కోవిడ్ క్లెయిమ్స్ రూ.9,000 కోట్లు, హెల్త్ పాలసీవే రూ.7,100 కోట్లు
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇన్సురెన్స్ కంపెనీలు రూ.9,078 కోట్ల క్లెయిమ్స్ సెటిల్ చేసినట్లు Irdai చైర్మన్ ఎస్సీ కుంతియా తెలిపారు. నాన్-లైఫ్ ఇన్సురర్స్ ఇందులో రూ.7,136 కోట్లు చెల్లింపులు జరిపారు. ఇందులో ఎక్కువగా హెల్త్ ఇన్సురెన్స్ పాలసీ కింద ఉన్నవి. లైఫ్ ఇన్సురెన్స్ ఇండస్ట్రీ కోవిడ్ నేపథ్యంలో డెత్ క్లెయిమ్స్ కింద రూ.1,242 కోట్లు చెల్లించింది. కరోనా కారణంగా లక్షన్నర మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే.
కరోనా ప్రత్యేక ఉత్పత్తుల క్లెయిమ్స్‌ను రూ.700 కోట్ల వరకు సెటిల్ చేశాయి. ఇండస్ట్రీ క్రమంగా కోలుకుందని, ఇన్సూరర్స్ వృద్ధి సానుకూలంగా ఉందని తెలిపారు. కరోనా నుండి ఎదురయ్యే సవాళ్లకు అనుగుణంగా బీమా సంస్థలు ముందుకు సాగుతాయని తెలిపారు. పాలసీలను విక్రయించేటప్పుడు, క్లెయిమ్స్ చేసేటప్పుడు మాత్రమే కాకుండా బీమా కంపెనీలు పాలసీదారులతో నిత్యం సంబంధం కలిగి ఉండాలని అభిప్రాయపడ్డారు.

ప్రామాణాకి ఉత్పత్తులపై స్పందిస్తూ నిబంధనలు ఇన్నోవేషన్‌కు వ్యతిరేకం కాదని, అయితే ఇండస్ట్రీకి కనీస బెంచ్ మార్క్ ఉందన్నారు. శాండ్ బాక్స్ నిబంధనలు మరిన్ని ఎక్కువ బీమా కంపెనీలు వినూత్న ఉత్పత్తులు, సేవలతో ముందుకు వచ్చేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.