For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫెయిర్‌నెస్ క్రీం ఉత్పత్తులకు 'డార్క్' డేస్: తాప్సీ, దియామీర్జా మద్దతు

|

ఫెయిర్‌నెస్ క్రీమ్ వంటి సౌందర్య ఉత్పత్తులకు చీకటి రోజులు ముందున్నాయా? ఫెయిర్‌నెస్ క్రీమ్ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లు తీసుకొస్తుందా? ఈ నిబంధనలకు ఆమోదం లభిస్తే ఎలా ఉంటుంది? అనే చర్చ ఇప్పుడు సాగుతోంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గతవారం డ్రగ్స్ అండ్ మేజిక్ రెమిడీస్ (అభ్యంతరకర ప్రకటనలు) చట్టం, 1954ను సవరించాలని ప్రతిపాదించింది.

బంగారం దిగుమతిపై ఫలితం అందిస్తోన్న కేంద్రం చర్యలు.. ఎలాగంటే

డార్క్ రంగులో ఉంటే..

డార్క్ రంగులో ఉంటే..

ఈ చట్టాన్ని మారిస్తే, కొత్త నిబంధనల డ్రాఫ్ట్ డ్రగ్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అభ్యంతరకర ప్రకటనలు) బిల్లు, 2020 కింద రూపొందిస్తారు. ఈ ముసాయిదా బిల్లుకు సంబంధించి ప్రజల నుండి లేదా వాటాదారుల నుండి ప్రభుత్వం సలహాలు, కామెంట్స్, అభ్యంతరాలు కోరింది. సాధారణంగా వివిధ రకాల బ్రాండ్స్ డార్క్ రంగు చర్మం కలిగి ఉండటాన్ని అవాంఛనీయ లక్షణంగా లేదా చర్మవ్యాధిగా క్రియేట్ చేశాయి.

మార్కెట్ చేసుకునేందుకు అలా చేస్తే..

మార్కెట్ చేసుకునేందుకు అలా చేస్తే..

ఫెయిర్‌నెస్ క్రీములు వారి వారి ఉత్పత్తులను మార్కెట్ చేసుకునేందుకు డార్క్ రంగు ఉండటం మంచిది కాదనే భావనను కల్పించాయని, ప్రతిపాదిత బిల్లులో ఇలాంటి వాటికి చెక్ చెబుతారని తెలుస్తోంది. ఈ డ్రాఫ్ట్ ప్రకారం ఫెయిర్‌నెస్ స్కిన్, హెయిర్ లాస్, ఎత్తు పెరగడం, ఒబెసిటీ వంటి వాటిపై అభ్యంతరకర ప్రకటనలు ఉంటే రూ.50 లక్షల వరకు జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. ఈ క్రీములు, ఔషధాలు ఉపయోగిస్తే అద్భుతం అని చెప్పే ప్రకటనలపై కేంద్రం సీరియస్‌గా ఉంది. అలాంటి వాటిపై జరిమానా విధించనుంది. డ్రాఫ్ట్ సవరణల్లో భాగంగా జాబితాలో పలు జబ్బులు, ఇతరత్రా వ్యాధులను చేర్చింది. 78 జబ్బుల పేర్లను చేరుస్తూ వీటిని నయం చేసే మెడిసిన్స్ ఉన్నాయని ప్రకటనలు జారీ చేస్తే జరిమానా తప్పదని కేంద్రం సవరణ తీసుకు వస్తోంది. వీటికి సంబంధించి ఎలాంటి ప్రకటనలు ఇవ్వరాదని బిల్లులో స్పష్టం చేయనుంది.

ఆజ్యం పోసిన సౌందర్య ఉత్పత్తులు

ఆజ్యం పోసిన సౌందర్య ఉత్పత్తులు

ఫెయిర్‌నెస్ క్రీంలు ప్రజలను తమ వైపుకు లాక్కునే ప్రయత్నం చేస్తాయని, కానీ వాస్తవానికి కొనుగోలుదారుల మనస్తత్వంలో మార్పు రావాలని పబ్లిసీస్ ఆంబియెన్స్ సీనియర్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రియా గుర్నానీ అన్నారు. మన చాలాచోట్ల మంచి రంగుకు ప్రాధాన్యం ఇస్తారని, దీనికి సౌందర్య ఉత్పత్తులు తమ లాభాలను పెంచుకునేందుకు దీనికి ఆజ్యం పోశాయన్నారు.

లోతుల్లోకి వెళ్లిన సమస్య..

లోతుల్లోకి వెళ్లిన సమస్య..

అసభ్యకర ఫెయిర్‌నెస్ క్రీం ప్రకటలను నిలిపివేయడం సామాజిక, నైతిక బాధ్యత దిశలో సరైన అడుగు అని పేర్కొన్నారు. కానీ బాధాకరం ఏమంటే కొనుగోలుదారులు చివరకు మళ్లీ అలాంటి ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్య చాలా లోతుల్లోకి వెళ్లిందని చెప్పారు.

