LVB విలీనానికి డీబీఎస్ రూ.2500 కోట్ల సాయం, డిపాజిటర్లకు నష్టం జరగకుండా
డీబీఎస్(సింగపూర్) బ్యాంకు నుండి రూ.2500 కోట్ల మూలధన సాయం అందినట్లు డీబీఎస్ బ్యాంకు ఇండియా లిమిటెడ్(DBIL) శుక్రవారం తెలపింది. లక్ష్మీ విలాస్ బ్యాంకుని తమ బ్యాంకులో విలీనం చేసుకోవడానికి ఇది తోడ్పడుతుందని తెలిపింది. ఈ రెండు బ్యాంకుల నుండి విలీన పథకం నవంబర్ 27వ తేదీ నుండి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. విలీన ప్రక్రియ అనంతరం కూడా డీబీఐల్ మూలధనం, మూలధన నిష్పత్తి (CAR) ఆర్బీఐ నిర్దేశించిన దాని కంటే ఎక్కువే ఉంటుందని తెలిపింది.
లక్ష్మీ వలాస్ బ్యాంకు... మరిన్ని కథనాలు

స్థిరత్వం నుండి మంచి అవకాశాల దిశగా..
డీబీఎస్-LVB విలీనం ద్వారా లక్ష్మీ విలాస్ బ్యాంకు కస్టమర్లకు, ఖాతాదారులకు, ఉద్యోగులకు మంచి ప్రయోజనాలు అందుతాయని డీబీఎస్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. డీబీఎస్ డిజిటల్ బ్యాంకింగ్ సేవల్ని కూడా ఉపయోగించుకోవచ్చునని వెల్లడించింది. డిపాజిటర్లు, కస్టమర్ల ఉద్యోగులకు అనిశ్చితి పరిస్థితి నుండి స్థిరత్వం, స్థిరత్వం నుండి మంచి అవకాశాలను అందిస్తుందని డీబీఎస్ బ్యాంకు తెలిపింది.

డీసీబీగా LVB
దాదాపు శతాబ్దం చరిత్ర కలిగిన లక్ష్మీ విలాస్ బ్యాంకు శుక్రవారం, నవంబర్ 27 నుండి సింగపూర్ డీబీఎస్ బ్యాంకు(ఇండియా) విభాగం కిందకు వచ్చింది. దీంతో ఈ బ్యాంకుపై ఆర్బీఐ ఈ నెల ప్రారంభంలో విధించిన ఆంక్షలు తొలగిపోయాయి. లక్ష్మీ విలాస్ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్ ఏమంటే... డీబీఎస్లో విలీనం కావడంతో నెల రోజులపాటు మారటోరియం విధించినప్పటికీ, పది రోజుల్లోనే రూ.25,000 కంటే ఎక్కువ మొత్తాన్ని విత్ డ్రా చేసుకునే సౌకర్యం కలిగింది.

డిపాజిటర్లకు నష్టం జరగకుండా..
కాగా, లక్ష్మీ విలాస్ బ్యాంకు, యస్ బ్యాంకుకు అంశాలపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. డిపాజిటర్లకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ రెండు బ్యాంకుల బాండ్సు, షేర్లను ఆర్బీఐ రైటాఫ్ చేయడాన్ని సమర్థించారు. బ్యాంకుల సమస్యలు పరిష్కరించే సమయంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో యస్ బ్యాంకుకు చెందిన అడిషనల్ టైర్ 1 బాండ్స్ రూ.7000 కోట్లు రైటాఫ్ చేయగా, ఎల్వీబీ కేసులో రూ.320 కోట్ల టైర్ 2 బాండ్స్ రైటాఫ్ చేశారు. ఇది సరికాదంటూ బాధిత పార్టీలు కోర్టును ఆశ్రయించాయి.