బిట్ కాయిన్, ఎథేరియం డౌన్: ఎలాన్ మస్క్ ఎఫెక్ట్.. డోజీకాయిన్ జంప్
క్రిప్టో కరెన్సీ గత కొంతకాలంగా నష్టపోతోంది. బిట్ కాయిన్, ఎథేరియం సహా దాదాపు అన్ని క్రిప్టోలు నేడు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నవంబర్ రికార్డ్ స్థాయి నుండి బిట్ కాయిన్ ఏకంగా 30 శాతం కంటే పైగా పతనమైంది. ఈ క్రిప్టో దిగ్గజం నేడు ఉదయం 48,089 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అయితే సాయంత్రానికి 47,747 డాలర్లకు పడిపోయింది. ఎథేరియం కూడా ఉదయం 3,838 డాలర్ల వద్ద ట్రేడ్ అయినప్పటికీ, ఆ తర్వాత క్షీణించింది.
ఉదయం సెషన్లో మాత్రం క్రిప్టోలు కాస్త సానుకూలంగా కదలాడాయి. డోజీకాయిన్ 15.5 శాతం లాభపడి 0.181994 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. తమ ఎలక్ట్రిక్ కారు మేకర్ టెస్లా డోజీకాయిన్ను యాక్సెప్ట్ చేస్తుందని టెస్లా ఇంక్ అధినేత ఎలాన్ మస్క్ మంగళవారం తెలిపారు. దీంతో డోజీకాయిన్ భారీగా లాభపడింది. షిబా ఇను స్వల్పంగా లాభపడి 0.00003353 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ...

- Bitcoin - రూ.38,52,753,
- Ethereum - రూ.3,07,901,
- Cardano - రూ.100.54,
- Tether - రూ.80.39,
- Solana - రూ.12,960.75,
- Avalanche - రూ. 7,100.79,
- Litecoin - రూ.11,998.29,
- XRP - రూ.64.49,
- Axie - రూ.7,785.55