For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాలేజీ విద్యార్థులకు రూ.20వేలు! స్కూల్స్ కోసం మూడేళ్లలో రూ.12,000 కోట్లు

|

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. చదువులకు అయ్యే ఖర్చును తట్టుకోలేక, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన చదువులు లేవని బాధపడే వారి కోసం ఓ మార్పు దిశగా అడుగు వేసేందుకే ఈ పథకాన్ని తీసుకు వచ్చినట్లు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఒంగోలులోని మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆయన మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం వల్ల రాష్ట్రంలోని 45 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలను మూడేళ్లలో బాగు చేయనున్నారు.

మోడీ ప్రభుత్వం ఎంత చేసినా... భారత్‌కు మూడీస్ షాక్

స్కూళ్లలో 9 రకాల మౌలిక సదుపాయాలు

స్కూళ్లలో 9 రకాల మౌలిక సదుపాయాలు

తొలి దశను గురువారం జగన్ తన చేతుల మీదుగా ప్రారంభించారు. వచ్చే ఏడాది జూన్, జూలై నాటికి 15,715 పాఠశాలల్లో రూ.3,500 కోట్లతో మరుగుదొడ్లు, తాగునీరు, క్లాస్ రూంలలో ఫ్యాన్స్, లైట్లు, ఫర్నిచర్, గ్రీన్‌ చాక్‌ బోర్డ్ వంటి సదుపాయాలు కల్పిస్తారు. అవసరమైన మేరకు క్లాస్ రూంలు, కాంపౌండ్ వాల్స్, ఇంగ్లీష్ ల్యాబ్స్ వస్తాయి. మొత్తంగా తొమ్మిది రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ప్రతి బడి ఫోటోను తీసి, ఆ బడి ముందు అతికిస్తారు. వచ్చే జూన్, జూలై నెలకల్లా ఏం మార్పులు చేశారో తెలుసుకుంటారు.

వారికి ఏడాదికి రూ.20వేలు

వారికి ఏడాదికి రూ.20వేలు

అమ్మఒడి పథకాన్ని జనవరి 9న ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. పిల్లలను బడికి పంపిస్తే ఏడాదికి ఆ తల్లులకు రూ.15వేలు ఇస్తారు. హాస్టళ్లలో చదివే విద్యార్థులకు మెస్ ఛార్జీల కోసం ఏడాదికి రూ.20వేలు ఇవ్వనున్నారు. డిగ్రీలో ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్ శిక్షణ ఇస్తారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంను ఏర్పాటు చేస్తారు. దీనిని స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తారు.

స్కూల్స్ బాగు చేసేందుకు రూ.12,000 కోట్లు ఖర్చు

స్కూల్స్ బాగు చేసేందుకు రూ.12,000 కోట్లు ఖర్చు

ఇంటర్ తర్వాత డిగ్రీ, ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ఈ నేపథ్యంలో చదివించలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రభుత్వం సహాయం ఉపయోగపడుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. కాగా, రాష్ట్రంలోని 45వేల స్కూల్స్ బాగు చేసేందుకు మూడేళ్లలో రూ.10,000 నుంచి రూ.12,000 కోట్లను జగన్ ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా...

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా...

కాగా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా నాడు నేడుకు మూడేళ్లలో రూ.10వేల కోట్లు ఖర్చు చేయాలనుకున్నారని, ఇది ఎలా సాధ్యమని ఓ విద్యార్థిని నాడు నేడు కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ప్రశ్నించారు. దీనికి జగన్ స్పందిస్తూ.. మీ అందరి దీవెనలు, దాతల సహకారంతో విజయవంతం చేస్తామన్నారు.

English summary

AP CM Jagan vows to transform schools into temples of learning

In a strong counter to the criticism from various sections of his government’s decision to introduce English medium in government schools for Class I to VI from the next academic year, Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy on Thursday made it clear that he would not go back on his decision and would take the challenging road ahead.
Story first published: Friday, November 15, 2019, 15:49 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more