For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గౌతమ్ అదానీ సంపద రోజుకు రూ.1,002 కోట్లు: హైదరాబాద్ కుబేరులు వీరే

|

ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సంపద భారీగా పెరిగి, ఆసియా రెండో కుబేరుడిగా నిలిచారు. ప్రస్తుతం ఆసియా కుబేరుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఉన్నారు. వీరు రోజుకు వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. పెద్ద మొత్తంలో ఆర్జనతో ఆసియా కుబేరుడిగా ముఖేష్ అంబానీ, రెండోస్థానంలో అదానీ నిలిచారు. గురువారం విడుదలైన IIFL వెల్త్ హూరున్ ఇండియా రిచ్ లిస్ట్, 2021 జాబితా ప్రకారం గౌతమ్ అదానీ ఆదాయం రూ.1,40,200 కోట్ల నుండి మూడు రెట్లు పెరిగి రూ.5,05,900 కోట్లకు చేరింది.

ఇక, తొలి స్థానంలో ఉన్న ముఖేష్ ఆదాయం రూ.7,18,000 కోట్లుగా ఉంది. భారత అత్యంత సంపన్నుడిగా ముఖేష్ వరుసగా పదోసారి నిలిచారు. గౌతమ్ అదానీ మాత్రం చైనా కుబేరుడు, బాటిల్డ్ వాటర్ ప్రొడ్యూసర్ ఝాంగ్ షెన్షాన్‌ను పక్కకు నెట్టి ఇప్పుడు రెండో స్థానానికి ఎగబాకాడు. అదానీ రోజు సంపాదన రూ.1,002 కోట్లుగా ఉంది.

భారత్ నుండి టాప్ టెన్ వీరే

భారత్ నుండి టాప్ టెన్ వీరే

అదానీ సోదరులు (గౌతమ్ అదానీ, శాంతిలాల్ అదానీ)లు మొదటిసారి టాప్ 10 రిచ్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. శాంతిలాల్ అదానీ రూ.1,31,600 కోట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచారు. HCL టెక్నాలజీస్ శివనాడార్ రూ.2,36,600 కోట్లతో మూడో స్థానంలో, రూ.2,20,000 కోట్లతో ఎస్పీ హిందూజా నాలుగో స్థానంలో, రూ.1,74,400 కోట్లతో ఎల్ఎన్ మిట్టల్ ఐదో స్థానంలో, రూ.1,74,400 సైరస్ ఎస్ పూనావాలా ఆరో స్థానంలో, రూ.1,54,300 కోట్లతో డీమార్ట్ రాధాకిషన్ ధమానీ ఏడో స్థానంలో నిలిచారు. రూ.1,22,200 కోట్లతో కుమార్ మంగళం బిర్లా 9వ స్థానంలో, రూ.1,21,600 కోట్లతో జే చౌదరి పదో స్థానంలో నిలిచారు.

కొత్తగా టాప్ టెన్‌లోకి వచ్చిన వారిలో శాంతిలాల్ అదానీ, కుమార్ మంగళం బిర్లా, జే చౌదరీ ఉన్నారు.

గౌతమ్ అదానీ రెండు స్థానాలు ఎగబాకగా, లక్ష్మీ మిట్టల్ ఎనిమిది స్థానాలు, శాంతిలాల్ అదానీ 12 స్థానాలు, కుమార్ మంగళం బిర్లా 13 స్థానాలు, జే చౌదరీ 2 స్థానాలు ఎగబాకారు. ఎస్పీ హిందూజా మాత్రం 2 స్థానాలు దిగజారారు.

ముఖేష్ అంబానీ రోజువారీ సంపాదన రూ.163 కోట్లు కాగా, గౌతమ్ అదానీ రూ.1002 కోట్లు, శివనాడర్ రూ.260 కోట్లు, ఎస్పీ హిందూజా రూ.209 కోట్లు, లక్ష్మీ మిట్టల్ రూ.312 కోట్లు, సైరస్ పూనావారా రూ.190 కోట్లు, రాధాకిషన్ ధమానీ రూ.184 కోట్లు, శాంతిలాల్ అదానీ రూ.245 కోట్లు, కుమార్ మంగళం బిర్లా రూ.242 కోట్లు, జే చౌదరీ రూ.153 కోట్లుగా ఉంది.

అదానీ సోదరుల సంపద జంప్

అదానీ సోదరుల సంపద జంప్

ధనికుల్లో రోజువారీ సంపాదన వేల కోట్ల రూపాయల్లో ఉంది. ఇందులో గౌతమ్ అదానీ తీరు వేరు. ఈయన గత ఏడాది కాలంగా రోజుకు రూ.1002 కోట్లు ఆర్జించడం గమనార్హం. దీంతో ఆయన సంపద గత ఏడాది 261 శాతం పెరిగింది. అదానీ గ్రూప్ మార్కెట్ వ్యాల్యూ రూ.9 లక్షల కోట్లకు చేరుకోగా, ఆయన ఆధ్వర్యంలో రూ.లక్ష కోట్లకు పైగా విలువైన కంపెనీలు 5 ఉన్నట్లు హురున్ పేర్కొంది. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్‌ శాంతిలాల్‌ అదానీ దుబాయ్‌లో ఉన్నారు. ఆయన కుటుంబం ఏకంగా 12 స్థానాలు ఎగబాకి ఈ జాబితాలో ఎనిమిదో స్థానానికి చేరారు.

మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్స్డ్ బిజినెస్ పర్సన్

మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్స్డ్ బిజినెస్ పర్సన్

జాబితాలో చోటుదక్కించుకున్న ఎంటర్‌ప్రెన్యూయర్స్‌లో ఫార్మాస్యూటికల్ రంగం నుండి ఎక్కువమంది బిలియనీర్లు (40) ఉన్నారు. ఆ తర్వాత కెమికల్స్, పెట్రోకెమికల్స్ (27), సాఫ్టువేర్ సర్వీసెస్(22) ఉన్నారు. 46 ఫౌండర్స్‌లో 26

26 యూనికార్న్స్‌కు చెందిన 46 మంది ఫౌండర్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. స్టార్టప్స్ ప్రకారం 1 బిలియన్ డాలర్ల వ్యాల్యూ కలిగిన కంపెనీని యూనికార్న్‌గా పిలుస్తారు.

కాన్‌ఫ్లుయెంట్ కో-ఫౌండర్ నెహా నర్ఖేడే యంగెస్ట్ సెల్ఫ్ మేడ్ వుమెన్ ఎంటర్‌ప్రెన్యూయర్‌గా నిలిచారు.

జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ సంపద 164 శాతం పెరిగి రూ.5800 కోట్లకు చేరుకుంది.

మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్స్డ్ బిజినెస్ పర్సన్‌గా (సోషల్ మీడియా) రతన్ టాటా నిలిచారు. ఆ తర్వాత ఆనంద్ మహీంద్రా ఉన్నారు.

హైదరాబాద్ నుండి 56 మంది

హైదరాబాద్ నుండి 56 మంది

పేమెంట్స్ యాప్ భారత్‌పే వ్యవస్థాపకుడు శాశ్వత్ నక్రానీ 23 ఏళ్లకే టాప్ 100 జాబితాలో చేరారు. ఐఐటీ (ఢిల్లీ)లో మూడో ఏడాది చదువుతూ 2018లో ఈ యాప్‌ను నక్రానీ రూపొందించారు. జాబితాలో 13 మంది 1990ల్లో జన్మించి, స్వయంకృషితో ఈ స్థాయికి ఎదిగారు. గత ఏడాదితో పోలిస్తే 13 మంది వ్యక్తుల సంపద రూ.లక్ష కోట్లకు పైగా జత కలిసింది.

పదేళ్ల కిందటితో పోలిస్తే బిలియనీర్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగి 237కు చేరుకుంది. గత ఏడాది కంటే ఈసారి 58 మంది అదనంగా చేరారు.

894 మంది సంపద పెరగగా, అందులో 229 మంది కొత్తవారు ఉన్నారు. 113 మంది సంపద తగ్గింది. 659 మంది లేదా 66 శాతం మంది స్వయంకృషితో ఈ స్థాయికి చేరారు. ముంబై నుండి 255, ఢిల్లీ నుండి 167, బెంగళూరు నుండి 85 మంది కుబేరులను ఉన్నారు. హైదరాబాద్ నుండి 56 మంది ఉన్నారు.

హైదరాబాద్ నుండి కొత్తగా ఐదుగురు జత కలిశారు. ఇందులో దివిస్ ల్యాబ్స్ మురళీ దివి ముందుున్నారు. రాష్ట్రాలవారీగా చూస్తే తెలంగాణ నుండి 63 మంది, ఆంధ్రప్రదేశ్ నుండి ఆరుగురు ఉన్నారు. తెలంగాణ ర్యాంకు ఆరు, ఏపీ ర్యాంకు పదమూడుగా ఉంది. టాప్ 100లో మురళీ దివి 14వ ర్యాంకు, రూ.79,000 కోట్లు, హెటెరో పార్థసారథి రెడ్డి 58వ ర్యాంకు, రూ.26,100 కోట్లు, అపోలో ప్రతాప్ సి రెడ్డి 78వ ర్యాంకు, రూ.21,000 కోట్లు, అరబిందో రాం ప్రసాద్ రెడ్డి 86వ ర్యాంకు, రూ.13,000 కోట్లు.

English summary

Ambani Asia's richest, Gautam Adani next with RS 1,002 crore earnings per day

Industrialist Gautam Adani has zoomed to the second spot in Asia's rich list after almost quadrupling his wealth from ₹ 1,40,200 crore to ₹ 5,05,900 crore, the IIFL Wealth-Hurun India Rich List, 2021.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X