For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రేడింగ్‌లో Circuit Filters అంటే ఏంటి.. అప్పర్ లోవర్ సర్క్యూట్‌‌ను ఎవరు నిర్ణయిస్తారు..?

|

ఈ రోజుల్లో సులభంగా డబ్బులు సంపాదించే మార్గం ఏదైనా ఉందా అంటే అది స్టాక్ మార్కెట్స్ అని చెప్పొచ్చు. ఎంత సులభంగా అయితే డబ్బు సంపాదించొచ్చో అంతే రిస్క్ కూడా ఉందన్న సంగతి ఎట్టి పరిస్థితుల్లో మరువరాదు. అంటే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు కంపెనీ గురించి కాస్త లోతుగా స్టడీ చేశాకే ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. ఇక స్టాక్ మార్కెట్‌లో కొత్తగా దిగిన వారికి కొన్ని స్టాక్ టెర్మినాలజీ అర్థం కాదు. అలాంటి వారికోసం ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతోంది. అది కూడా నిపుణుల నుంచి స్వీకరించిన ఇన్ఫో మాత్రమే.

ట్రేడింగ్‌లో అర్థం కాని కొన్ని పదాలు

ట్రేడింగ్‌లో అర్థం కాని కొన్ని పదాలు

స్టాక్ మార్కెట్‌, ట్రేడింగ్, ఇన్వెస్టింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇలా చాలా కొత్త టెర్మినాలజీలు మనకు మార్కెట్స్‌లో వినిపిస్తుంటాయి.. కనిపిస్తుంటాయి. నిత్యం మార్కెట్ టెర్మినాలజీలో మాట్లాడుకునేవారు ఈ పదాలను ఎక్కువగా వాడుతుంటారు. ఇక కొత్తగా ట్రేడ్ ప్రారంభిద్దామనుకునేవారికి కొన్ని పదాలు వాటి నిర్వచనం ఏంటో తెలియదు. డీమ్యాట్ అకౌంట్ చేసుకుని ఉంటారు. ఇక ట్రేడింగ్ స్టార్ట్ చేసేలోగా కొన్ని పదాలు తికమక పెడుతుంటాయి. వాటిపై పూర్తి అవగాహన తెచ్చుకుని ఇన్వెస్ట్ చేసేలోపే ఫలానా స్టాక్ ప్రైస్ అమాంతంగా పెరిగిపోతు ఉంటుంది. ఇక చివరిగా ఆ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయడం ఆపేస్తారు. అలాంటి పదాల్లో ఒకటి లోవర్ సర్క్యూట్ (Lower Circuit), అప్పర్ సర్క్యూట్ (Upper Circuit)

 సర్క్యూట్‌ను తాకింది అని ఎప్పుడు చెబుతాం..?

సర్క్యూట్‌ను తాకింది అని ఎప్పుడు చెబుతాం..?

మార్కెట్‌లో రెండు రకాల సర్క్యూట్ ఫిల్టర్లు ఉంటాయి. ఒకటి స్టాక్ లెవెల్ మరొకటి మార్కెట్ వైడ్ లెవెల్. అయితే ప్రస్తుతం స్టాక్ లెవెల్ సర్క్యూట్ ఫిల్టర్ల గురించి తెలుసుకుందాం. ఒక రోజులో ఒక స్టాక్ ట్రేడింగ్ ప్రారంభమయ్యాక ఒకే దిశలో పయనిస్తూ ఉంటే కనుక... అంటే అది లాభాల బాట పడుతుంటే లేదా నష్టాల బాట పయనిస్తుంటే అది సర్క్యూట్‌ను తాకింది అని చెబుతాం. అంటే సెబీ నిర్ణయించిన గరిష్ట అప్పర్ స్టాక్, లేదా గరిష్ట లోవర్ స్టాక్ సూచీలను తాకుతుందని అర్థం. ఇది మ్యాగ్జిమమ్ సూచీలు ముందుగానే నిర్ణయించబడుతాయి. ఇక సర్క్యూట్ ఫిల్టర్స్ ఎందుకు అనే ప్రశ్న ఇక్కడే ఉత్పన్నమవుతుంది.

 సర్క్యూట్ ఫిల్టర్స్ ఎందుకు..?

సర్క్యూట్ ఫిల్టర్స్ ఎందుకు..?

