For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్క క్లిక్‌తో మీకు నచ్చిన మీ బడ్జెట్‌లో ఉన్న సెకండ్ హ్యాండ్ వెహికల్‌‌ను కొనండి ఇలా..!!

|

టూ వీలర్ కొనాలనే ఆలోచనలో ఉన్నారా..? అయితే ఈ వార్త మీకోసమే. బైక్ కొనాలని ఉన్నారా లేక స్కూటర్ కొనుగోలు చేయాలని ఉన్నారా.. ఒకవేళ మీరు స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లయితే, అదే సమయంలో మీ బడ్జెట్ తక్కువగా ఉంటే, మీరు సెకండ్ హ్యాండ్ స్కూటర్‌ కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపండి. సరసమైన ధరలకే మంచి కండీషన్‌లో ఉన్న స్కూటర్లు దొరికే వేదికలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం సెకండ్ హ్యాండ్‌లో హోండా యాక్టివా అందుబాటులో ఉంది. కొత్త మోడల్ హోండా యాక్టివా రూ.70వేలకు పైగానే ఉంది. కానీ సెకండ్ హ్యాండ్‌ హోండా యాక్టివా స్కూటర్ పాత మోడల్ రూ.27వేలకే దొరుకుతుందన్న విషయం తెలుసా.. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

 హోండా యాక్టివా ధర ఎంతంటే...

హోండా యాక్టివా ధర ఎంతంటే...

దేశంలో అత్యధిక సేల్స్‌తో పాటు మంచి విశ్వసనీయత సంపాదించుకున్న స్కూటర్ హోండా యాక్టివా. హోండా యాక్టివా ఎక్స్‌షోరూం ధర రూ.69080 నుంచి ప్రారంభం అవుతుంది. టాప్ మోడల్ ధర అయితే రూ. 72,325 వరకు ఉంటుంది. అయితే కార్స్ 24 వేదికపై మాత్రం పాత మోడల్ హోండా యాక్టివా ధర రూ.23వేలకే లభిస్తోంది. హోండా యాక్టివా సింగిల్ సిలిండర్ 109.51సీసీ ఇంజిన్‌తో వస్తోంది. ఇది 7.79పీఎస్ పవర్‌ను జనరేట్ చేస్తుంది. దీని టార్క్ 8.79ఎన్ఎంగా ఉంది.

2011 మోడల్ హోండా యాక్టివా..

2011 మోడల్ హోండా యాక్టివా..

ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న హోండా యాక్టివా మోడల్ 2011కు సంబంధించినది. ఈ స్కూటర్ ఢిల్లీలో రిజిస్ట్రేషన్ కలిగి ఉంది. ఈ స్కూటర్ కొనుగోలు చేయడం వల్ల రెండు బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి ఏడాది పాటు వారెంటీ, రెండవది మనీ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. అంటే ఏడు రోజుల్లోగా మీకు స్కూటీ నచ్చకపోతే ఈ స్కూటర్‌ను వెనక్కు ఇచ్చేస్తే మీరు కట్టిన డబ్బులు పూర్తిగా రీఫండ్ చేయడం జరుగుతుంది.

కార్స్ 24 పై సెకండ్ హ్యాండ్ వెహికల్స్

కార్స్ 24 పై సెకండ్ హ్యాండ్ వెహికల్స్

ఇక సెకండ్ హ్యాండ్‌లో కార్లను లేదా బైకులను, లేదా స్కూటర్లను పొందేందుకు మంచి వేదికగా నిలుస్తోంది కార్స్ 24. ఇదొక ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం. కార్లు అంటే చాలా ఇష్టమైనవారికి ఈ ప్లాట్‌ఫాం బాగా నచ్చుతుంది. వివిధ కేటగిరీలో కార్లు బైకులు లభిస్తాయి. మీరు ఇంట్లోనే కూర్చుని మీకు కావాల్సిన బైకులు లేదా కార్లు అది కూడా సర్టిఫై చేయబడ్డ వాహనాలను పొందొచ్చు. మీకు నచ్చిన కారు లేదా బైకు లేదా స్కూటర్‌ను ఎంచక్కా ఇంట్లో నుంచే ఒక్క క్లిక్‌తో కొనుగోలు చేయొచ్చు. అంతేకాదు హోమ్ డెలివరీ కూడా కలదు. కేవలం ఒక్క గంటలోనే మీరు కోరుకుంటున్న ధరతో వాహనం సొంతం చేసుకోవచ్చు.

సెకండ్ హ్యాండ్ కారుకోసం రీసెర్చ్..

సెకండ్ హ్యాండ్ కారుకోసం రీసెర్చ్..

సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయడం మామూలు విషయం కాదు. ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు వస్తాయి. మీరు కొనుగోలు చేయాలనుకునే కారు గురించి తెలుసుకునేందుకు గంటల పాటు ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయాల్సి ఉంటుంది. మంచి కారు కోసం కనీసం ఒక వారం రోజులైనా పరిశోధనలు చేయాల్సి ఉంటుంది.

ఇదంతా సులభతరం చేసేందుకు వీలుగా కార్స్ 24 ఈ-కామర్స్ సైట్ పై కొన్ని వేల సంఖ్యలో సర్టిఫై చేయబడ్డ కార్లు ఉన్నాయి. వీటన్నిటికీ అవసరమైన టెస్టింగులు నిర్వహించి ఉంచుతారు. దీంతో మీరు ఎలాంటి వాహనం కావాలో దాని గురించి పరిశోధన చేయాల్సిన పని ఉండదు. నేరుగా కార్స్ 24 ఈ-కామర్స్ సైట్‌ను సందర్శించి అక్కడి నుంచే మీకు కావాల్సిన వాహనంను కొనుగోలు చేయొచ్చు.

కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే..

కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే..

పాత వాహనాలకు కార్స్ 24 సర్టిఫై చేస్తుంది. అయితే ఆన్‌లైన్‌లో చూసి నేరుగా కొనుగోలు చేయకండి. అంతకంటే ముందు వాహనం అమ్మకందారుడి వద్ద ఉన్న సమయంలో కండిషన్ ఎలాగుందో చెక్ చేయండి. అంతేకాదు డాక్యుమెంట్స్‌ను పూర్తిగా చెక్ చేయండి.

ఎలాంటి అవకతవకలు లేకుండా ఉన్నాయో లేదో చెక్ చేయండి. ఆ వాహనం కండీషన్ పూర్తిగా చెక్ చేశాకే డీల్ చేయండి. ఇక వాహనంను టెస్ట్ చేసేందుకు ముందుగా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి. కార్స్ 24కు దేశవ్యాప్తంగా 200కు పైగా ఉన్న బ్రాంచీలున్నాయి. అక్కడ సందర్శించి వాహనం యొక్క పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

English summary

Buy Second hand vehicles within the budget on cars 24 e-commerce platform

Cars 24 is an e-commerce platform that allows you to purchase second hand vehicles at a low budget.
Story first published: Thursday, August 26, 2021, 15:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X