For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

60,000 డాలర్ల దిశగా బిట్ కాయిన్ పరుగులు, వారంలో 18% జంప్

|

గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాప్ క్రితం సెషన్‌తో పోలిస్తే 0.36 శాతం లాభపడి 2.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గత ఇరవై నాలుగు గంటల్లో 2 శాతం పెరిగింది. కొద్ది నెలల క్రితం 30వేల డాలర్ల దిగువకు పడిపోయిన బిట్ కాయిన్ ప్రస్తుతం 60,000 డాలర్ల దిశగా పరుగులు పెడుతోంది. నేటి ఉదయం సెషన్‌లో బిట్ కాయిన్ 56,000 డాలర్లు దాటింది. సాయంత్రానికి ఏకంగా 57,500 డాలర్లను తాకింది. గత వారం రోజుల్లో బిట్ కాయిన్ 18 శాతానికి పైగా లాభపడింది. ఎథేరియం 7 శాతం ఎగిసింది. క్రితం సెషన్‌లో మాత్రం 1 శాతం పెరిగింది. ఎథేరియం వ్యాల్యూ ప్రస్తుతం 3600 డాలర్ల వద్ద ఉంది. మీమ్ బేస్డ్ క్రిప్టో డోజీకాయిన్ మాత్రం 3 శాతం క్షీణించి 0.23 డాలర్లకు పడిపోయింది. కార్డానో, పోల్కాడాట్ 6 శాతం చొప్పున నష్టపోయాయి.

బిట్ కాయిన్ ఈ వారంలోనే 60,000 డాలర్లను క్రాస్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ ఏడాది మే నెల నుండి స్వల్పంగా లాభపడుతూ వచ్చిన బిట్ కాయిన్, కొద్ది నెలలుగా ఊగిసలాటలో ఉంది. అయితే ఇటీవల మళ్లీ జంప్ చేస్తోంది. బిట్ కాయిన్‌కు బిగ్గెస్ట్ మంత్లీ లాస్ మే నెల తర్వాత సెప్టెంబర్. బిట్ కాయిన్ మే నెలలో ఆల్‌టైమ్ గరిష్టం 65,000 డాలర్లకు చేరుకొని, కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. మళ్లీ కోలుకొని, చాలారోజుల పాటు 30వేల డాలర్ల నుండి 50వేల డాలర్ల మధ్య కదలాడి, ప్రస్తుతం 57వేల డాలర్ల పైన ట్రేడ్ అవుతోంది. జూలై నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో 40వేల డాలర్ల నుండి 50,వేల డాలర్ల మధ్య కదలాడింది.

నేటి ఉదయం వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ

60,000 డాలర్ల దిశగా బిట్ కాయిన్ పరుగులు, వారంలో 18% జంప్

- Bitcoin - 56,815.99 డాలర్లు - మార్కెట్ క్యాప్ $1.07 ట్రిలియన్ డాలర్లు

- Ether - 3,602.44 డాలర్లు - మార్కెట్ క్యాప్ $422.85 బిలియన్ డాలర్లు

- Dogecoin - 0.238559 డాలర్లు - మార్కెట్ క్యాప్ $31.37 బిలియన్ డాలర్లు

- XRP - 1.17 డాలర్లు - మార్కెట్ క్యాప్ $118.01 బిలియన్ డాలర్లు

- Cardano - 2.25 డాలర్లు - మార్కెట్ క్యాప్ $72.90 బిలియన్ డాలర్లు

English summary

Crypto Prices Today: Bitcoin gains over 18%, Ethereum rises 7% in a week

The global crypto market cap has grown around 0.36 percent to $2.34 trillion over the last day, according to coinmarketcap.com
Story first published: Monday, October 11, 2021, 21:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X