For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డెకాకార్న్ క్లబ్ లోకి బైజూస్.. 10 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్!

|

ఒక స్టార్టప్ కంపెనీ స్థాపించి దానిని విజయవంతంగా నడపటమే కష్టం. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అయినా సక్సెస్ అవుతారన్న నమ్మకం ఉండదు. 100 స్టార్టప్ కంపెనీలు ప్రారంభిస్తే... 5 ఏళ్ళ లోపే 95 స్టార్టుప్ కంపెనీలు కనుమరుగు అయిపోతాయి. ఏదో మిగిలిన 5 సంస్థలే మనుగడ సాగిస్తూ ముందుకు వెళతాయి. వాటిలో కూడా రూ 100 కోట్లు, రూ 1,000 కోట్ల టర్నోవర్ లేదా వాల్యుయేషన్ కు చేరుకోవాలంటే జీవిత కాలం పడుతుంది. కానీ వీటికి పూర్తి భిన్నంగా కొన్ని సంస్థలు మాత్రం ఆకాశమే హద్దుగా ఎదుగుతాయి.

మన దేశం నుంచి అలా ఎదిగిన మొదటి స్టార్టుప్ కంపెనీ ఫ్లిప్కార్ట్ అని చెప్పొచ్చు. 2007 లో ఏర్పాటైన ఫ్లిప్కార్ట్ ... అమెరికా రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ కొనుగోలు చేసే సమయానికి 16 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ సాధించి దేశ చరిత్రలోనే అత్యంత వేగంగా అంత విలువ సాధించిన కంపెనీగా అవతరించింది. కొన్ని లక్షల మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు భారీ కళలు కనేందుకు దోహదపడింది. ఇప్పుడు సరిగ్గా అలాగే మరో స్టార్టుప్ ధ్రువ తార వెలుగుతోంది. అదే బైజూస్.

ప్లీజ్.. చైనా కంపెనీవి చూపించొద్దు: రిటైలర్స్‌కు షాక్, ఆ దెబ్బతో 'మేడిన్ ఇండియా లోగో'

మూడో అతిపెద్ద సంస్థ ...

మూడో అతిపెద్ద సంస్థ ...

దేశంలో డెకాకార్న్ (10 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ కలిగిన) క్లబ్ లో చేరిన సంస్థలు కొన్ని మాత్రమే. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ల సంస్థ పేటీఎం, ఆన్లైన్ లో హోటల్ గదుల బుకింగ్ సేవలు అందించే ఓయో మాత్రమే ఈ క్లబ్ లో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా బైజూస్ కూడా ఇందులో చేరిపోయింది. ఇటీవల బైజూస్ చేపట్టిన నిధుల సమీకరణతో 10.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ 80,000 కోట్లు) వాల్యుయేషన్ సాధించింది. దీంతో ఈ ఘనత సాధించిన మూడో స్టార్టప్ కంపెనీగా బైజూస్ చరిత్ర సృష్టించింది. ఇది కూడా కంపెనీ ప్రారంభించిన పదేళ్లలోపే జరగటం ఒక విశేషం. ఈ మేరకు ఎంట్రాకర్ ఒక కథనం ప్రచురించింది.

400 మిలియన్ డాలర్ల సమీకరణ...

400 మిలియన్ డాలర్ల సమీకరణ...

బిజినెస్ ఇన్సైడర్ కథనం ప్రకారం... బైజూస్ కంపెనీలోకి తాజాగా బాండ్ కాపిటల్ నుంచి 400 మిలియన్ డాలర్ల (దాదాపు రూ 3,200 కోట్లు) పెట్టుబడి ప్రవహించింది. దీంతో బెంగుళూరు కేంద్రంగా పనిచేసే ఈ ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ ఏకంగా 10 బిలియన్ డాలర్లకు పైగా వాల్యుయేషన్ ను సాధించింది. జనరల్ అట్లాంటిక్ కొన్ని నెలల క్రితమే 8.2 బిలియన్ వాల్యుయేషన్ తో సుమారు 200 మిలియన్ డాలర్ల పెట్టుబడి అందించగా... నెలల వ్యవధిలోనే కంపెనీ వాల్యుయేషన్ దాదాపు 20% పెరిగిపోవటం విశేషం. అయితే ఇటీవల కరోనా వైరస్ వ్యాప్తి తో బైజూస్ ఆప్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఎప్పటి నుంచో ఆన్లైన్ లో వీడియో పాఠాలు అందించే బైజూస్ కు లాక్ డౌన్ తర్వాత మరింత అధిక డౌన్లోడ్ లు లభించాయట. అందుకే విలువ అమాంతం పెరిగిపోయింది.

2 నెలల్లో కోటికి పైగా యూజర్లు...

2 నెలల్లో కోటికి పైగా యూజర్లు...

ప్రస్తుతం స్కూల్స్, కాలేజీ లు కూడా ఆన్లైన్ లోనే పాఠాలు బోధించే సేవలు ప్రారంభించటంతో బైజూస్ ఆప్ కు డిమాండ్ బాగా పెరిగిపోయింది. లాక్ డౌన్ విధించిన మార్చి, ఏప్రిల్ నెలల్లోనే బైజూస్ ఆప్ ను 1.35 కోట్ల మంది కొత్తగా డౌన్ లోడ్ చేసుకోవటం విశేషం. ఇప్పటికే కంపెనీకి 5 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. అందులో సుమారు 35 లక్షల మంది పెయిడ్ కస్టమర్లు ఉన్నారు. 2020 మార్చ్ చివరి నాటికి బైజూస్ రూ 2,800 కోట్ల టర్నోవర్ ను సాధించింది. అంతక్రితం ఏడాదితో పోల్చితే ఇది రెట్టింపు కంటే అధికం. మరోవైపు బైజూస్ లాభాల్లోకి మళ్లింది. అది కూడా అధిక వాల్యుయేషన్ సాధించేందుకు ఉపయోగపడింది. ఇదిలా ఉండగా... 2011 లో బైజు రవీంద్రన్ ఈ కంపెనీని స్థాపించారు. కేవలం 9 ఏళ్లలోనే డెకా కార్న్ కంపెనీగా తీర్చి దిద్దారు. ఇది స్టార్టుప్ చరిత్రలో ఒక కీలక మైలు రాయిగా నిలుస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

English summary

Byju's has entered the decacorn club

Edtech firm Byju’s has finally entered the decacorn club after raising an undisclosed sum from a global technology investment firm BOND Capital at an estimated valuation of $10.5 billion.
Story first published: Saturday, June 27, 2020, 12:39 [IST]
Company Search