For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టార్టప్ డీల్: బైజూస్ చేతికి మూడేళ్ల స్టార్టప్ కంపెనీ.. విలువ రూ 800 కోట్లు!

|

దేశంలో స్టార్టప్ కంపెనీల మధ్య కన్సాలిడేషన్ మరింత ఊపందుకున్నట్లు కనిపిస్తోంది. ఈ దిశగా ఇటీవలే డెకా కార్న్ క్లబ్ లో చేరిపోయిన ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ బైజూస్ వడివడిగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. భారీ స్థాయిలో ఫండింగ్ సాధించిన బైజూస్ ... ఇప్పుడు తన విస్తరణ ప్రణాళికలకు సరిపోయే కంపెనీల వేటలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సందేహాలను నివృత్తి చేసే ఆన్లైన్ ప్లాట్ఫారం డౌట్ నట్ అనే స్టార్టుప్ కంపెనీ ని ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

ఈ మేరకు ఈ రెండు కంపెనీల మధ్య జోరుగా చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారం. డౌట్ నట్ కొనుగోలు చేసేందుకు బైజూస్ తుది చర్చల దశకు చేరుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో త్వరలోనే ఈ స్టార్టుప్ కంపెనీ బైజూస్ చేతికి అందివచ్చే అవకాశం ఉంది. ఈ లావాదేవీ పూర్తయితే బైజూస్ కు మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అవకాశం లభిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఫేస్‌బుక్‌కు కంపెనీలు 'యాడ్ బహిష్కరణ', రూ.53వేల కోట్ల నష్టపోయిన మార్క్ జుకర్‌బర్గ్

అందుకే గురి...

అందుకే గురి...

తనుశ్రీ నాగోరి, ఆదిత్య శంకర్ లు 2017 లో డౌట్ నట్ ను స్థాపించారు. కె 12 విద్యార్థులకు అనేక సబ్జెక్టుల్లో ఉండే రకరకాల అనుమానాలు ఇది నివృత్తి చేస్తుంది. విద్యార్థికి ఏదైనా ఒక డౌట్ ఉంటే దానికి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ తీసి, డౌట్ నట్ కు పంపించాల్సి ఉంటుంది. వారు వీడియో ల రూపంలో సందేహాలను నివృత్తి చేస్తారు. మాథెమాటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టులతో పాటు జెఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేస్తున్నారు.

డౌట్ నట్ వెబ్సైటు, మొబైల్ ఆప్, వాట్సాప్, యూట్యూబ్ ఛానల్ ను నెలకు సుమారు 1.3 కోట్ల మంది విద్యార్థులు తమ సందేహాల నివృత్తి కోసం సందర్శిస్తున్నారు. ఇప్పటి వరకు డౌట్ నట్ సుమారు 25 కోట్ల సందేహాలను నివృత్తి చేసింది. ప్రాంతీయ భాషల్లో కూడా సేవలు అందిస్తుండటం అదనపు ఆకర్షణగా ఉంటోంది. మరో వైపు ఈ సేవలు పూర్తి ఉచితం కావటం మరో విశేషం.

15 మిలియన్ డాలర్ల పెట్టుబడి...

15 మిలియన్ డాలర్ల పెట్టుబడి...

ఇప్పటి వరకు ఎలాంటి ఆదాయ వనరులు లేని డౌట్ నట్ కు పెట్టుబడుల వెల్లువ మాత్రం కొనసాగుతోంది. ఇటీవల చైనా కు చెందిన ప్రముఖ పెట్టుబడి సంస్థ టెన్సెన్ట్ నేతృత్వంలో ఈ కంపెనీ కి 15 మిలియన్ డాలర్ల (సుమారు రూ 120 కోట్లు) పెట్టుబడి లభించింది.

దీంతో కంపెనీ కార్యకలాపాల విస్తరణ, టెక్నాలజీ అభివృద్ధి వంటి అంశాలపై డౌట్ నట్ దృష్టి సారించేందుకు మార్గం సుగమం అవుతుంది. సాధారణంగా ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీలకు ఇటీవల డిమాండ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యమ్గా కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందుకే ఆన్లైన్ లో పాఠాలు బోధించే ప్లాట్ఫారం లకు అటు ఇన్వెస్టర్ల నుంచి ఇటు వినియోగదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉంటోంది.

100 మిలియన్ డాలర్ల విలువ...

100 మిలియన్ డాలర్ల విలువ...

డౌట్ నట్ ను స్థాపించి కేవలం 3 సంవత్సరాలు మాత్రమే అవుతోంది. కానీ, ఇటీవల లభించిన ఫండింగ్ తో ఈ కంపెనీ విలువ అమాంతం పెరిగిపోయింది. ఎంట్రాకర్ కథనం ప్రకారం దీని విలువ ఇప్పటికే 100 మిలియన్ డాలర్లు (దాదాపు రూ 800 కోట్లు) గా ఉందని తెలుస్తోంది. ఒక వేల బైజూస్ ఈ కంపెనీని పూర్తిగా కొనుగోలు చేస్తే కూడా అదే స్థాయి విలువ లభించే అవకాశం ఉందని చెబుతున్నారు.

డౌట్ నట్ ను కొనుగోలు చేయటం ద్వారా బైజూస్ చిన్న స్థాయి పట్టణాలకు కూడా తన సేవలు విస్తరించే అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే నగరాల్లో బైజూస్ కు మంచి పట్టు ఉంది. కానీ ప్రాంతీయ భాషల్లో సేవలు అందించే డౌట్ నట్ తో దేశంలో తన విస్తరణ మరింత వేగంగా జరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

English summary

Byju's in talks to acquire Doubtnut at a valuation of over dollar 100 Mn

Edtech major Byju’s is in late-stage talks to acquire multilingual instant doubt clearing app Doubtnut, according to two people familiar with the matter. This comes just months after Doubtnut raised $15 million in a round led by Tencent.
Story first published: Sunday, June 28, 2020, 11:59 [IST]
Company Search