36,000 డాలర్ల దిగువకు బిట్ కాయిన్, డోజీకాయిన్ 2 శాతం జంప్
గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ శనివారం (మే 7) భారీగా క్షీణించింది. ప్రపంచ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ 36,000 దిగువకు పడిపోయింది. ప్రపంచ రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం అయితే భారీగా నష్టపోయింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుతో పాటు వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు కూడా అదే దారిలో నడుస్తున్నాయి. దీంతో క్రిప్టో ఇన్వెస్టర్లు కూడా ఇక్కడి నుండి కొద్దిగా డబ్బులు వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో క్రిప్టో మార్కెట్ క్షీణింస్తోంది.
ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 0.12 శాతం క్షీణించి 35,883 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత ఇరవై నాలుగు గంటల్లో బిట్ కాయిన్ ధర 36,400 డాలర్ల వద్ద గరిష్టాన్ని, 35,719.82 డాలర్ల వద్ద కనిష్టాన్ని తాకింది. గత ఇరవై నాలుగు గంటల్లో 682.95 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ తగ్గింది. 52 వారాల గరిష్టం 68,990.90 డాలర్లు. ఆల్ టైమ్ గరిష్టం కూడా ఇదే. 52 వారాల కనిష్టం 35,943.20 డాలర్లు.

వివిధ క్రిప్టోల విషయానికి వస్తే బిట్ కాయిన్ 0.10 శాతం క్షీణించి 35,905 డాలర్లు, ఎథేరియం 0.37 శాతం తగ్గి 2675 డాలర్లు, ఎక్స్ఆర్పీ 0.29 శాతం తగ్గి 0.594438 వద్ద, టెర్రా 7.32 శాతం తగ్గి 73.23 డాలర్ల వద్ద, సోలానా 0.02 శాతం తగ్గి 81.61 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. మీమ్ కాయిన్స్ డోజీ కాయిన్ 2.10 శాతం ఎగిసి 0.12 డాలర్ల వద్ద, షిబా ఇను 0.15 శాతం తగ్గి 0.0000020 డాలర్ల ట్రేడ్ అయింది.