For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Covid 19: ఇదీ చైనా ఆర్థిక దుస్థితి, 44 ఏళ్లలో ఇలా జరగలేదు! డ్రాగన్‌కు 2 సవాళ్లు

|

కరోనా మహమ్మారి పుట్టిన చైనాలో అమెరికా, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలతో పోలిస్తే కేసులు, మృతుల సంఖ్య తక్కువగానే కనిపిస్తోంది. కరోనా ప్రభావం ఆ దేశాలతో చూస్తే చైనాపై తక్కువ ఉండవచ్చుననే వాదనలు వినిపించాయి. కానీ ఈ వైరస్ వల్ల చైనా ఆర్థిక వ్యవస్థ కూడా భారీగానే దెబ్బతింటుందని, 2020లో వృద్ధి రేటు పూర్తిగా తుడిచిపెట్టుకు పోతోందని అంటున్నారు. దీంతో లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది.

ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచం: ఐక్యరాజ్య సమితి, భారత్-చైనాలకు మాత్రం ఊరట!

14 ట్రిలియన్ డాలర్ల ప్రభావం

14 ట్రిలియన్ డాలర్ల ప్రభావం

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాలో వృద్ధిరేటు ఈ ఏడాది 1 శాతం లేదా 2 శాతం పడిపోవచ్చునని అంచనాలున్నాయి. 2019లో 6.1 శాతం వృద్ది రేటు నమోదయింది. తక్కువలో తక్కువగా అయినా 14 ట్రిలియన్ డాలర్ల మేర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడవచ్చునని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది.

44 ఏళ్ల తర్వత చైనాపై భారీ ప్రభావం

44 ఏళ్ల తర్వత చైనాపై భారీ ప్రభావం

అదే జరిగితే చైనాకు 44 ఏళ్లలో అత్యంత బలహీన వృద్ధి అవుతుంది. 2008-2009 ప్రపంచ సంక్షోభం సమయంలోను ఇంతలా చైనా దెబ్బతినలేదు. అలాగే 1990లో టియానన్మెన్ స్క్వేర్ కంటే ఎక్కువగా ప్రభావం పడనుంది. మొత్తంగా దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత చైనాపై ఆర్థికంగా భారీ ప్రభావం పడనుంది.

జీడీపీ టార్గెట్ వద్దు.. చైనా

జీడీపీ టార్గెట్ వద్దు.. చైనా

కరోనా కారణంగా యూపీఎస్, గోల్డ్‌మన్ సాచ్ ఈ ఏడాది చైనా వృద్ధి రేటును వరుసగా 1.5 శాతం, 3 శాతానికి తగ్గించాయి 1985 నుండి చైనా జీడీపీ టార్గెట్‌ని నిర్దేశిస్తున్న అధికారులు కూడా ఈసారి అప్రమత్తంగా ఉన్నారు. 2020 జీడీపీ లక్ష్యాన్ని నిర్దేశించకూడదని పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBOC) విధానరూపకర్తలకు సూచించింది.

అవును.. వృద్ధి పడిపోవచ్చు

అవును.. వృద్ధి పడిపోవచ్చు

చైనా 4 శాతం లేదా 5 శాతం వృద్ధి రేటును కూడా సాధించే అవకాశాలు లేవని, అసలు ఈ ఏడాది 1 శాతం లేదా 2 శాతానికి కూడా పడిపోవచ్చునని కూడా కొంతమంది అంచనా వేస్తున్నారు. అలాగే ఉండవచ్చునని చైనా సెంట్రల్ బ్యాంకు మానిటరీ పాలసీ సభ్యుడు ఒకరు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. తీవ్ర అస్థిరతలు నెలకొని ఉన్నాయని, ఎంత భారీ ఆర్థిక, ద్రవ్య ఉద్దీపనలు ప్రకటించాలో అర్థం కాని పరిస్థితుల్లో చైనా ఉందంటున్నారు. అయితే అవాస్తవిక వృద్ధి లక్ష్యం స్థానిక ప్రభుత్వాల మౌలిక సదుపాయాల పెట్టుబడులను ప్రోత్సహిస్తుందని, నిరుద్యోగాన్ని తగ్గించేందుకు, స్వల్పకాలిక ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడానికే అంటున్నారు.

