Business Idea: డిగ్రీ చదివారా?: ఇంట్లో నుంచే నెలకు రూ.50 వేల ఆదాయం మీదే
ముంబై: మీరు ఎంబీఏ, బీబీఏ, బీకామ్ లేదా ఎల్ఎల్బీ పూర్తి చేశారా?.. మరే ఇతర స్పెషలైజేషన్‌లో డిగ్రీ పూర్తి చేసినా సరే. ఇంట్లో నుంచే ప్రతినెలకు 50 వేల రూపాయలను ఆర్జించే అవకాశం ఉంది. దీనికోసం జీఎస్టీ ప్రాక్టీషనర్‌గా సర్టిఫికెట్ కోర్స్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా జీఎస్టీ ప్రాక్టీషనర్‌గా సర్టిఫికెట్ కోర్స్‌ను పూర్తి చేయవచ్చు. ఈ సర్టిఫికెట్ కోర్స్ కోసం ఎక్కువ సమయాన్ని కూడా కేటాయించాల్సిన అవసరం లేదు.

ప్రభుత్వ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్..
ఈ కోర్సును పూర్తి చేసిన అనంతరం అధికారికంగా జీఎస్టీ ప్రాక్టీషనర్ లేదా జీఎస్టీ కన్సల్టెంట్‌గా తమ కేరీర్‌ను ఆరంభించవచ్చు. దీనికోసం gst.gov.in వెబ్సైట్లో తమ పేరును నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే ఇక జిఎస్టీ ప్రాక్టీషనర్/కన్సల్టెంట్‌గా గ్రాడ్యుయేట్లు తమ కేరీర్‌ను మొదలు పెట్టొచ్చు. తమకు తెలిసిన, తమ చుట్టుపక్కల ఉన్న దుకాణదారులను సంప్రదించి.. వారిని తమ క్లయింట్‌గా మార్చుకోవాలి.

వంద దుకాణదారులను క్లయింట్లుగా మార్చుకుంటే..
ఓ వంద దుకాణదారులను తమ క్లయింట్లుగా మార్చుకోగలిగితే ప్రతి సంవత్సరం కనీసం 6 నుంచి 8 లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంది. జీఎస్టీ ప్రాక్టీషనర్/కన్సల్టెంట్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీన్ని తమ ఆదాయ వనరుగా మార్చుకోవడానికి గ్రాడ్యుయేట్లకు చక్కని అవకాశం ఉంది. మంచి గుర్తింపు పొందిన జీఎస్టీ కన్సల్టెంట్లు ప్రతినెలా వేల రూపాయల్లో ఆదాయాన్ని పొందుతున్నారు.

అకౌంటెన్సీ సర్వీసులనూ..
అకౌంటెన్సీ మీద చక్కని అవగాహన ఉంటే.. తమ పరిధిని మరింత విస్తరించుకోవడానికీ అవకావం ఉంది. తమ క్లయింట్లకు అకౌంటెన్సీ సర్వీసులను సైతం అందజేయవచ్చు. జీఎస్టీ ప్రాక్టీసనర్గా వచ్చే ఆదాయాన్ని అకౌంటెన్సీ సర్వీసులను అందజేయడం వల్ల రెట్టింపు చేసుకోవచ్చు. ఇంట్లో నుంచి తమ ఆదాయ వనరులను పెంచుకోవచ్చు. చాలామంది నిరుద్యోగులకు ఇదొక అద్భుతమైన ఆదాయ వనరుగా మారింది. జీఎస్టీ ప్రాక్టీషనర్‌గా సర్టిఫికెట్ కోర్సును పూర్తి చేయడం ద్వారా కొత్త కేరీర్‌ను ప్రారంభించవచ్చు.

పన్నుల మీద అవగాహన
ఉద్యోగం చేస్తోన్న వారు కూడా జీఎస్టీ కన్సల్టెంట్లుగా పని చేయవచ్చు. దీని మీద మంచి అవగాహన ఉండాలి. జీఎస్టీ ప్రాక్టీషనర్‌గా సర్టిఫికెట్ కోర్సును పూర్తి చేయడానికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఎంబీఏ, బీబీఏ, బీకామ్, ఎల్ఎల్బీ చదివిన వారికి వాణిజ్యం, పన్నుల వ్యవస్థ, దాని విధివిధానాల మీద మంచి పట్టు, అవగాహన ఉంటుంది. ఉద్యోగాల కోసమే ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా.. ఇలా జీఎస్టీ ప్రాక్టీషనర్/కన్సల్టెంట్లుగా ఆదాయాన్ని ఆర్జించవచ్చు.