For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్ఫోసిస్, విప్రో లకు షాక్: అమెరికా లో కేసులు... ఎందుకంటే!

|

ఇండియన్ ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, విప్రో, హెచ్ సి ఎల్ కంపెనీలకు అగ్ర రాజ్యం అమెరికాలో చుక్కెదురైంది. తమపై జాతి వివక్ష చూపుతున్నారని అక్కడి ఉద్యోగులు ఈ కంపెనీలపై కేసులు (లా సూట్) వేశారు. మిలియన్ డాలర్ల లో నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అమెరికా వంటి దేశాల్లో జాతి వివక్ష (రేసియల్ డిస్క్రిమినేషన్) అనేది తీవ్రతరమైన నేరం. అందరూ సమానమే అనే పాలసీ ని పాటించే అమెరికా లో జాతి వివక్ష ఆరోపణలు ఎదుర్కోవటమంటే ... కొరివితో తల గోక్కున్నట్లే. సహజంగానే ఇన్ఫోసిస్, విప్రో వంటి మన దేశ ఐటీ కంపెనీల్లో భారతీయులు అధిక సంఖ్యలో పనిచేస్తుంటారు.

ఆ తర్వాత అక్కడి తెల్ల వారు ఉంటారు. ఇక ఆఫ్రికా సంతతికి చెందిన నల్ల వారికి కొలువులు కొంంచెం తక్కువ సంఖ్యలో లభిస్తాయి. అయితే, అమెరికన్ సిటిజెన్ ఐన ఎలాంటి జాతి వారికైనా ఒకే తరహా జీతం, భత్యం, సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. ముఖం, రంగు, లింగం (జెండర్), జాతి వంటి తేడాలు చూపడం నేరం. అందుకే అన్ని కంపెనీలు అక్కడి స్థానిక చట్టాలు, నిబంధనలు పాటించేందుకు సర్వ సన్నద్ధమవుతాయి. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

8న బ్యాంకు సమ్మె: బ్రాంచీలో సేవలు, ఏటీఎంలకు అంతరాయం!

విప్రో పై రూ 170 కోట్ల దావా...

విప్రో పై రూ 170 కోట్ల దావా...

గతేడాది డిసెంబర్ లో దేశీయ ఐటీ దిగ్గజం విప్రో కంపెనీ ఉద్యోగి ఐన కెవిన్ క్లార్క్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఆఫ్రికన్- అమెరికన్ ఐన తనకు ప్రాజెక్టులు ఇవ్వకుండా వేధించారని, చివరకు తనను విధుల్లో నుంచి తొలగించారని (టెర్మినేషన్) ఆరోపించారు. తద్వారా కలిగిన మానసిక వేదనకు, కుంగుబాటుకు తనకు 25 మిలియన్ డాలర్లు (సుమారు రూ.170 కోట్లు), ఇతర ఖర్చులను నష్టపరిహారంగా చెల్లించాలని కోరారు.

ఈ విషయాన్నీ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. డిసెంబర్ లోనే రెండో అతిపెద్ద ఐటీ ఎగుమతిదారు ఐన ఇన్ఫోసిస్ పైనా ఒక ఉద్యోగి కోర్టును ఆశ్రయించారు. తాను చేసిన ఓవర్ టైం కు గాను పేమెంట్ చెల్లింపులను తిరస్కరించి ఫెయిర్ లేబర్ స్టాండర్డ్స్ ను ఇన్ఫోసిస్ ఉల్లఘించిందని కాథీ జెపిన్స్కి ఆరోపించారు. అదే రకంగా హెచ్ సి ఎల్ కంపెనీ పైన వివక్ష ఆరోపణలతో సియర్రా క్లేటోర్ అనే నార్త్ కరోలినా రాష్ట్రానికి చెందిన ఉద్యోగి లా సూట్ దాఖలు చేశారు.

నిబంధనలు పాటిస్తున్నాం...

నిబంధనలు పాటిస్తున్నాం...

జాతి వివక్ష ఆరోపణలు చేస్తూ అమెరికా కోర్టులను ఆశ్రయించిన అక్కడి ఉద్యోగుల అంశంపై ఇన్ఫోసిస్, హెచ్ సి ఎల్, విప్రో లను ఈటీ వివరణ కోరింది. ఈ కథనం ప్రచురితమయ్యే సమయం వరకు ఇన్ఫోసిస్, హెచ్ సి ఎల్ కంపెనీలు స్పందించలేదు. కానీ విప్రో వివరణ ఇచ్చింది. అందరికీ సమాన అవకాశాలు కల్పించే కంపెనీగా తాము కట్టుబడి ఉన్నామని.. సమగ్రత, న్యాయబద్ధమైన, నైతిక కార్పొరేట్ ప్రమాణాలు వంటి అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్నామని విప్రో వివరించింది.

అయితే, పెండింగ్ లో ఉన్న లిటిగేషన్ పై కంపెనీ స్పందించలేదని విప్రో వెల్లడించింది. ఇది ఇలా ఉండగా.. మన దేశ కంపెనీల మేనేజర్ల కు అమెరికా, యూరోప్ ప్రమాణాలపై కంపెనీ లు తగిన శిక్షణ ఇస్తున్నాయి. అక్కడి స్థానిక నిబంధనలు తూచా తప్పకుండ ఎలా నడుచుకోవాలో తర్ఫీదునిస్తున్నాయి. అయినప్పటికీ కొన్ని సార్లు అనేక కారణాలతో కొన్ని రకాల విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది.

ట్రంప్ తో తిప్పలు...

ట్రంప్ తో తిప్పలు...

డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి భారత ఐటీ కంపెనీలకు ఇబ్బందులు మొదలయ్యాయి. హెచ్1బి వీసాల తో పాటు అన్ని రకాలుగా మన కంపెనీలు, ఉద్యోగులపై ఆంక్షలు విధిస్తున్నారు. కేవలం అమెరికా కంపెనీలకు మాత్రమే మేలు చేసే అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో దాదాపు 40% వాటా కలిగిన, అతి పెద్ద సాఫ్ట్ వేర్ ఎగుమతుల మార్కెట్ గా ఉన్న అమెరికా నుంచి చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది.

స్థానికులకు అధిక సంఖ్యలో కొలువులు ఇవ్వక తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఒక్క అమెరికా ఫ్రెషర్ కు ఇచ్చే వేతనంతో మన దేశంలో ఒక వైస్ ప్రెసిడెంట్ స్థాయి అధికారిని నియమించుకోవచ్చు. అంటే వ్యయాలు ఎంత భారీగా పెరిగిపోయాయో అర్థమవుతుంది. అయినప్పటికీ అమెరికా నుంచి పెద్ద క్లయింట్లు, భారీ స్థాయి ఆర్డర్స్ ఇస్తారు కాబట్టి మన ఐటీ కంపెనీలు ఆ దేశానికి ప్రాధాన్యత ఇవ్వక తప్పదు. అధిక మొత్తంలో ఖచ్చితమైన చెల్లింపులు చేసేది అమెరికానే. అందుకే ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ... మన కంపెనీలు కానీ, ఉద్యోగులు కానీ అమెరికాను అంటిపెట్టుకుని ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

English summary

Diversity under lens as IT faces fresh suits in US

Indian IT services companies Wipro, Infosys and HCL Technologies have faced fresh lawsuits on employee discrimination in the US last month at a time when these firms are seeing an increased hostility for visas in their largest export market.
Story first published: Monday, January 6, 2020, 7:52 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more