కరోనా ఎఫెక్ట్: జోరుగా పెరిగిన ఆన్ లైన్ బిజినెస్..వాట్సప్ గ్రూప్స్ లోనే వ్యాపారాలు
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫాం అయిన ఫేస్బుక్ మెసేజింగ్ సేవ సంస్థ వాట్సప్ తన యూజర్స్ కోసం చాలా ఫీచర్స్ అందుబాటులోకి తీసుకురావటమే కాదు వారికి వ్యాపార ప్రయోజనాలను చేకూరుస్తుంది . కరోనా మహమ్మారి చాలామంది వ్యాపారాలపై పెద్ద దెబ్బ వేసింది. షాపులు తెరవలేని పరిస్థితి తీసుకు వచ్చింది. అంతేకాదు కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయంలో వాట్సాప్ ద్వారా కొత్త ఆలోచనలతో చాలా మంది బిజినెస్ ప్రారంభించారు. చాలామందికి వాట్సాప్ ఉపాధిని చూపించింది . అది ఇప్పుడు మరింత విస్తరిస్తుంది.

కరోనా లాక్ డౌన్ తర్వాత వాట్సప్ గ్రూప్స్ లో పెరిగిన బిజినెస్
కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న చాలామంది వాట్సాప్ ద్వారా బట్టల వ్యాపారాన్ని, మహిళలకు కావలసిన వివిధ వస్తువులు, ఆభరణాలు విక్రయించే బిజినెస్ లను మొదలుపెట్టారు. గతంలోనూ వాట్సాప్ గ్రూప్ ల ద్వారా చాలామంది బట్టల వ్యాపారం చేస్తే, కరోనా ప్రభావం తో ఈ సంఖ్య మరింత పెరిగింది. ఇళ్లల్లో నిత్యావసర వస్తువుల దగ్గరనుండి, బట్టలు, మేకప్ సామాగ్రి, మెడిసిన్స్, కూరగాయలు , పండ్లు ఇలా ప్రతి ఒక్కటి వాట్సాప్ ద్వారా విక్రయించడం జోరుగా పెరిగింది.

నిత్యావసరాలు , బట్టలు , మందులు .. ఇలా అన్నీ వాట్సప్ లోనే
కరోనా కారణంగా కావాల్సిన మెడిసిన్స్ కూడా వాట్సప్ ద్వారా ఆర్డర్ చెయ్యటం , డెలివరీ చెయ్యటం జరిగాయంటే వాట్సప్ వ్యాపారులకు ఎంతా ఉపయోగపడిందో అర్ధం చేసుకోవచ్చు . కరోనా లాక్డౌన్ సమయం తర్వాత చాలామంది ఆన్లైన్ ద్వారానే ఎక్కువగా తమకు కావాల్సిన వాటిని కొనుగోలు చేస్తున్నారు. తమకు కావాల్సిన వస్తువులను ఆర్డర్ పెడుతున్నారు . వాట్సాప్ ఇండియా యూజర్స్ బేస్ ప్రస్తుతం 40 కోట్లు గా ఉంది . నిత్యం లక్షలాది మంది తమ వ్యాపారాలను సాగిస్తున్నారు . చాలామందికి ఈ ఆన్లైన్ బిజినెస్ లాభసాటిగా అనిపిస్తుంది.

ఇళ్ళలో ఉండి వాట్సప్ ద్వారానే వ్యాపారాలు
ఇళ్ళల్లో ఉండే చాలా మంది తమ వ్యాపార సామ్రాజ్యాన్ని సోషల్ మీడియా నెట్వర్క్ అయిన వాట్సప్ ద్వారా విస్తరిస్తున్నారు. కస్టమర్లతో కనెక్ట్ అవ్వడం కోసం ప్రస్తుతం వాట్సాప్ ఒక ప్రధాన ఛానల్ గా వ్యాపారస్తులకు ఉపయోగపడుతోంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి వాట్సాప్ ఊతంగా మారింది . ఆర్థికంగా ఎదగడానికి ఎంతగానో దోహదపడుతుంది. దేశంలో లక్షలాది మంది చిన్న వ్యాపారులు తమ కస్టమర్లను చేరుకోవడానికి వాట్సాప్ చాలా సులువు గా వినియోగించుకోవడానికి వీలవుతుంది.

యూజర్ ఫ్రెండ్లీ .. అందుకే ఈజీగా వ్యాపారాలు
ప్రస్తుతం సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ కూడా వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తుండగా, చాలా సులువుగా వాట్సాప్, యూజర్ ఫ్రెండ్లీ గా లక్షలాది మంది చిన్న వ్యాపారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే వ్యాపారాల కోసం వాట్సప్ బిజినెస్ యాప్ కూడా అందుబాటులోకి తెచ్చింది. బిజినెస్ యాప్ ద్వారా కొన్ని వ్యాపారాలకు కావాల్సిన ఫీచర్లను అందిస్తుంది . వాట్సాప్ రెగ్యులర్ యాప్ తో పోల్చుకుంటే వాట్సాప్ బిజినెస్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది.