ఈ సింపుల్ SIP ట్రిక్‌తో రూ.60 లక్షల నుంచి రూ.1.12 కోట్ల సంపాదన
కాస్త సహనం ఉంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ధనవంతులు కావొచ్చు! దీర్ఘకాలిక దృక్పథంతో పెట్టుబడి పెడితే కోటీశ్వరులు కావొచ్చు! వివిధ వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.లక్షలను రూ.కోట్లుగా కూడా మార్చుకునే అవకాశాలు కొట్టి పారేయలేం. మ్యూచువల్ ఫండ్ SIP (క్రమ పద్ధతిలో పెట్టుబడి) ద్వారా రూ.వేలు ఇన్వెస్ట్ చేసి కూడా రూ.లక్షలు, రూ.కోట్లు సంపాదించుకోవచ్చు.
రూ.599 రీచార్జ్‌తో ఎయిర్టెల్ అదిరిపోయే ఆఫర్,రూ.4 లక్షల బీమా

ప్రతి ఏటా 10 శాతం పెంచుతూ రెండింతల రాబడి
ట్యాక్స్, ఇన్వెస్ట్మెంట్ నిపుణుల ప్రకారం SIPను సంవత్సరానికి పది శాతం పెంచడం ద్వారా మెచ్యూరిటీ కాలానికి రాబడి మొత్తాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఎవరికైనా సంపాదన దాదాపు రోజు రోజుకు పెరుగుతుంటుంది. కాబట్టి SIPలో పెట్టుబడిని కూడా అదేవిధంగా పెంచుకునే సౌకర్యం ఉంది. అలా ప్రతి ఏడాది 10 శాతం పెంచుకోవచ్చు.

12 శాతం నుంచి 15 శాతం రాబడి
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లలో లాంగ్ టర్మ్‌లో 12 శాతం రిటర్న్స్‌ను ఆశించవచ్చునని వెల్త్ మేనేజ్మెంట్ నిపుణులు కార్తిక్ ఝవేరి అన్నారు. మ్యూచువల్ ఫండ్స్ మంచి రాబడిని ఇస్తాయన్నారు. పదిహేనేళ్ల కాలపరిమితితో చూస్తే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌లలో 15% రాబడిని పొందవచ్చునని చెప్పారు.

నెలకు రూ.4500 ఇన్వెస్ట్ చేస్తే...
ఇన్వెస్టర్ ఎవరైనా మిడ్ క్యాప్ లేదా స్మాల్ క్యాప్ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంటే 15 శాతం వరకు రిటర్న్స్ ఆశించవచ్చునని చెప్పారు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌ల్లో ఇరవై ఏళ్ల కాలానికి నెలకు రూ.4500 పెట్టుబడిగా పెడితే 15 శాతం రాబడి వస్తుందని అంచనా వేస్తే, అప్పుడు మెచ్యూరిటీ మొత్తం రూ.60,02,682 అవుతుంది.

10 శాతం పెంచుకుంటూ వెళ్తే...
ఒకవేళ ప్రతి సంవత్సరం 10 శాతం ఇన్వెస్ట్మెంట్ పెంచుకుంటూ వెళ్తే అప్పుడు మెచ్యూరిటీ మొత్తం రూ.1,12,95,999 కోట్లకు చేరుకుంటుంది. ప్రతి ఏటా పది శాతం పెంచుకుంటూ వెళ్తే మెచ్యూరిటీ రూ.52,93,317 పెరుగుతుంది. అయితే ఈ కాలంలో వారి పెట్టుబడి రూ.20,12,850కు పెరుగుతుంది.

ఏటా 10 శాతం పెంచడం కష్టమో ఆలోచించాలి
ప్రతి ఏడాది 10 శాతం పెంచుకుంటూ వెళ్లడం ప్రారంభంలో సులభంగా కనిపించవచ్చునని, కానీ కొన్నేళ్ల తర్వాత ఇది భారంగా మారే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. పిల్లలు పెరిగేకొద్దీ పెరుగుతున్న ఆర్థిక అవసరాల దృష్ట్యా ముందు ముందు ఇబ్బందులు ఏర్పడవచ్చునని, కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు.