For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిట్ కాయిన్ సహా డిజిటల్ టోకెన్స్ పతనం, 2021లో పెరిగిన ఫ్రాడ్

|

యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాల అనంతరం క్రిప్టో కరెన్సీ పతనం రోజురోజుకు కనిపిస్తోంది. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ ఇటీవల ఓ సమయంలో 40,000 డాలర్ల దిగువకు కూడా పడిపోయింది. ఆ తర్వాత కాస్త కోలుకున్నప్పటికీ ఇప్పటికీ 40,000 డాలర్ల స్థాయిలోనే ఉంది. ఆల్ టైమ్ గరిష్టం 69,000తో దాదాపు 27,000 డాలర్లు తక్కువగా ఉంది. బిట్ కాయిన్ నేడు సాయంత్రం సెషన్‌లో 41,813 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ క్రితం సెషన్లో 1.96 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 102.90 బిలియన్ డాలర్లుగా ఉంది.

భారత కరెన్సీ ప్రకారం బిట్ కాయిన్ నేటి ఉదయం సెషన్లో 33.83 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రిప్టో మార్కెట్‌లో ఈ కరెన్సీ వాటా 41 శాతం వరకు ఉంది. క్రిప్టో ఆధారిత క్రైమ్ 2021లో పెరిగింది. బ్లాక్ చైన్ డేటా కంపెనీ చైనాలసిస్ ప్రకారం అక్రమ చిరునామాలతో కూడిన ట్రాన్సాక్షన్స్ 2020లో 7.8 బిలియన్ డాలర్ల వ్యాల్యూ నమోదు కాగా, 2021లో 14 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే ఫ్రాడ్‌స్టర్స్ క్రిప్టో ట్రాన్సాక్షన్స్ వ్యాల్యూమ్ మాత్రం 2021లో 0.15 శాతం తగ్గింది. చైనాలసిస్ ప్రకారం 2021లో మొత్తం క్రిప్టో ట్రాన్సాక్షన్స్ వ్యాల్యూమ్ 15.8 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. 2020తో పోలిస్తే ఇది ఆరు రెట్లు ఎక్కువ.

బిట్ కాయిన్ సహా డిజిటల్ టోకెన్స్ పతనం, 2021లో పెరిగిన ఫ్రాడ్

నేటి ఉదయం వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ ఇలా ఉంది... బిట్ కాయిన్ రూ.33,83,194, ఎథేరియం రూ.2,49,724, టెథేర్ రూ.80.39, కార్డానో రూ.92.3000, బియాన్స్ కాయిన్ రూ.34,497.70, ఎక్స్‌పీఆర్ రూ.59.781, పోల్కాడాట్ రూ.1,931.66, డోజీకాయిన్ రూ.11.6698గా ఉంది.

English summary

Cryptocurrency Prices Today: Bitcoin, Ethereum and all others down

Cryptocurrencies traded in the red early today with the global crypto market capitalisation standing at $1.96 trillion, a 0.46 percent decrease over the last day. The total crypto market volume over the last 24 hours stands at $102.90 billion, a 44.45 percent increase.
Story first published: Tuesday, January 11, 2022, 22:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X