అమెజాన్ సమ్మర్ అప్లయన్సెస్ ఫెస్టివల్ .. నేటి నుండి మూడు రోజులు అదిరిపోయే భారీ ఆఫర్స్
ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ ఇండియా సమ్మర్ అప్లయెన్సెస్ ఫెస్టివల్ పేరుతో భారీ ఆఫర్లను ప్రకటించింది. సమ్మర్ సేల్ లో భాగంగా ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీగా రాయితీలు ఇస్తోంది. ఇక ఈ సేల్ ఫిబ్రవరి 26 తారీకు నుండి 28వ తారీకు వరకు కొనసాగనుంది.

అమెజాన్ సమ్మర్ అప్లయెన్సెస్ ఫెస్టివల్లో గ్రుహోపకరణాలపై ఆఫర్లు
అమెజాన్ సమ్మర్ అప్లయెన్సెస్ ఫెస్టివల్ లో వోల్టాస్ , ఎల్ జి, వర్ల్ పూల్, డాకింగ్, శాంసంగ్, సింఫనీ, గోద్రెజ్ కంపెనీలకు చెందిన బ్రాండ్ లపై అమెజాన్ పెద్ద మొత్తంలో రాయితీలను ప్రకటించింది. అంతేకాదు కొనుగోలుదారులు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసినట్లయితే వారికి ఈఎమ్ఐ లపై 10 శాతం అదనంగా డిస్కౌంట్లు కూడా ఇస్తున్నట్లుగా అమెజాన్ వెల్లడించింది
.

ఎయిర్ కండిషనర్ లపై 40 శాతం వరకు రాయితీ, రిఫ్రిజిరేటర్ లపై 35 శాతం వరకు డిస్కౌంట్
ఎయిర్ కండిషనర్ లపై 40 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించిన అమెజాన్, వోల్టాస్, ఎల్ జి, వర్ల్ పూల్ , డాకిన్, సాన్యో తదితర బ్రాండ్ల పై ఈ రాయితీలు వర్తిస్తాయని పేర్కొంది.
అంతేకాకుండా ఎల్జి , శాంసంగ్, వర్ల్ పూల్ , హైయర్ , గోద్రెజ్ తదితర బ్రాండ్ల రిఫ్రిజిరేటర్ లపై 35 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లుగా ప్రకటించింది. రిఫ్రిజిరేటర్ల ఎక్స్చేంజి పై 12 వేల వరకు రాయితీ ఇస్తుంది.

కూలర్స్ మరియు యాక్సెసరీస్ పై 50 శాతం వరకు తగ్గింపు
సింపని, క్రాంప్టన్ , బజాజ్, హావెల్స్ కూలర్స్ మరియు యాక్సెసరీస్ పై 50 శాతం వరకు తగ్గింపు ఇస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అమెజాన్ సమ్మర్ సేల్ లో అదిరిపోయే ఆఫర్లలో హోమ్ అప్లయెన్సెస్ సొంతం చేసుకోండి.