For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆసియా దేశాలలో కోవిడ్ నాజిల్ స్ప్రే ఉత్పత్తి, మార్కెటింగ్: సానోటైజ్ సంస్థతో గ్లెన్‌మార్క్ ఒప్పందం

|

కోవిడ్ -19 చికిత్స కోసం నాజిల్ స్ప్రేని భారతదేశం మరియు ఇతర ఆసియా దేశాలలో వాణిజ్యపరం చేయడానికి కెనడియన్ బయోటెక్ సంస్థ సానోటైజ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ సోమవారం తెలిపింది.

ప్రత్యేకమైన దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యం కింద, గ్లెన్‌మార్క్ మరియు సనోటైజ్ భారతదేశంలో, సింగపూర్, మలేషియా, హాంకాంగ్, తైవాన్, నేపాల్, బ్రూనై, కంబోడియా, లావోస్, మయన్మార్, శ్రీలంక, టిమోర్ లెస్టే మరియు వియత్నాంలో నైట్రిక్ ఆక్సైడ్ నాజిల్ స్ప్రే (NONS) ను తయారు చేయడంతోపాటు మార్కెట్ చేస్తాయి. ఇతర దేశాలకు పంపిణీ చేస్తుందని భారతీయ కంపెనీ గ్లెన్‌మార్క్ ప్రకటించింది.

సానోటైజ్ సంస్థతో భాగస్వామ్యంపై మాట్లాడిన గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ చైర్‌పర్సన్

సానోటైజ్ సంస్థతో భాగస్వామ్యంపై మాట్లాడిన గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ చైర్‌పర్సన్

గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ చైర్‌పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గ్లెన్ సల్దాన్హా మాట్లాడుతూ సానోటైజ్‌తో భాగస్వామ్యం కోవిడ్ -19 కి వ్యతిరేకంగా గ్లెన్‌మార్క్ యొక్క కేంద్రీకృత విధానాన్ని ప్రతిబింబిస్తుందని, ఇది కరోనా మహమ్మారి ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని అన్నారు. ఇది మా కీలక థెరపీ ఏరియా అని ఆయన వివరించారు. రెస్పిరేటరీ మెడిసిన్‌లో మాకు మరో విలువైన ఇన్-లైసెన్సింగ్ అవకాశాన్ని సూచిస్తుందన్నారు . అలాగే సానోటైజ్ సంస్థ దాని భాగస్వాములకు ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తిని అందించే అవకాశాన్ని కూడా సూచిస్తుందని సల్దాన్హా ఒక ప్రకటనలో తెలిపారు.

యాంటీవైరల్ నాజిల్ స్ప్రేని త్వరలో అందుబాటులోకి తెస్తామన్న సానోటైజ్

యాంటీవైరల్ నాజిల్ స్ప్రేని త్వరలో అందుబాటులోకి తెస్తామన్న సానోటైజ్

గ్లెన్‌మార్క్ ఈ ప్రభావవంతమైన నాజిల్ స్ప్రే ని సకాలంలో తయారుచేసి అందించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోగులకు అవసరమైన ఉపశమనం లభిస్తుందని తాము ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. గ్లెన్‌మార్క్‌తో కలిసి సనోటైజ్ తన యాంటీవైరల్ నాజిల్ స్ప్రేని అందుబాటులో ఉంచే ప్రయత్నాలను వేగవంతం చేయగలదని సానోటైజ్ సీఈవో గిల్లి రెగెవ్ వెల్లడించారు. ప్రస్తుత మహమ్మారి సమయంలో కోవిడ్-19 కి వ్యతిరేకంగా మొదటి రక్షణగా, భవిష్యత్తులో వ్యాప్తి చెందకుండా ఉండటానికి నాజిల్ స్ప్రే సహాయపడుతుందని గిల్లి రెగెవ్ ఒక ప్రకటనలో తెలిపారు.

సానోటైజ్ సంస్థ నాజిల్ స్ప్రే క్లినికల్ ట్రయల్స్ లో సక్సెస్

సానోటైజ్ సంస్థ నాజిల్ స్ప్రే క్లినికల్ ట్రయల్స్ లో సక్సెస్

గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ ప్రకారం, నాజిల్ స్ప్రే ముక్కు ద్వారా కరోనావైరస్‌ను చంపడానికి రూపొందించబడింది. ఇది వైరస్ ఊపిరితిత్తులకు వ్యాపించకుండా నిరోధిస్తుంది. ఇది నైట్రిక్ ఆక్సైడ్ (NO) మీద ఆధారపడి పని చేస్తుంది . కోవిడ్ -19 కి కారణమయ్యే వైరస్ అయిన SARS-CoV-2 పై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.సానోటైజ్ నాజిల్ స్ప్రే క్లినికల్ ట్రయల్స్ ఈ సంవత్సరం మార్చిలో నిర్వహించబడ్డాయి. నైట్రిక్ ఆక్సైడ్ నాజిల్ స్ప్రే అనేది కోవిడ్ -19 వ్యాప్తిని నిరోధించడానికి, దాని లక్షణాల తీవ్రతను తగ్గించడానికి సురక్షితమైన మరియు సమర్థవంతమైన యాంటీవైరల్ చికిత్స అని నిరూపించబడింది.

నాజిల్ స్ప్రే దిగుమతి, మార్కెటింగ్ కోసం అనుమతులకు ప్రపోజల్

నాజిల్ స్ప్రే దిగుమతి, మార్కెటింగ్ కోసం అనుమతులకు ప్రపోజల్

నైట్రిక్ ఆక్సైడ్ నాజిల్ స్ప్రే మొదటి 24 గంటల్లో సగటు వైరల్ లోడ్‌ను 95 శాతం తగ్గించిందని , 72 గంటలలోపు 99 శాతానికి పైగా తగ్గించిందని తెలుస్తుంది ఇది యూకే మరియు కెనడా క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఆరోగ్యకరమైన వాలంటీర్లు, రోగులలో పరీక్షించబడిందని సానోటైజ్ తెలిపింది.నాజిల్ స్ప్రే దిగుమతి మరియు మార్కెటింగ్ అత్యవసర ఆమోదం కోసం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీకి కంపెనీ ప్రతిపాదనను సమర్పించినట్లు గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఈ ఏడాది జూలైలో తెలిపింది.

తర్వాత భారతీయ రోగులలో మూడో దశ క్లినికల్ ట్రయల్ నిర్వహించాలని కమిటీ సిఫారసు చేసింది. నైట్రిక్ ఆక్సైడ్ నాజిల్ స్ప్రే కోసం త్వరలోనే మూడో దశ క్లినికల్ ట్రయల్ పూర్తయ్యే అవకాశం ఉంది.

  English summary

  Covid Nasal Spray production and marketing in Asian Countries ; Glenmark Agreement with SaNOtize

  Glenmark Pharmaceuticals on Monday entered into an agreement with Canadian biotech company SaNOtize Research and Development Corporation to commercialize the nasal spray for Covid-19 treatment in India and other Asian countries.
  Story first published: Monday, August 2, 2021, 18:45 [IST]
  Company Search
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X