంకింగ్ సేవలు అందాలి కదా.. అందుకోసమే పేమెంట్ బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. వీటికి పెద్ద పెద్ద బ్రాంచులు అవసరం లేదు. చుట్టుపక్కల ఉన్న కిరాణా షాపులు లేదా మర్చంట్లే ఈ బ్యాంకులకు ఒక బ్యాంక్ బ్రాంచుగా, ఏటీఎంగా పనిచేస్తున్నాయి.
డిజిటల్ టెక్నాలజీని వాడుకుంటూ దేశంలో గల మారుమూల ప్రాంతాలకు బ్యాంకింగ్ సర్వీస్‌లను విస్తరిస్తున్నాయి. తొలుత లిస్టెడ్ పేమెంట్స్ బ్యాంక్ ఫినో.. ప్రస్తుతం సౌత్‌లో కూడా మరింతగా విస్తరించాలని ప్లాన్స్ వేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 29 వేల గ్రామాలు ఉన్నాయి. బ్రాంచులను పెట్టడం బ్యాంకులకు లాభదాయకం కాదు. అందుకే టెక్నాలజీ సాయంతో బ్యాంకులనే కస్టమర్ల దగ్గరకు తీసుకొస్తున్నామని ఫినో పేమెంట్స్ బ్యాంక్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ శైలేష్ పాండే తెలిపారు.

ఎన్ఎబీఎఫ్సీ లేదంటే బ్యాంకులతో పార్టనర్షిప్ కుదుర్చుకొని కస్టమర్లకు గోల్డ్ లోన్లు, కన్జూమర్ లోన్లు ఇస్తున్నారు. పేమెంట్ బ్యాంకులు డైరెక్ట్‌గా లోన్లను ఇవ్వడానికి కుదరదు. అందుకే బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలతో కలిసి బ్యాంకింగ్ సేవలను మారుమూలలకు విస్తరిస్తున్నారు. బ్యాంకింగ్ మోడల్లో చుట్టుపక్కల ఉండే కిరాణా షాపులు లేదా మర్చంట్లు ఒక బ్యాంక్ బ్రాంచ్‌గా లేదా మైక్రో ఏటీఎంగా పనిచేస్తాయి. వీటి దగ్గర కస్టమర్లు కొత్తగా బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేసుకోవచ్చు. క్యాష్ డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, ట్రాన్స్ఫర్ వంటి సర్వీస్‌లను పొందొచ్చు. ఫినోకి దేశం మొత్తం మీద ఇలాంటి పాయింట్లు 8.6 లక్షలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే 65 వేల పాయింట్లు ఉన్నాయి. వీరి దగ్గర ఫినో కస్టమర్లు బ్యాంకింగ్ సర్వీస్‌లను పొందొచ్చు.
ట్రాన్సాక్షన్లు పెరిగే కొద్ది పార్టనర్ బ్యాంక్, మర్చంట్లకు ఇన్కమ్ పెరుగుతుందని... కస్టమర్లకు అందుబాటులో బ్యాంకింగ్ సర్వీస్‌లు ఉంటాయి. కస్టమర్ల కోసం మొబైల్ బ్యాంకింగ్ యాప్ 'ఫినోపే' తీసుకొచ్చామని తెలిపారు.