For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మందగమనం కాదు.. మాంద్యం: ఇండియన్ ఎకానమీపై బాంబు పేల్చిన అభిజిత్ బెనర్జీ

|

ఓహ్ మై గాడ్.... భయపడినంతా జరిగింది. భారత ప్రస్తుత ఆర్థిక వ్యవస్థపై ప్రముఖ నోబెల్ ప్రైజ్ విజేత అభిజిత్ బెనర్జీ బాంబు పేల్చారు. ఇప్పటివరకు ఇండియన్ ఎకానమీ ఆర్థిక మందగమనం (స్లోడౌన్) లో మాత్రమే ఉందని అంతా భావించారు. ఎందుకంటే ఇటీవలి ప్రభుత్వ గణాంకాల ప్రకారమే జీడీపీ 11 ఏళ్ళ కనిష్ఠానికి పతనమై 4.5% నికి పడిపోయింది. మరింతగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. అయినా... జీడీపీ వృద్ధి రేటు నెమ్మదిస్తే ఫరవాలేదు. దాన్ని కొంత సరిదిద్ది మళ్ళీ పట్టాలెక్కించవచ్చు.

బడ్జెట్‌కు సంబంధించిన మరిన్ని కథనాలు..

ఆర్థిక మాంద్యం

ఆర్థిక మాంద్యం

కానీ ఎకనామిక్స్ లో ఇటీవలే నోబెల్ ప్రైజ్ అందుకున్న అభిజిత్ బెనర్జీ మాత్రం .... ఇండియా ప్రస్తుతం ఆర్థిక మాంద్యాన్ని (రిసెషన్) ఎదుర్కొంటోందని చెప్పారు. ప్రస్తుత డేటా విశ్లేషణలో అదే స్పష్టమవుతోందని కుండబద్దలు కొట్టారు. 'మనం మాంద్యంలో ఉన్నామని చెప్పగలను. డేటాలో ఎక్కడ కూడా మాంద్యంలో లేమని చెప్పే అంశాలు కనిపించటం లేదు. అయితే, మాంద్యం ఎంత స్థాయిలో ఉందని మాత్రం ఇప్పుడే చెప్పలేం' అని అభిజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. కోల్కతాలో జరిగిన ఒక సాహిత్య కార్యక్రమంలో పాల్గొన్న అయన ఈ మేరకు వ్యాఖ్యలు చేసారు. ఈ విషయాన్నీ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) తన కథనంలో వెల్లడించింది.

అనిశ్చితి లో బ్యాంకింగ్ సెక్టార్...

అనిశ్చితి లో బ్యాంకింగ్ సెక్టార్...

భారత బ్యాంకింగ్ సెక్టార్ ప్రస్తుతం పూర్తి అనిశ్చితి లో కొట్టుమిట్టాడుతోందని బెనర్జీ పేర్కొన్నారు. దానిని రీ-ఫైనాన్సింగ్ విధానంలో ప్రభుత్వం వెంటనే సరిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. అదే సమయంలో మౌలికసదుపాయాల రంగానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు సమకూర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా ఈ రెండు రంగాలు అత్యంత కీలకమని, అందుకే ప్రభుత్వం వీటిపై తగిన శ్రద్ధ చూపాలని సూచించారు. బ్యాంకింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలకు భారీ స్థాయిలో నిధులను ప్రభుత్వం అందించాలని చెప్పారు. 58 ఏళ్ళ ఇండియన్ అమెరికన్ ఐన అభిజిత్ బెనర్జీ ... గుడ్ ఎకనామిక్స్ ఫర్ హార్డ్ టైమ్స్ అనే పుస్తకాన్ని రాశారు.

సంపద పన్ను ...

సంపద పన్ను ...

దేశంలో అంతకంతకూ పెరిగి పోతున్న ఆర్థిక అసమానతల దృష్ట్యా.... ఇండియాలో సంపద పన్ను (వెల్త్ టాక్స్) విధించాల్సిన అవసరం ఉందని అభిజిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. తద్వారా సమకూరిన పన్ను ఆదాయాన్ని పేదలకు పంచటం ద్వారా ఆర్థిక అసమానతలు తగ్గించవచ్చని చెప్పారు. అయితే, ప్రస్తుతం ఇండియాలో అది జరుగుతుందని తాను అనుకోవటం లేదన్నారు. సాధారణంగా ఇలాంటి చర్యలు తీసుకోవాలంటే ఏ ప్రభుత్వమైనా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంది. ఒకప్పటి సామ్యవాద ఆర్థికవ్యవస్థలో సంపద పన్ను విధించి పేదలకు పంచటం సహజ ప్రక్రియనే. కానీ ఇండియాతో సహా అనేక దేశాలు క్యాపిటలిస్టిక్ (పెట్టుబడిదారీ) ఆర్థిక విధానాలను అవలంభిస్తున్నాయి. కాబట్టి, ఇప్పుడు ఇలాంటి చర్యలను వెంటనే ఊహించలేం.

ప్రైవేటీకరణ మంచిదే...

ప్రైవేటీకరణ మంచిదే...

అనేక ఆర్థిక అంశాలపై మాట్లాడిన అభిజిత్ బెనర్జీ... ప్రస్తుతం ప్రభుత్వం చేప్పట్టిన ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ మంచి నిర్ణయమేనని చెప్పారు. అయితే, అదే ప్రభుత్వం కార్పొరేట్ టాక్స్ తగ్గింపును మాత్రం పరోక్షంగా అయన తప్పుబట్టారు. కార్పొరేట్ కంపెనీలు భారీ నగదు నిల్వలు కలిగి ఉన్నాయని తెలిపారు. అంటే దాని అర్థం... వాటిపై అధిక పన్ను విధించవచ్చని ఆయన అభిప్రాయం. అదే సమయంలో ఇండియాలో అసంఘటిత రంగాన్ని విశ్లేషించేందుకు తగిన విశ్వసనీయ సమాచారం అందుబాటులో లేదన్నారు. స్వల్పకాలిక విశ్లేషణకు అసలు అవకాశం లేకుండా పోయిందని బెనర్జీ చెప్పారు.

English summary

Country could be passing through recession: Abhijit Banerjee

Nobel laureate and economist Abhijit Banerjee on Monday said the country could be passing through a phase of recession, and there is "nothing in the data" that suggests otherwise.
Story first published: Tuesday, January 28, 2020, 13:46 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more