For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

China Power crisis: చైనాలో విద్యుత్ సంక్షోభం, ట్రాఫిక్ లైట్లు వెలగని పరిస్థితి, ఎందుకంటే

|

చైనాలో ఎవర్ గ్రాండ్ సంక్షోభం ముగుస్తుందని ఆశిస్తోన్న సమయంలోనే మరో ప్రమాదం వచ్చి పడింది. చైనాలో తీవ్రమైన ఎలక్ట్రిసిటీ సంక్షోభం తలెత్తింది. దీంతో చైనా మందగమనం కేవలం ప్రాపర్టీ రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచ అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి దేశం చైనా. ఈ దేశం ఇప్పుడు అధిక ఇంధన ధరలు, కార్బన్ ఉద్గారాలపై కఠిన ఆంక్షల నేపథ్యంలో తీవ్రమైన విద్యుత్ కొరతను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఎవర్ గ్రాండ్ సమస్య పరిష్కారానికి చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు విద్యుత్ సంక్షోభం తలెత్తింది.

గత కొద్ది దశాబ్దాలుగా అంచెలంచెలుగా ఎదిగిన చైనా ఇప్పుడు ప్రపంచ కర్మాగారంగా పేరొందింది. దీంతో ఇక్కడ ఏ సమస్య తలెత్తినా అది ప్రపంచాన్ని కలవరపెడుతోంది. చైనాలో విద్యుత్ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందంటే కొన్ని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ లైట్లు కూడా వెలగడం లేదు. ఐరోపా సహా ఆసియా దేశాలకి ప్రధాన ఎగుమతిదారు చైనా. చైనాలో విద్యుత్ సంక్షోభం కారణంగా ఉత్పత్తి దెబ్బతినే అవకాశం ఉంది.

విద్యుత్ డిమాండ్ జంప్

విద్యుత్ డిమాండ్ జంప్

కరోనా మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని తిరిగి ప్రారంభించింది. డిమాండ్ పెరుగుతోన్న ఇలాంటి పరిస్థితుల్లో బొగ్గు, విద్యుత్.. రెండింటిలోను తీవ్ర కొరత ఎదుర్కొంటోంది చైనా. బొగ్గు గని ఉత్పత్తి లక్ష్యాన్ని కొనసాగించడంలో విఫలమైంది. జనరేటర్లు ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక రికవరీ వేగవంతంగా ఉందనేందుకు నిదర్శనంగా 2021 క్యాలెండర్ ఏడాదిలో ఎనిమిది నెలల కాలంలో చైనా ఎలక్ట్రిసిటీ జనరేషన్ 616 టెరావాట్ హవర్స్ (13 శాతం పెరుగుదల)కు పెరిగింది.

సేవారంగంలో విద్యుత్ వినియోగం 22 శాతం, ప్రైమరీ ఇండస్ట్రీ రంగంలో 20 శాతం పెరిగింది. నెమ్మదిగా కోలుకుంటున్న మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో 13 శాతం, రెసిడెన్షియల్ వినియోగంలో 8 శాతం పెరిగింది.

నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం థర్మల్ జనరేటర్లు, ప్రధానంగా బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల ద్వారా మొదటి ఎనిమిది నెలల కాలంలో అత్యధిక పెరుగుదల 465 టెరావాట్ హవర్స్(14 శాతం పెరుగుదల) నమోదయింది.

హైడ్రో ఎలక్ట్రిక్ ఔట్ పుట్ వాస్తవానికి ఈ సంవత్సరం కాస్త క్షీణించింది. 2018 తర్వాత ఇదే అత్యల్పం. ఈ లోటును భర్తీ చేయడానికి థర్మల్ జనరేటర్లపై ఒత్తిడి పెరుగుతోంది. థర్మల్ జనరేటర్ యూనిట్స్ మొదటి ఏడు నెలల్లో సగటున 2,589 గంటలు నడిచాయి. గత ఏడాది ఇది 2,321గా ఉంది. అంటే 12 శాతం అధికం.థర్మల్ ఉత్పాదన పెరుగుదలను ధృవీకరిస్తూ జాతీయ రైల్ నెట్ వర్క్‌లో సరుకుల రవాణా సంవత్సరంలోని మొదటి ఎనిమిది నెలల్లో 11 శాతం పెరిగాయి.

