రెండేళ్ళలో భారత మూలధనం భారీగా క్షీణించవచ్చు.. ఎందుకంటే
అభివృద్ధి చెందుతున్న ఆసియా ఆర్థిక వ్యవస్థల్లో రానున్న రెండేళ్లలో బ్యాంకు క్యాపిటల్ క్షీణిస్తుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సోమవారం అంచనా వేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆపరేటింగ్ పరిస్థితులు సవాలుగా మారాయని, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల బ్యాంకులకు అసెట్ క్వాలిటీ అనిశ్చితి అతిపెద్ద ముప్పు అని మూడీస్ తన నివేదికలో తెలిపింది.
నేటి నుండి RTGS కొత్త టైమింగ్స్! ఎంత ట్రాన్సుఫర్ చేస్తే ఎంత ఛార్జ్
అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో బ్యాంకుల 2021 దృక్పథం ప్రతికూలంగా ఉండగా, బీమా సంస్థల దృక్పథం స్థిరంగా ఉందని వెల్లడించింది. ఆసియా పసిఫిక్‌లో బ్యాంకుల్లో నాన్-పర్ఫార్మింగ్ అసెట్స్ పెరుగుతున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎమర్జింగ్ ఆసియా మార్కెట్లో బ్యాంకుల మూలధనం మధ్యస్థంగా పడిపోతుందని తెలిపింది.

భారత్, శ్రీలంకలోని బ్యాంకులు భారీ మూలధన క్షీణత నమోదు చేస్తాయని, పబ్లిక్, ప్రయివేటు పెట్టుబడులు లేకపోవడంతో ఈ క్షీణత నమోదవుతుందని పేర్కొంది. రానున్న రెండేళ్లలో కొత్తగా పెట్టుబడులు రాకపోవడంతో బ్యాంకుల మూలధనం క్షీణిస్తుందని తెలిపింది. భారత్, థాయ్‌లాండ్‌లలో నిరర్థక రుణాలు పెరుగుతాయని వెల్లడించింది.