Budget 2022: క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ బడ్జెట్లో పన్ను షాక్ తగలొచ్చు
ట్రేడింగ్ లేదా క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈ సంవత్సరం నుండి క్యాపిటల్ గెయిన్స్ పైన వ్యాపార ఆదాయంగా పరిగణించవచ్చా అనే అంశంపై ప్రభుత్వం... సీనియర్ పన్ను సలహాదారుల నుండి అభిప్రాయాలు కోరినట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే ఈ చర్య క్రిప్టో పెట్టుబడిదారులపై పన్ను భారాన్ని గణనీయంగా పెంచుతుంది. వచ్చే బడ్జెట్లో క్రిప్టో ఆస్తుల కోసం ప్రత్యేకంగా ఆదాయం మరియు లాభాల నిర్వచనాన్ని చక్కగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం యోచిస్తోంది.

పన్ను భారమే
పెట్టుబడిదారులు లేదా వ్యాపారులకు రాబడి పైన ఆదాయపు పన్ను 35 శాతం నుండి 42 శాతం వరకు ఉండవచ్చునని భావిస్తున్నారు. క్రిప్టో ఆస్తులపై మాత్రమే ప్రభావం చూపే మార్పులకు సంబంధించి ప్రభుత్వం సీనియర్ పన్ను సలహాదారులను సంప్రదించింది మరియు ఈక్విటీల వంటి ఇతర అసెట్ క్లాస్ లేదు.

లాభాలపై ఆదాయపు పన్ను
పన్ను ప్రేమ్ వర్క్‌లో ఆదాయం నిర్వచనం మార్చినట్లయితే అది క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడులు పెట్టడం, వ్యాపారం చేయడం ద్వారా వచ్చే లాభాలపై అదాయపు పన్ను విధించేందుకు ట్యాక్స్ డిపార్టుమెంటుకు వెసులుబాటు ఇస్తుంది. క్రిప్టో కరెన్సీ పెట్టుబడి, వ్యాపారానికి సంబంధించి పన్నుల విషయంలో స్పష్టత అవసరమని, ఇందుకు సంబంధించి ప్రేమ్ వర్క్ లేదని పన్ను నిపుణులు చెబుతున్నారు.

మరో క్రిప్టోను కొనుగోలు చేసినా..
క్రిప్టో పెట్టుబడులకు రాబడిని ఎలా లెక్కించాలనే అంశాన్ని కూడా వివరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అప్పుడు భారతీయులు తమ క్రిప్టోలను తిరిగి ఫియట్ లేదా రూపాయల్లోకి మార్చకుండా ఇతర క్రిప్టో ఆస్తులతో వర్తకం చేసినప్పుడు కూడా పన్ను విధించబడేలా ఉండవచ్చు. క్రిప్టో కరెన్సీకి భారత కరెన్సీలో వ్యాల్యూ ఉందని, దీనిపై ఆదాయ పన్ను విధించాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడు పెట్టుబడిదారుడు తమ క్రిప్టో ఆస్తులపై వాస్తవ రాబడిని లెక్కించేలా చేస్తారు. ప్రతిసారి వాటిని విక్రయించి రాబడిపై పన్నును చెల్లించాలి. ఆ డబ్బుతో వారు మరో క్రిప్టోను కొనుగోలు చేయవచ్చు.

జీఎస్టీ పరిధిలోకి..
క్రిప్టోపై ప్రభుత్వం జీఎస్టీని కూడా అమలు చేయవచ్చునని భావిస్తున్నారు. క్రిప్టో ట్రేడ్‌ను ప్రభుత్వం 18 శాతం జీఎస్టీ స్లాబ్‌లోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎక్స్చేంజీల ద్వారా కొనుగోలు చేసే వ్యక్తి ఈ మొత్తాన్ని భరించవలసి ఉండవచ్చు.
ప్రభుత్వం అన్ని క్రిప్టో హోల్డింగ్స్ పైన పన్ను విధించడానికి అనుమతించే పన్ను ప్రతిపాదనను పరిశీలిస్తోందని, కాబట్టి జీఎస్టీ 18 శాతం విధించవచ్చునని అంటున్నారు.