For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గతవారం 8 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.39 లక్షల కోట్లు జంప్

|

గతవారం టాప్ 10 కంపెనీల్లోని ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,39,566.52 కోట్లు పెరిగింది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ టాప్ పర్ఫార్మర్స్‌గా నిలిచాయి. గతవారం హిందూస్తాన్ యూనీలీవర్, బజాజ్ ఫైనాన్స్ మాత్రమే టాప్ లూజర్స్‌గా నిలిచాయి. గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 882.40 పాయింట్లు లేదా 1.74 శాతం లాభపడింది. అంతకుముందు వారంలో టాప్ 9 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం 2,41,177.27 కోట్లు పెరిగింది.

రిలయన్స్

రిలయన్స్

రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం రూ.59,590.77 కోట్లు ఎగిసి రూ.13,28,049.94 కోట్లకు పెరిగింది. రిలయన్స్ షేర్ దాదాపు రెండు నెలల తర్వాత భారీగా ఎగిసింది.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం రూ.23,562.96 కోట్లు పెరిగి రూ.11,63,018.74 కోట్లకు పెరిగింది.

ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ గత వారం రూ.21,395.27 కోట్లు పెరిగి రూ.5,98,604.10 కోట్లకు పెరిగింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం రూ.18,697.06 కోట్లు పెరిగి రూ.3,76,663.23 కోట్లకు పెరిగింది.

కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.8,435.06 కోట్లు పెరిగి రూ.3,56,849.67 కోట్లకు పెరిగింది.

మార్కెట్ క్యాప్

మార్కెట్ క్యాప్

HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.4,555.41 కోట్లు పెరిగి రూ.4,58,418.62 కోట్లకు పెరిగింది.

HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.2,721.71 కోట్లు పెరిగి రూ.8.28,341.24 కోట్లకు పెరిగింది.

ICICI బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.608.28 కోట్లు పెరిగి రూ.4,45,171.34 కోట్లకు పెరిగింది.

అదే సమయంలో హిందూస్తాన్ యూనీలీవర్, బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ క్షీణించింది.

హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాప్ గతవారం రూ.8,904.94 కోట్లు తగ్గి రూ.8,904.94 కోట్లకు తగ్గింది.

బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1,282.63 కోట్లు పెరిగి రూ.3,38,589.27 కోట్లకు తగ్గింది.

టాప్ టెన్ కంపెనీలు

టాప్ టెన్ కంపెనీలు

టాప్ టెన్ కంపెనీలు వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్, TCS, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, HDFC, ICICI బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొటక్ మహీంద్రా బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఉన్నాయి.

English summary

Eight of the top 10 most valued companies have more than Rs 1.39 trillion

Eight of the top 10 most valued companies together added Rs 1,39,566.52 crore in market valuation last week, with Reliance Industries, TCS and Infosys emerging as the top performers.
Story first published: Sunday, May 30, 2021, 17:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X