భారత్ పదేపదే ఇదే మాట: 43 యాప్స్ నిషేధంపై చైనా అక్కసు
బీజింగ్: చైనాకు చెందిన 43 యాప్స్‌ను భారత ప్రభుత్వం నిషేధించడంపై డ్రాగన్ కంట్రీ స్పందించింది. ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశ భద్రత పేరుతో భారత్ తమ యాప్స్‌ను పదేపదే నిషేధిస్తోందని, దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపింది. భారత్ ఈ చర్యల ద్వారా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(WTO) నిబంధనలను ఉల్లంఘిస్తోందని విమర్శించింది. భారత్‌లోని రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి జీరాంగ్ ఓ ప్రకటనలో భారత్ నిర్ణయం నేపథ్యంలో తమ అక్కసు వెళ్లగక్కారు.
డ్రాగన్ కంట్రీకి భారత్ షాక్, 43 చైనా యాప్స్‌పై నిషేధం

పదేపదే దేశ భద్రతను..
చైనా యాప్స్‌ను నిషేధించడం కోసం భారత్ పదేపదే తమ దేశ భద్రతను పదేపదే ఉపయోగిస్తోందని, దీనిని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. భారత్ మార్కెట్ ప్లేయర్స్ అందరికీ సరసమైన, నిష్పాక్షికమైన, వివక్షలేని వ్యాపార వాతావరణాన్ని అందించాలని కోరుకుంటున్నామని తెలిపింది. వివక్షతో కూడిన పద్ధతులను సరిదిద్దుకుంటుందని భావిస్తున్నామని భారత్ పైన తన అక్కసును మరోసారి చూపించింది. విదేశాల్లోని చైనా కంపెనీలు అంతర్జాతీయ నిబంధనలకు లోబడి పని చేస్తున్నట్లు తెలిపారు.

వివాదాల కంటే పరస్పర అభివృద్ధి
భారత్ మాత్రం WTO నిబంధనలను ఉల్లంఘిస్తూ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. చైనా, భారత్ వివాదాల కంటే పరస్పర అభివృద్ధి అవకాశాలు ఉన్నాయని, ఇరుదేశాల ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య సంబంధాలను తిరిగి గాడిలో పెట్టాల్సిన బాధ్యత రెండు దేశాలపై ఉందన్నారు. చర్చల ద్వారా పరిష్కారమవుతుందన్నారు.

వరుసగా నిషేధం
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రత దృష్ట్యా మన ప్రభుత్వం గత కొన్ని నెలలుగా చైనాకు చెందిన వివిధ యాప్స్‌ను బ్యాన్ చేస్తోంది. గాల్వాన్ ఘటన అనంతరం టిక్‌టాక్, హెలో సహా 59 యాప్స్‌ను నిషేధించింది. ఆ తర్వాత మరిన్న యాప్స్ పైన ఉక్కుపాదం మోపింది. తాజాగా మరో 43 యాప్స్‌ను నిషేధించింది. తాజాగా నిషేధించిన యాప్స్‌లో చైనా వ్యాపార దిగ్గజ సంస్థ అలీ ఎక్స్‌ప్రెస్ ఉంది. అలాగే అలీబాబా వర్క్ బెంచ్, హీరోస్ ఎవాల్వ్డ్, డింగ్ టాక్ ఉన్నాయి. ఐటీ సెక్షన్ 69ఏ ప్రకారం ఈ బ్యాన్ విధించినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ బ్యాన్ విధించడానికి గల కారణాలను కేంద్రం వెల్లడించింది. భారత సమగ్రతకు, సార్వభౌమాధికారానికి భంగం కలిగే అవకాశం ఉందని, అలాగే రక్షణరంగ, కేంద్ర-రాష్ట్ర ప్రజల భద్రత దృష్ట్యా ఈ అప్లికేషన్లను బ్యాన్ చేసినట్లు తెలిపింది. కేంద్రం మొదట 59 యాప్స్‌ను బ్యాన్ చేసింది. ఆ తర్వాత 118 యాప్స్‌ను, తాజాగా 43 యాప్స బ్యాన్ చేయడంతో మొత్తం అప్లికేషన్ల సంఖ్య 200 దాటి 267కు చేరుకున్నాయి. నిషేధానికి గురైన యాప్స్‌లో పబ్జీ, టిక్‌టాక్, హెలో, యూసీ బ్రౌజర్ వంటివి ఉన్నాయి. మొదట గేమింగ్ యాప్స్‌ను నిషేధించిన కేంద్రం ఇప్పుడు డేటింగ్, కామర్స్ యాప్స్‌ను బ్యాన్ చేసింది.