2023 నాటికి రూ.5వేల కోట్ల మార్కెట్

2023 నాటికి రూ.5వేల కోట్ల మార్కెట్

ఇండియా ఫెయిర్‌నెస్ క్రీమ్, బ్లీచ్ మార్కెట్ 2018-23 రిపోర్ట్ ప్రకారం మహిళల ఫెయిర్‌నెస్ క్రీమ్ కేటగిరీ 2023 నాటికి రూ.5,000 కోట్ల మార్కెట్‌ను కలిగి ఉంటుందని అంచనా.

వివిధ కారణాలతో అందంగా కనిపించాలని...

వివిధ కారణాలతో అందంగా కనిపించాలని...

మీడియా, ఎంటర్టైన్మెంట్, సమాజం నుండి ఒత్తిడి వంటి వివిధ కారణాలతో ఎప్పటికప్పుడు చాలా చక్కగా కనిపించాలనే అభిప్రాయం ఉంది. డార్క్ స్కిన్ కలర్, నూన్యతా భావన కొంతమందిలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త సౌందర్య ఉత్పత్తులను ప్రయత్నించాలనే కోరిక ఉంటుంది. యువత పెరుగుతుండటంతో డిమాండ్ కూడా అదే విధంగా పెరుగుతోంది.

మార్పు తీసుకు రావడానికి ఇలాంటి చట్టాలు..

మార్పు తీసుకు రావడానికి ఇలాంటి చట్టాలు..

అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) 2014లో ఒక చార్టర్‌ను రూపొందించిందని, చర్మరంగు ఆధారంగా కాస్మొటిక్స్ బ్రాండ్స్ వివక్ష ప్రకటనలను నిషేధించిందని చెబుతున్నారు. ఇది కల్చరల్ సమస్య అని చెబుతున్నారు. కేంద్రం చట్టాలు జరిమానాలు, శిక్షల ద్వారా ఇలాంటి వాటిని పూర్తిగా నిరోధించలేమని, కానీ మార్పును తీసుకు రావడానికి ఉపయోగపడతాయని డిజిటల్ ఎవాంజలిస్ట్, మీడియా వెటరన్ సందీప్ గోయల్ అన్నారు. అయితే ఎవరికి వారు స్వీయ నియంత్రణ కలిగి ఉండాలని చెబుతున్నారు.

నటీమణుల మద్దతు

నటీమణుల మద్దతు

ఇటీవలి నివేదిక ప్రకారం ఫెయిర్‌నెస్ క్రీమ్ ప్రకటనలను నిషేధించాలని ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లును సినీ ప్రముఖులు తాప్సీ, దియా మీర్జా, సోనా మొహాపాత్రా వంటి వారు ప్రశంసించారు.

తాప్సీ, దియా ఏం చెప్పారంటే?

తాప్సీ, దియా ఏం చెప్పారంటే?

ఫెయిర్‌నెస్‌ను తాను ఎప్పుడు ప్రామాణికంగా తీసుకోనని నటి తాప్సీ చెప్పారు. అసభ్యకర ప్రకటనలకు చెక్ చెప్పే విధంగా మనందరిపై బాధ్యత ఉందని దియా మీర్జా అన్నారు. కొన్నేళ్ల క్రితం బ్రాండ్ మేనేజర్‌గా పని చేసిన మొహాపాత్రా ఇలాంటి విషపూరిత ప్రకటనలు తిరోగమనానికి సంకేతమని, ఇలాంటి వాటిని గుర్తించి, తుంచేయాల్సిన అవసరముందన్నారు.

జరిమానా..

జరిమానా..

ప్రభుత్వం అభ్యంతరకర, తప్పుదోవ పట్టించే ఉత్పత్తులపై చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఇది కొత్తదేమీ కాదని అంటున్నారు. 2014లో సమాచార మంత్రిత్వ శాఖ కొత్త చట్టం తెచ్చినప్పుడు 50 ఫెయిర్‌నెస్ సంస్థల ప్రకటనలు ప్రసారం చేయలేదు. 2015లో ఢిల్లీ కన్స్యూమర్ కోర్టు ప్రముఖ స్కిన్ అండ్ హెల్త్ కేర్ కంపెనీకి రూ.15 లక్షల జరిమానా విధించింది. ఫేస్‌క్రీమ్ ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు ఈ జరిమానా వేసింది.

English summary

Fairness cream ads in India will soon be banned

The Ministry of Health and Family Welfare last week proposed to amend the Drugs and Magic Remedies (Objectionable Advertisements) Act, 1954. The new rules would be drafted under Drugs and Magic Remedies (Objectionable Advertisements) (Amendment) Bill, 2020.
Story first published: Monday, February 17, 2020, 12:25 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more