నిరుద్యోగులకు రెండింతలు

నిరుద్యోగులకు రెండింతలు

చిన్న వ్యాపారులకు అదనపు ఆర్థిక సాయం కోసం 3 ట్రిలియన్ యువాన్ల అదనపు మొత్తానికి చైనా మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. చిన్న, మధ్య తరహా బ్యాంకులకు పీబీఓసీ అదనంగా 1 ట్రిలియన్ యువాన్లు అందిస్తుంది. నిల్వలు తగ్గించుకుంటుంది. తద్వారా చిన్న మధ్య తరహా సంస్థలకు భారీగా రుణాలు ఇస్తుంది. మహమ్మారిపై పోరుకు చైనా ద్రవ్యాన్ని పంప్ చేస్తోంది. ఉద్దీపనల కోసం ఖర్చు పెడుతోంది. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు, మార్చి నుండి జూన్ వరకు నిరుద్యోగులకు టెంపరరీ క్యాష్‌ను రెండింతలు చేస్తామని తెలిపింది. ఎంత ఇస్తామని స్పష్టంగా చెప్పనప్పటికీ, ఈ చర్య 67 మిలియన్ల మందికి ఉపకరిస్తుంది.

దాదాపు సగం పడిపోయిన ఆటో పరిశ్రమ

దాదాపు సగం పడిపోయిన ఆటో పరిశ్రమ

జనవరి, ఫిబ్రవరిలో ఆటో అమ్మకాలు 42 శాతం మేర పడిపోయాయి. ఈ పరిశ్రమను పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం రెండేళ్ల పాటు సబ్సిడీలు, పన్ను మినహాయింపులు పొడిగించనుందట. అలాగే ఉపయోగించిన కార్లపై అమ్మకపు పన్నును 2023 చివరి వరకు మినహాయిస్తుందట.

ఇప్పుడిప్పుడే సడలింపు

ఇప్పుడిప్పుడే సడలింపు

చైనాలో ఉత్పాదక కార్యకలాపాలు మార్చి నెలలో కాస్త ప్రారంభమయ్యాయని ఓ ప్రయివేటు సంస్థ వెల్లడించింది. అంతకుముందు మూసివేతలు, ప్రయాణ పరిమితులు ఉండవని, వీటిపై ఇప్పుడు కాస్త సడలింపు వచ్చింది. కైక్సిన్/మార్కిట్ మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఫిబ్రవరి నెలలోని 40.3 రికార్డ్ కనిష్టం నుండి ప్రస్తుతం 50కి పెరిగిందని అంటున్నారు. కానీ చైనా ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదని అంటున్నారు. జనవరి, ఫిబ్రవరి కంటే ప్రస్తుతం పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయని, అయినప్పటికీ చాలా చాలా బలహీనంగా ఉందని కైగ్జిన్ సర్వే వెల్లడించింది.

చైనా ఎదుర్కొంటున్న రెండు ప్రధాన ఇబ్బందులు

చైనా ఎదుర్కొంటున్న రెండు ప్రధాన ఇబ్బందులు

ఈ ఏడాది చైనా ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉంటుందని, తొలి క్వార్టర్‌లో జీడీపీ 16 శాతంగా ఉంటుందని, 2020లో మాత్రం 3 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. చైనా ప్రస్తుతం రెండు ప్రధాన ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కరోనా మహమ్మారి కారణంగా విదేశీ డిమాండ్ పడిపోవడం, కరోనా కేసులు రోజు రోజుకు పెరగడం.

చైనా జీడీపీ 1 శాతమే

చైనా జీడీపీ 1 శాతమే

2020లో చైనా వృద్ధి రేటు కేవలం 1 శాతం మాత్రమే ఉంటుందని నోమురా అంచనా వేసింది. చైనా జీడీపీలో సర్వీసెస్ ఇండస్ట్రీ వాటా దాదాపు 60 శాతం వాటాను కలిగి ఉంది. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థకు ఇది మరింత సహకారం అందించాలని సూచనలు వస్తున్నాయి. ఇండివిడ్యువల్స్, లేబర్ మార్కెట్, హెల్త్ కేర్ సిస్టమ్‌తో పాటు మౌలిక సదుపాయాలపై మరిన్ని పెట్టుబడులు, వడ్డీ రేట్ల తగ్గింపు వంటివి ఉంటాయని చైనా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. చైనా ప్రభుత్వం ఈసారి జీడీపీ లక్ష్యాన్ని గణనీయంగా తగ్గిస్తుందని భావిస్తున్నామని చెబుతున్నారు. కరోనా నియంత్రణ, పేదరికం, కార్మిక మార్కెట్‌కు మద్దతు ఇవ్వడంపై దృష్టి పెట్టాలని అంటున్నారు.

English summary

China's economy may not grow at all in 2020 year

China's economy is showing some tentative signs of recovery from the devastation caused by the novel coronavirus pandemic but the path ahead remains hugely uncertain and growth could be entirely wiped out in 2020, putting millions of jobs at risk.
Story first published: Thursday, April 2, 2020, 9:49 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more