For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా ఎఫెక్ట్: కమిషన్లు తగ్గిస్తున్న అమెజాన్, ఫ్లిప్ కార్ట్!

|

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్... మన దేశంలో కూడా అన్ని రంగాలను కుదేలు చేస్తోంది. ముఖ్యంగా కరోనా దెబ్బకు ఇండియా లో ఈ కామర్స్ రంగం బాగా దెబ్బతింది. మార్చ్ చివరి వారం నుంచి లాక్ డౌన్ అమల్లోకి రావటంతో ఈ కంపెనీల కార్యకలాపాలు పూర్తిగా మూతపడ్డాయి. మళ్ళీ ఇటీవలే కేవలం కూరగాయలు, గ్రోసరీల డెలివరీ కి ప్రభుత్వం అనుమతించడంతో పాక్షికంగా కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. కానీ, దాదాపు ఒక నెల పూర్తిగా అమ్మకాలు లేక ఈ రంగం ఇబ్బంది పడింది.

సుమారు 20 కోట్ల మంది ఇండియా లో ఈ కామర్స్ కంపెనీల నుంచి రకరకాల ప్రోడక్టులు కొనుగోలు చేస్తుంటారు. ఇందులో సింహ భాగం అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కంపెనీలకే వినియోగదారులు ఆర్డర్స్ ఇస్తుంటారు. కానీ, ఇటీవల కాలంలో గ్రోసరీ డెలివరీ కి ప్రసిద్ధ గాంచిన బిగ్ బాస్కెట్, గ్రోఫోర్స్ మాత్రమే కొంత యాక్టీవ్ గా కనిపించాయి. కానీ అవి కూడా వాటికి వచ్చిన పూర్తిస్థాయి ఆర్డర్లను డెలివరీ చేయటంలో ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. మరో వైపు ఫుడ్ డెలివరీ యాప్ లు స్విగ్గి, జొమాటో కూడా కొంత వరకు తమ కార్యకలాపాలు సాగించినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు.

ఏ పరిస్థితులున్నా మీ ఉద్యోగాలు మీవే: ఉద్యోగుల తొలగింత, శాలరీ పెంపుపై TCS క్లారిటీ

సెల్లర్లకు మద్దతు...

సెల్లర్లకు మద్దతు...

దాదాపు నెల రోజుల నుంచి వ్యాపారం లేకపోవటంతో ఈ కామర్స్ కంపెనీల్లో లిస్ట్ అయి ఉన్న అమ్మకం దార్లు (సెల్లర్లు) బాగా ఇబ్బంది పడ్డారు. ఈ పరిణామాల దృష్ట్యా... ప్రస్తుతం మళ్ళీ కొంత కార్యకలాపాలు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉండటంతో ఈ కామర్స్ కంపెనీలు తమ నెట్ వర్క్ ను సిద్ధం చేస్తున్నాయి. ఈ నెల 20 నుంచి అధికారికంగా ఈ కామర్స్ కంపెనీల కార్యకలాపాలకు అనుమతి ఉంది.

కాగా, తమ ప్లాట్ఫారం పై లిస్ట్ అయి ఉన్న చిన్న తరహా అమ్మకం దారులకు చేయూత అందించాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా అమెజాన్ 50% కమిషన్ తగ్గించాలని నిర్ణయించినట్లు సమాచారం. అది కూడా జూన్ నెల వరకు దీనిని కొనసాగించనుంది. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రూ 10,000 లోపు ఆర్జన కలిగిన అందరు అమ్మకందారుల కు ఇది వర్తించనుంది. ఈ కామర్స్ కంపెనీలు సాధారణంగా విభాగాన్ని బట్టి 5% నుంచి 25% కమిషన్ వసూలు చేస్తాయి. కొన్ని సార్లు ఇవి 35% కూడా ఉంటాయి.

ఫ్లిప్ కార్ట్ కొత్త స్కీం...

ఫ్లిప్ కార్ట్ కొత్త స్కీం...

దేశంలో అతి పెద్ద ఈ కామర్స్ కంపెనీగా ఉన్న ఫ్లిప్ కార్ట్ కూడా ఈ సంక్షోభ సమయంలో అమ్మకందారులకు మద్దతు ప్రకటించింది. ఈ సమయంలో తమ నుంచి రుణాలు పొందిన వారికి 6 నెలల మారటోరియం తో పాటు స్పెషల్ డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తున్నట్లు పేర్కొంది. గ్రోత్ క్యాపిటల్ కార్యక్రమంలో భాగంగా ఫ్లిప్ కార్ట్ ఈ సరికొత్త స్కీం ను ప్రవేశపెట్టింది.

మరోవైపు కరోనా వైస్ వ్యాప్తి ని దృష్టిలో పెట్టుకుని తమ సెల్లర్ల కు కోవిడ్ -19 కు కోసం ప్రత్యేక బీమా పాలసీ ని కూడా అందిస్తోంది. ఇది వారికి ఆపత్కాలంలో బాగా పనికొస్తుంది. లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలో అన్ని ఈ కామర్స్ కంపెనీల కన్నా ఫ్లిప్ కార్ట్ అధికంగా ప్రభావితం అయినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే మళ్ళీ తమ కార్యకలాపాలు సాఫీగా సాగాలంటే సెల్లర్లు కీలకం కాబట్టి ఇటు ఫ్లిప్ కార్ట్, అటు అమెజాన్ తమ పరిధిలో వారికి ప్రయోజనం చేకూర్చే విధానాలు అమలు చేస్తున్నాయి.

రెస్పాన్స్ ఎలా ఉంటుందో...

రెస్పాన్స్ ఎలా ఉంటుందో...

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 40 రోజుల లాక్ డౌన్ విధించారు. ఈ సమయంలో అన్ని రంగాల వారు ప్రభావితం అయ్యారు. తొలుత లాక్ డౌన్ సమయంలో ఈ కామర్స్ కంపెనీల సేవలు అందుబాటులో ఉంటాయని అందరూ ఊహించారు. కానీ అందుకు విరుద్ధంగా పరిస్థితులు ఉండటంతో... ప్రస్తుతం వినియోగదారులు ఆఫ్ లైన్ షాపుల వైపు మళ్లారు.

వీధి చివరన ఉండే కిరాణా కొట్టు మళ్ళీ వారికి దగ్గరయింది. దీంతో, మళ్ళీ సేవలు ప్రారంభించిన తర్వాత కూడా కొంత కాలం పాటు ఈ కామర్స్ కంపెనీలకు ఇబ్బందులు తప్పకపోవచ్చు అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మళ్ళీ భారీ స్థాయిలో ఆఫర్లు ప్రకటిస్తే కానీ వినియోగదారులను ఆకట్టుకోవడం సాధ్యం కాకపోవచ్చని వారు విశ్లేషిస్తున్నారు.

English summary

Amazon offers 50 percent waiver in commissions for small sellers

Amazon said on Thursday it would offer a 50% waiver on commissions for small sellers on its platform till June.
Story first published: Friday, April 17, 2020, 18:35 [IST]
Company Search
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more