For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ కంపెనీలకు అమెరికా షాక్, చైనాకు ట్రంప్ 'కఠిన' హెచ్చరిక

|

ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అమెరికా-చైనా మధ్య మళ్లీ ట్రేడ్ వార్ ప్రారంభమైంది. నాలుగు నెలలకు ముందు ఇరుదేశాల మధ్య ట్రేడ్ డీల్ సానుకూలంగా ముందుకు సాగుతుందనే సంకేతాలు వచ్చాయి. కానీ కరోనా మహమ్మారి నేపథ్యంలో మళ్లీ వాణిజ్య యుద్ధం మొదలైంది. ఇందులో భాగంగా తాజాగా చైనా కంపెనీల నుండి అమెరికా ఇన్వెస్టర్ల రక్షణార్థం డొనాల్డ్ ట్రంప్ ఓ మెమోరాండం జారీ చేశారు.

ఆర్థికమాంద్యంలోకి ప్రపంచం, జాగ్రత్త పడుతున్న ఇండియన్ ఐటీ కంపెనీలు!ఆర్థికమాంద్యంలోకి ప్రపంచం, జాగ్రత్త పడుతున్న ఇండియన్ ఐటీ కంపెనీలు!

చైనా సంస్థలకు చెక్!

చైనా సంస్థలకు చెక్!

అమెరికా క్యాపిటల్ మార్కెట్ల నుండి దశాబ్దాల తరబడిగా చైనా సంస్థలు లాభాలను ఆర్జిస్తున్నాయని, ఆ ప్రయోజనాలను చైనా ఆర్థిక అభివృద్ధికి ఉపయోగిస్తున్నాయని ఆక్షేపించారు. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతో పాటు జాతీయ భద్రతా ఉన్నతాదికారులు ట్రంప్ జారీ చేసిన మెమోరాండంలో మరిన్ని కఠిన నిబంధనలనుసిఫార్సు చేశారు.

ఆడిటింగ్‌కు అనుమతించని చైనా

ఆడిటింగ్‌కు అనుమతించని చైనా

అమెరికా పైనాన్స్ మార్కెట్లో చైనా సంస్థలు నిబందనలకు అనుగుణంగా నమోదు కావడం లేదని, వీటిలో పెట్టుబడులు పెట్టిన అమెరికన్లు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ తీరు అరవై రోజుల్లో మారేలా చర్యలు చేపట్టాలని మెమోరాండంలో పేర్కొన్నారు. అమెరికా స్టాక్ మార్కెట్లో నమోదైన చైనా కంపెనీల ఆడిటింగ్‌కు బీజింగ్ అనుమతించడం లేదన్నారు. ఇలాంటి సమయంలో కఠిన నిబంధనలు తప్పనిసరి అని అగ్రరాజ్యం అభిప్రాయపడింది.

చైనాకు అమెరికా హెచ్చరిక

చైనాకు అమెరికా హెచ్చరిక

చైనా కంపెనీల మోసపూరిత అకౌంటింగ్ పద్ధతులపై మైక్ పాంపియో హెచ్చరించారు. ఇలాంటి కంపెనీల పట్ల నాస్డాక్ ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రపంచంలోని ఇతర ఎక్స్చేంజీలకు ఒక మోడల్‌గా నిలుస్తుందన్నారు. లిస్టెడ్ కంపెనీలు అన్నీ అంతర్జాతీయ రిపోర్టింగ్, తనిఖీ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించేందుకు ఆడిటింగ్ సంస్థలు అవసరమన్న నాస్డాక్‌ను అభినందిస్తున్నట్లు తెలిపారు. అమెరికా పెట్టుబడిదారులను, ఆర్థిక మార్కెట్లను ప్రతికూలంగా ప్రభావితం చేయకుండా చైనా కంపెనీల పట్ల కఠిన నిబంధనలు, అందుకు అనుగుణమైన చర్యలు ఉండాలని మెమోరాండంలో పేర్కొన్నారు.

చైనా ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్.. కరోనా

చైనా ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్.. కరోనా

కాగా, ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా విషయంలో డ్రాగన్ కంట్రీపై ట్రంప్ ఆగ్రహంతో ఉన్నారు. ఈ వైరస్ కారణంగా అన్ని దేశాల కంటే అమెరికా ఎక్కువగా నష్టపోయింది. ప్రపంచానికి చైనా ఇచ్చిన అతి పెద్ద గిఫ్ట్ కరోనా అన్నారు. బీజింగ్ అభివృద్ధికి అమెరికా సహకరించిందని, కానీ దీనిని చైనా అడ్వాంటేజ్‌గా తీసుకుందని ట్రంప్ ఆగ్రహించారు. ఏడాదిలో చైనాకు 500 బిలియన్ డాలర్స్ ఇచ్చామన్నారు.

English summary

ఆ కంపెనీలకు అమెరికా షాక్, చైనాకు ట్రంప్ 'కఠిన' హెచ్చరిక | Donald Trump administration gets tough on China firms listed in US

Donald Trump released a memorandum on Thursday calling for recommendations to be issued within 60 days to protect US investors from what he said was China's failure to allow audits of US-listed Chinese companies.
Story first published: Saturday, June 6, 2020, 7:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X