జనవరి, ఫిబ్రవరిలో క్రెడిట్ కార్డ్ ఖర్చులు తగ్గాయి
పండుగ సీజన్ తర్వాత భారతీయుల క్రెడిట్ కార్డు ఖర్చులు కాస్త తగ్గినట్లుగా కనిపిస్తున్నాయి. యావరేజ్ మంత్లీ మొత్తం క్రెడిట్ కార్డు ఖర్చులు భారతదేశంలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో రూ.84,000 కోట్ల నుండి రూ.88,000 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. అదే సమయంలో డిసెంబర్ త్రైమాసికంలో రూ.94,700 కోట్లుగా ఉంటుందని, దీని కంటే తక్కువ అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఓ నోట్లో తెలిపింది.
2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మంత్రీ యావరేజ్ క్రెడిట్ కార్డు ఖర్చులు రూ.76,700 కోట్లుగా నమోదయింది. ఏప్రిల్ 2019 నుండి చూస్తే డిసెంబర్ 2021లో క్రెడిట్ కార్డ్ టు డెబిట్ కార్డు ఖర్చు రేషియే 1.39Xగా నమోదయింది.

క్రెడిట్ కార్డ్ ఇష్యూయర్ HDFC బ్యాంకు మార్కెట్ షేర్ డిసెంబర్ నాటికి 25.1 శాతం, ఎస్బీఐ మార్కెట్ వాటా 19.8 శాతంగా ఉంది. క్రెడిట్ కార్డ్ ఔట్ స్టాండింగ్ పర్ కార్డ్ డిసెంబర్ 2021లో రూ.18,069 కోట్లుగా నమోదయింది.
ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకులు వృద్ధిని నమోదు చేయగా, పాటు విదేశీ బ్యాంకులు అమెరికన్ ఎక్స్ప్రెస్, సిటీ ఇండియా బ్యాంకులు వరుసగా 11 శాతం, 5 శాతం క్షీణించాయి.