భారీగా పెరిగిన బొగ్గు ధర

భారీగా పెరిగిన బొగ్గు ధర

రైలు ద్వారా రవాణా చేయబడే ముఖ్య వస్తువుల్లో బొగ్గు ఒకటి. పవర్ జనరేషన్, పారిశ్రామిక వినియోగం కోసం బొగ్గుకు డిమాండ్ పెరిగింది. ఎన్బీఎస్ నెలవారీ నివేదిక ప్రకారం 2020తో పోలిస్తే కోల్ మైనింగ్ ప్రొడక్షన్ 6 శాతం పెరిగింది. దీంతో ఇటీవల బొగ్గు నిల్వలు క్షీణించాయి. దీంతో ఇప్పుడు విద్యుత్ ప్లాంట్స్‌లో తక్కువ నిల్వలకు, బొగ్గు ధరలపై ఒత్తిడి పెరగడానికి కారణమైంది.

దీంతో బొగ్గు ధరలు విపరీతంగా పెరిగాయి. గత ఏడాది ఇదే కాలంలో టన్ను బొగ్గు 90 డాలర్లుగా ఉన్న బొగ్గు ధర ఇప్పుడు ఏకంగా రెండింతల కంటే ఎక్కువ పెరిగి 210 డాలర్లకు పెరిగింది. అవసరానికి అనుగుణంగా దేశీయ బొగ్గు, గ్యాస్ ఉత్పత్తిని పెంచవలసిన అవసరం ఉందని నేషనల్ ఎనర్జీ అడ్మినిస్ట్రేషన్ అండ్ నేషనల్ డెవలప్‌మెంట్ అండ్ రీఫార్మ్ కమిషన్‌లోని ప్రతినిధులు చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టవలసి ఉందని అంటున్నారు.

ఎందుకిలా?

ఎందుకిలా?

చైనా విద్యుత్ కొరతకు పలు కారణాలు ఉన్నాయి. కరోనా ఆంక్షల అనంతరం ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్యం పుంజుకోవడంతో చైనాలో ఉత్పత్తి పెరిగింది. దీంతో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా డిమాండ్ పుంజుకుంది. 2020తో పోలిస్తే 2021లో విద్యుత్ వినియోగం పదమూడు సాతం పెరిగింది.

డిమాండ్‌కు తగిన స్థాయిలో ఉత్పత్తి లేకపోవడంతో కోతలు తప్పడం లేదు. అలాగే, చైనాలో విద్యుదుత్పత్తి ఎక్కువగా బొగ్గుపై ఆధారపడింది. ఇదే సమయంలో బొగ్గు కొరత కూడా రావడం సమస్యను మరింత తీవ్రతరం చేసింది. ఈ ఏడాది జల విద్యుదుత్పత్తి రెండేళ్ల కనిష్టానికి పడిపోయింది. దీంతో బొగ్గు ఆధారిత కేంద్రాలపై ఒత్తిడి పెరిగింది. విద్యుత్ డిమాండ్ పదమూడు శాతం పెరిగితే, బొగ్గు ఉత్పత్తి ఆరు శాతం మాత్రమే పెరిగింది.

పైగా రెండు ప్రధాన పోర్టులు మూసివేయడంతో బొగ్గు దిగుమతులు పడిపోయాయి. ఈ ప్రభావం కూడా చూపింది. 2060 నాటికి చైనాను కర్బనరహిత దేశంగా మార్చాలని భావిస్తోంది. ఈ లక్ష్యాన్ని చేరుకునే దిశగా ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. దీంతో బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి పలు అనుమతులు అవసరం. అనుమతి లభించినా బొగ్గు గనుల్లో ప్రమాదాలు ఆందోళన కలిగించే అంశాలు. ఇప్పుడు ఉత్పత్తి ప్రారంభించినా సమయం పడుతుంది.

కర్బన రహిత లక్ష్యంలో భాగంగా చైనా ప్రభుత్వం అక్కడి రాష్ట్రాలకు టార్గెట్‌లను నిర్దేశించింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుదుత్పత్తిపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇది కూడా విద్యుత్తు కోతకు దారి తీస్తోంది.

చైనా బొగ్గు వనరుల్లో దిగుమతులు అధికమే. ఆస్ట్రేలియా నుండి పెద్ద ఎత్తున బొగ్గు వస్తుంది. ఇటీవల ఇక్కడి నుండి బొగ్గు దిగుమతి ఆగిపోయింది.

English summary

China Power crisis: What has caused China’s electricity shortages?

China's slowdown might not just be limited to the property sector. The largest power producing country in the world now faces power shortages due to high fuel prices and a crackdown on carbon emissions.
Story first published: Wednesday, September 29, 2021, 14:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X