మొహర్రం నుండి రక్షా బంధన్ వరకు... వరుసగా నాలుగు రోజులు సెలవు
ఆగస్ట్ 16వ తేదీ నుండి 22వ తేదీ మధ్య బ్యాంకులు ఐదు రోజులు క్లోజ్‌గా ఉంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) హాలీడే క్యాలెండర్ ప్రకారం పలు ప్రాంతాల్లో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు మూతబడ్డాయి. బ్యాంకులకు వెళ్ళాలని భావించేవారు ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్లో క్యాలెండర్‌ను చెక్ చేసుకోవచ్చు. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం ఆగస్ట్ నెలలో మొత్తం పదిహేను రోజులు బ్యాంకులు తెరుచుకోవు. ఇందులో రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు ఉన్నాయి. ఇతర పండుగల సెలవులు ఆయా రాష్ట్రాలను బట్టి ఉంటుంది.
ఇక, ఆగస్ట్ 16వ తేదీ నుండి 22వ తేదీ మధ్య వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు పని చేయవు. ఆగస్ట్ 16న పార్సీ కొత్త సంవత్సరం సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయలేదు. బెలాపూర్, ముంబై, నాగపూర్ వంటి ప్రాంతాల్లో బ్యాంకులు మూతబడ్డాయి. ఆ తర్వాత ఆగస్ట్ 19వ తేదీన ముహర్రం సందర్భంగా బ్యాంకులు పని చేయవు. న్యూఢిల్లీ,ముంబై, జైపూర్, అగర్తాల, జమ్ము, అహ్మదాబాద్, బెలాపూర్, భోపాల్, హైదరాబాద్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, నాగపూర్, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, శ్రీనగర్ ఇలా అన్ని ప్రాంతాల్లో బ్యాంకులు తెరచుకోవు.

ఆగస్ట్ 20వ తేదీన బెంగళూరు, చెన్నై, కోచ్చి, తిరువనంతపురంలో ఓనం సందర్భంగా బ్యాంకులు మూతబడతాయి. ఆగస్ట్ 21వ తేదీన తిరువోనం సందర్భంగా తిరువనంతపురం, కోచ్చిలలో బ్యాంకులు తెరుచుకోవు. ఆ తర్వాత 22వ తేదీ ఆదివారం. అదే రోజు రక్షా బంధన్ కూడా ఉంది. అంటే పలు ప్రాంతాల్లో వరుసగా నాలుగైదు రోజులు బ్యాంకులు తెరుచుకోవు.
19 ఆగస్ట్ - ముహర్రం (చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు క్లోజ్)
20 ఆగస్ట్ - ఓనమ్ (బెంగళూరు, చెన్నై, కొచ్చి, తిరువనంతపురంలలో బ్యాంకులు తెరుచుకోవు)
21 ఆగస్ట్ - తిరువోనమ్ (తిరువనంతపురం, కొచ్చిలలో బ్యాంకులు క్లోజ్)
22 ఆగస్ట్ - ఆదివారం (సెలవు రోజు) ఆదివారంతో పాటు రక్షా బంధన్ సెలవు కూడా.