బిట్ కాయిన్, ఎథేరియం జంప్.. ఐనా 40,000 డాలర్ల దిగువనే: పడిపోయిన డోజీకాయిన్
క్రిప్టో మార్కెట్ నేడు (ఏప్రిల్ 28) మిశ్రమంగా కదలాడుతోంది. ప్రపంచ టాప్ 2గా ఉన్న క్రిప్టో దిగ్గజాలు బిట్ కాయిన్, ఎథేరియం లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. అయినప్పటికీ బిట్ కాయిన్ 40,000 డాలర్లకు దిగువన, ఎథేరియం 2900 డాలర్లకు దిగువన ఉంది. ఇతర దిగ్గజ క్రిప్టోలు చాలా వరకు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మీమ్ కాయిన్స్ డోజీకాయిన్, షిబా ఇను 2 శాతం మేర నష్టపోయాయి.
మార్కెట్ వ్యాల్యూపరంగా ప్రపంచ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ గత 24 గంటల్లో 38,450.69 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 39,675.79 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. ఈ వార్త రాసే సమయానికి 2.22 శాతం ఎగిసి 39,501 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బిట్ కాయిన్ 52 వారాల గరిష్టం 68,990.90 డాలర్లు. ఆల్ టైమ్ గరిష్టం కూడా ఇదే. 52 వారాల కనిష్టం 28,825.76 డాలర్లు. గత ఇరవై నాలుగు గంటల్లో బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ 752.17 బిలియన్ డాలర్లు క్షీణించింది.

టెర్రా, ఎక్స్ఆర్పీ, అవాలాంచె, కార్డానో, పోల్కాడాట్, డోజీకాయిన్, షిబా ఇను, టెర్రా యూఎస్డీ నష్టాల్లో ట్రేడ్ కాగా, స్టెల్లార్, సోలానా, క్రిప్టో డాట్ కామ్, చైన్ లింక్ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. గత ఇరవై నాలుగు గంటల్లో టాప్ గెయినర్స్ జాబితాలో న్యూసైఫర్ 30 శాతం, ది గ్రాప్ 15 శాతం లాభపడగా, టాప్ లూజర్స్ జాబితాలో ఐఎక్సెక్ ఆర్ఎల్సీ 2.54 శాతం, డిస్ట్రిక్స్ఓఎక్స్ 2.19 శాతం, కుసామా 2.14 శాతం, రెన్ 2.09 శాతం, డోజీకాయిన్ 2.08 శాతం, డోజీకాయిన్ 2.01 శాతం నష్టపోయాయి.