For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియాలో చైనా పెట్టుబడులు ఎంత పెరిగాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు

|

కరోనా వైరస్ వ్యాప్తి తో చైనా పేరు మరో సారి ప్రపంచమంతా మార్మోగిపోతోంది. ఆ వైరస్ ను సృష్టించింది ఆ దేశమేనని అమెరికా వంటి దేశాలు ఆరోపిస్తుంటే... మిగితా దేశాలు మాత్రం లోలోపల అది నిజమేననే అభిప్రాయంతో ఉన్నాయి. భారత్ మాత్రం మొదట చైనా కు మద్దతు పలికింది. కరోనా వైరస్ విలయానికి తల్లడిల్లుతున్న చైనా కు కావాల్సిన అత్యవసర ఔషధాలు, సామాగ్రి అందించి ఉపశమనం కల్పించింది. కానీ డ్రాగన్ మాత్రం కుక్క తోక వంకర లాగ తన బుద్ధి మార్చుకోలేదు. ఒక వైపు మనతో స్నేహం నటిస్తూనే వెన్ను పోటు పొడిచేందుకు సన్నద్ధం ఐంది.

నేపాల్ తో పరోక్షంగా మనపై దాడికి దిగుతోంది. ఇటీవల గాల్వన్ లోయలో 20 మంది భారత సైనికుల ప్రాణాలను బలిగొని కయ్యానికి కాలుదువ్వుతోంది. ఇందులో మన తెలుగు సైనికుడు కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందారు. దీంతో దేశంలో ఒక్కసారిగా చైనా పై వ్యతిరేకత పెరిగిపోయింది. చైనా వస్తువులను బహిష్కరించాలని ఆందోళన లు మిన్నంటుతున్నాయి. కొంత మంది చైనా ప్రొడక్టులను టోకుగా విక్రయించే వర్తకులు కూడా తాము ఆ ప్రొడక్టులను విక్రయించకూడని నిర్ణయించారు. దీంతో చైనా కు సంబంధించిన అన్ని అంశాలు ఇప్పుడు దేశంలో ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.

boycott china: చైనీయులకు గదులివ్వం, భోజనం పెట్టం.. హోటల్స్&రెస్టారెంట్స్

12 రెట్లు పెరిగిన చైనా పెట్టుబడులు...

12 రెట్లు పెరిగిన చైనా పెట్టుబడులు...

చైనా ఒకప్పుడు కేవలం చవక వస్తువులను ఎగుమతి చేసే దేశంగా మాత్రమే ఉండేది. కానీ 2015 తర్వాత వ్యూహాలు మార్చింది. స్టార్టుప్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెడుతూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ విషయంలో ఇండియాలో మరింత అధికంగా పెట్టుబడులు పెట్టాయి చైనా సంస్థలు. 2016 నుంచి 2019 వరకు భారత్ లో చైనా పెట్టుబడులు ఏకంగా 12 రెట్లు పెరగటం గమనార్హం. 2016 లో చైనా పెట్టుబడులు కేవలం 381 మిలియన్ డాలర్లు (సుమారు రూ 3,048 కోట్లు) మాత్రమే కాగా... 2019 నాటికి అవి 4.6 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ 36,800 కోట్లు) పెరిగాయి. ప్రముఖ రీసెర్చ్ సంస్థ గ్లోబల్ డేటా నివేదికను ఉటంకిస్తూ ప్రముఖ వార్తా ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఈ మేరకు ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది.

అన్నిట్లో వాటిదే ఆధిపత్యం...

అన్నిట్లో వాటిదే ఆధిపత్యం...

భారత్ లోని యునికార్న్ స్టార్టుప్ కంపెనీల్లో మెజారిటీ పెట్టుబడులు కేవలం రెండు చైనా కంపెనీల నుంచే వస్తుండటం గమనార్హం. అందులో చైనా కుబేరుడు జాక్ మా కు చెందిన అలీబాబా గ్రూప్ ఒకటి కాగా... రెండోది టెన్సెన్ట్ గ్రూప్. ఇండియా లో ప్రస్తుతం 24 యునికార్న్ స్టార్టుప్ కంపెనీలు ఉండగా... అందులో 17 యునికార్న్ కంపెనీల్లో చైనా పెట్టుబడులు అత్యధిక స్థాయిలో ఉన్నాయి. ఇదే ప్రస్తుతం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఒక 1 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ సాధించిన కంపెనీలను యూనికార్న్ కంపెనీలుగా పరిగణిస్తారు. ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రతి స్టార్టుప్ కంపెనీల్లోనూ చైనా పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. కొన్నిట్లో ఐతే పూర్తిగా చైనా పెట్టుబడి సంస్థల ఆధిపత్యం నడుస్తోంది. దీంతో ఆర్థికవేత్తలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పేటీఎం.. ఓలా ... బైజూస్...

పేటీఎం.. ఓలా ... బైజూస్...

మనం మనవి అనుకుంటున్న స్టార్టప్ కంపెనీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తిగా మనది కాదు అనే విషయమే అతిపెద్ద చర్చనీయాంశంగా మారిపోతోంది. పేటీఎం, బిగ్ బాస్కెట్, స్నాప్ డీల్, జొమాటో కంపెనీల్లో అలీబాబా గ్రూప్ భారీ స్థాయి పెట్టుబడులు పెట్టింది. ఓలా, స్విగ్గి, బైజూస్, హైక్, డ్రీమ్ 11 అనే సంస్థల్లో టెన్సెన్ట్ పెట్టుబడులు కుమ్మరించింది. కేవలం అలీబాబా, టెన్సెన్ట్ మాత్రమే కాకుండా మరో డజన్ వరకు చైనా కు చెందిన పెట్టుబడి సంస్థలు ఇండియన్ స్టార్టుప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశాయి. అయితే, ప్రస్తుతం భారత్ - చైనా ల మధ్య నెలకొన్న వివాదంతో దీనికి తాత్కాలిక బ్రేకులు పడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ ఇరు దేశాల మధ్య భారీ స్థాయిలో ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతుండటంతో వెంటనే రెండు దేశాల మధ్య తెగదెంపులు జరుగుతాయని భావించలేమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

English summary

Chinese investments in Indian start-ups grow 12 times to USD 4.6 bn in 2019

There has been a 12 times growth of Chinese investments in Indian start-ups over the past four years to USD 4.6 billion in 2019 from USD 381 million in 2016 with a majority of unicorns in India being backed by corporates and pure-play investment firms from China, according to data and analytics firm GlobalData.
Story first published: Saturday, June 27, 2020, 13:44 [IST]
Company Search