ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్, 2వ స్థానానికి పడిపోయిన జెఫ్ బెజోస్, 14వ స్థానంలో ముఖేష్
ప్రపంచ కుబేరుడిగా మైక్రోసాఫ్ట్ కార్ప్ కో ఫౌండర్ బిల్ గేట్స్ మరోసారి అవతరించారు. అమెజాన్ డాట్ కామ్ ఇంక్ అధినేత జెఫ్ బెజోస్‌ను ఈసారి దాటేశారు. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ తాజా జాబితా ప్రకారం 110 బిలియన్ డాలర్లతో బిల్ గేట్స్ అగ్రస్థానంలో నిలవగా, జెఫ్ బెజోస్ 109 బిలియన్ డాలర్లతో రెండో స్థానానికి పడిపోయారు. రెండేళ్ల అనంతరం బిల్‌గేట్స్ తిరిగి మొదటి స్థానంలోకి వచ్చారు. బిల్ గేట్స్ తిరిగి అగ్రస్థానం నిలబెట్టుకోవడానికి, జెఫ్ బెజోస్ రెండో స్థానానికి పరిమితం కావడానికి పలు కారణాలు ఉన్నాయి.
శుభవార్త: మరో కీలక నిర్ణయం దిశగా నరేంద్ర మోడీ, ఒకే దేశం..

అనూహ్యంగా పెరిగిన బిల్ గేట్స్ ఆస్తులు
మైక్రోసాఫ్టుకు 10 బిలియన్ డాలర్ల క్లౌడ్ కంప్యూటింగ్ కాంట్రాక్టు వచ్చింది. ఇండియన్ కరెన్సీలో రూ.70,000 కోట్లు. ఈ కాంట్రాక్టును అమెజాన్‌కు కాకుండా మైక్రోసాఫ్టుకు ఇస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖఅక్టోబర్ 25వ తేదీన ప్రకటించింది. దీంతో మైక్రోసాఫ్ట్ షేర్లు 4 శాతం మేర పెరిగాయి. దీంతో బిల్ గేట్స్ సంపద 110 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. గేట్స్ ఆస్తి మన కరెన్సీలో రూ.7.7 లక్షల కోట్లు.

తగ్గిన జెఫ్ బెజోస్ సంపద
అదే సమయంలో భార్యతో విడాకులు, థర్డ్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు నిరాశపరిచిన నేపథ్యంలో జెఫ్ బెజోస్ ఆస్తి తరిగిపోయింది. అమెజాన్ షేర్ ఈ కాలంలో 2 సాతం తగ్గింది. ఆయన ఆస్తి 108.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఐరోపాలోనే అత్యంత సంపన్నులైన బెర్నార్డ్ అర్నాల్డ్ మూడో స్థానంలో నిలిచారు. ఆయన సంపద 102.7 బిలియన్ డాలర్లుగా ఉంది.

గేట్స్ ఆస్తి ఇలా పెరిగింది..
ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ షేర్ 48 శాతం పెరిగింది. దీంతో బిల్ గేట్స్ ఆస్తి 1 శాతం వాటా వ్యాల్యూ పెరిగింది. మిగతా సంపద వాటా విక్రయాలు, కుటుంబ కార్యాలయం కొన్నేళ్లుగా పెడుతున్న పెట్టుబడుల ద్వారా వచ్చింది.

ఎప్పటికీ బిల్ గేట్సే..!
భార్యకు విడాకుల నేపథ్యంలో జెఫ్ బెజోస్ అమెజాన్‌లో నాలుగో వంతు వాటాను మెకంజీకి ఇవ్వవలసి వచ్చింది. జనవరిలో విడాకులు తీసుకున్నారు. ఈ సంపంద కూడా కలిస్తే గేట్స్ కంటే ముందుండేవారు. అలాగే, బిల్ గేట్స్ తన సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని దాతృత్వ కార్యకలాపాలకు వినియోగిస్తారు. గత పాతికేళ్లుగా బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు 35 బిలియన్ డాలర్లకు పైగా ఇచ్చారు. ఇది కూడా ఉంటే ఆయన ఎప్పటికీ అగ్రస్థానంలోనే కొనసాగుతారని చెప్పవచ్చు.

14వ స్థానంలో ముఖేష్ అంబానీ
భారత్ విషయానికి వస్తే ముఖేష్ అంబానీ మరోసారి అత్యంత ధనికుడిగా నిలిచారు. 56.7 బిలియన్ డాలర్లతో ఆయన ఈ జాబితాలో 14వ స్థానంలో ఉన్నారు. ఇయర్ టు డేట్ ప్రకారం సంపద 12.4 బిలియన్ డాలర్లు పెరిగింది. 21 బిలియన్ డాలర్లతో పల్లోంజీ మిస్త్రీ 48వ స్థానంలో ఉన్నారు.