సర్క్యూట్ ఫిల్టర్స్ అనేవి ఆరోజులో జరిగే ఫలానా స్టాక్ యొక్క ధరను నియంత్రిస్తాయి. మార్కెట్లు ఆందోళన బాటలో పయనిస్తున్న సమయంలో ఇన్వెస్టర్ నష్టాలబాట పట్టకుండా కొంతవరకు నియంత్రించేందుకు ఈ ఫిల్టర్లు ఉపయోగపడతాయి. ఫలానా స్టాక్ నష్టాల్లో పయనిస్తుందని ఇన్వెస్టర్ గ్రహిస్తే వెంటనే తాను అమ్ముకోవడం జరుగుతుంది. లేదా పడిపోయిన స్టాక్ తిరిగి పెరుగుతుందని భావిస్తే ఆ స్టాక్‌ను తక్కువ ధరతో కొనుగోలు చేసేందుకు ఫిల్టర్లు ఉపయోగపడతాయి.

రోజువారీ వివిధ రకాలా పరిమితులు ఏంటి..?

రోజువారీ వివిధ రకాలా పరిమితులు ఏంటి..?

ఒక్క రోజులో ఒక స్టాక్ గరిష్టంగా 5శాతం, లేదా 10 శాతం, లేదా 20శాతం పెరుగుతుంది లేదా పడిపోతోంది. అయితే కిందటి రోజు జరిగిన ట్రేడింగ్‌లో ఏ ధర వద్ద ముగిసిందో అనే దానిపై మరుసటి రోజు ఫిల్టర్లను నిర్ణయించడం జరుగుతుంది. ఒకవేళ ఒక స్టాక్ అప్పర్ సర్క్యూట్‌ను టచ్ చేసిందంటే ఆరోజుకు ఆ స్టాక్ ట్రేడింగ్ ముగిసిపోతుంది. ఇక అంతకు మించి ముందుకు సాగదనే విషయాన్ని గ్రహించాలి. కానీ కొన్ని సందర్భాల్లో మళ్లీ కిందకు పడిపోయే అవకాశం కూడా ఉంది. ఇదే మాదిరిగా ఒక స్టాక్ లోవర్ సర్క్యూట్‌ తాకితే అంతకు మించి కిందకు పడిపోదనే విషయాన్ని తెలుసుకోవాలి. లోవర్ సర్క్యూట్ తాకినప్పుడు చాలామంది తమ స్టాక్స్‌ను అమ్ముకుంటారు. ఈ సమయంలోనే ఈ స్టాక్స్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.

సర్క్యూట్ ఫిల్టర్స్‌ను ఎవరు నిర్ణయిస్తారు..?

సర్క్యూట్ ఫిల్టర్స్‌ను ఎవరు నిర్ణయిస్తారు..?

సర్క్యూట్ ఫిల్టర్స్‌ను (Circuit Filters)ను ఎవరు నిర్ణయిస్తారు.. ఎందుకు నిర్ణయిస్తారు అనేది అందరికీ వచ్చే డౌట్. సర్క్యూట్ ఫిల్టర్లను మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ ఎక్స్‌ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (SEBI) నిర్ణయిస్తుంది. మార్కెట్ పరిస్థితులను, ఒడిదుడుకులను పర్యవేక్షించి సర్క్యూట్‌లను నిర్ణయిస్తుంది. అంతేకాదు మార్కెట్‌ లిక్విడిటీ ఆధారంగా సర్క్యూట్ ఫిల్టర్‌లు కూడా కాలానుగుణంగా సవరించబడుతాయి. మంచి లిక్విడిటీ ఉన్న స్టాక్స్‌‌కు సర్క్యూట్ ఫిల్టర్స్‌ను పెంచడం జరుగుతుంది. అదే సమయంలో మంచి లిక్విడిటీ లేని స్టాక్స్‌కు సర్క్యూట్ ఫిల్టర్స్ తగ్గించడం జరుగుతుంది.

ఇంకెందుకు ఆలస్యం.. సర్క్యూట్స్ గురించి తెలుసుకున్నారు కదా... ఇలాంటి స్టాక్స్‌కు సంబంధించిన సమాచారం ఇంకా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సేఫ్ ట్రేడింగ్ చేయండి.. మంచి లాభాలు పొందండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ ఆర్టికల్‌ను మీ సన్నిహితులకు స్నేహితులకు షేర్ చేయడం మర్చిపోకండి.

English summary

ట్రేడింగ్‌లో Circuit Filters అంటే ఏంటి.. అప్పర్ లోవర్ సర్క్యూట్‌‌ను ఎవరు నిర్ణయిస్తారు..? | Do You know what are circuit filters in stock markets-Know the complete information here

There are circuit filters when trading. These are Upper circuit and Lower circuit. when a stock touches its peak is called Upper circuit and when it falls to the least is called lower circuit.
Story first published: Friday, January 7, 2022, 14:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X