ట్యాక్స్ స్లాబ్స్ యథాతథం: 'ఆదాయపు పన్ను'లో ఎలాంటి మార్పులేదు, కరోనా సెస్‌పై శుభవార్త!
ముంబై: ఆదాయపు పన్ను స్లాబ్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. ఐటీ స్లాబ్స్‌ను యథాతథంగా ఉంచారు. తాజా బడ్జెట్లో ఆదాయ పన్ను స్లాబ్స్‌లో మార్పులు లేకపోయినప్పటికీ, 80సీ వంటి ఇతర మినహాయింపులకు సంబంధించి కాస్త పెంపు ప్రకటన వస్తుందని భావించారు. అయితే అందరూ ఊహించినట్లుగా స్లాబ్స్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. అదే సమయంలో సెక్షన్ 80సీ మినహాయింపు పరిమితిలోను మార్పులు చేయలేదు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా పన్ను చెల్లింపు ప్రక్రియ సరళీకరణకు చర్యలు చేపట్టినట్లు ఆర్థికమంత్రి తెలిపారు.
ఆదాయపు పన్ను స్లాబ్స్‌లో లేదా పన్ను మినహాయింపు పరిమితిలో మార్పులు చేయకపోవడం మధ్యతరగతి వారికి, శాలరైడ్‌కు కాస్త నిరాశకు గురి చేసే అంశం. అదే సమయంలో ఓ శుభవార్త కూడా ఉంది. కరోనా నేపథ్యంలో ఎక్కువ ఆదాయం వచ్చే వారిపై కరోనా సెస్ ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈ బడ్జెట్లో ఎలాంటి కరోనా సెస్‌ను ప్రకటించలేదు.
వారికి నిర్మల వరం, ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ అవసరంలేదు: ఎన్నారైలకు గుడ్‌న్యూస్

సీనియర్ సిటిజన్లకు నిర్మలమ్మ సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. పెన్షన్ పైన మాత్రమే ఆధారపడే సీనియర్ సిటిజన్లకు రిటర్న్ ఫైలింగ్ నుండి మినహాయిస్తున్నట్లు తెలిపారు. 75 ఏళ్లు పైబడిన వారు ఇక ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవలసిన అవసరంలేదు. గృహ రుణాలపై పన్ను మినహాయింపును మరో ఏడాది పాటు 2022 మార్చి వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు.