For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా వైరస్ ఎఫెక్ట్: అలీబాబా ఆందోళన, తట్టుకునే శక్తి ఉందా అంటే?

|

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇటీవలి వరకు మార్కెట్లు దెబ్బతిన్నాయి. వైరస్ ప్రభావం తగ్గుతుందనే అంచనాలతో మార్కెట్లు కాస్త పుంజుకున్నాయి. అయితే కరోనా మృతుల సంఖ్య దాదాపు 1,400 ఉంది. కరోనా ప్రభావం మార్కెట్లు, ఆటో పరిశ్రమ సహా వివిధ రంగాలపై పడుతోంది. ఈ-కామర్స్ వెబ్ సైట్స్‌ను కూడా దెబ్బతీస్తోంది.

గుడ్‌న్యూస్!: 29 వరకు FASTagలు ఉచితం, ఎలా తీసుకోవలంటే?

ఈ కామర్స్ రెవెన్యూ పడిపోతుంది..

ఈ కామర్స్ రెవెన్యూ పడిపోతుంది..

కరోనా ప్రభావం కారణంగా ఈ క్వార్టర్‌లో రెవెన్యూ భారీగా పడిపోనుందని చైనా దిగ్గజం అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ పేర్కొంది. తమకు ప్రధాన ఆదాయ వనరు అయిన ఈ-కామర్స్ రెవెన్యూపై భారీగా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. డిసెంబర్ 2019తో ముగిసిన క్వార్టర్ ఎగ్జిక్యూటివ్ సమయంలోనే ఈ హెచ్చరిక వచ్చింది. యాన్యువల్ సింగిల్స్ డే షాపింగ్ ఈవెంట్ సమయంలో కంపెనీ విశ్లేషకుల అంచనాలు మించి రికార్డ్ ట్రాన్సాక్షన్స్ కనిపించాయి.

ఆర్డర్‌లో జాప్యం

ఆర్డర్‌లో జాప్యం

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లూనార్ కొత్త సంవత్సరం అనంతరం చైనాలో కంపెనీలు తెరుచుకోవడం కష్టంగా మారింది. కరోనా వైరస్ ప్రభావం వ్యాపారులపై పడుతోందని, ఆర్డర్స్‌లో జాప్యం జరుగుతోందని సీఈవో డేనియల్ ఝాంగ్ అన్నారు.

ఫుడ్ డెలివరీ ఆర్డర్స్ పడిపోయాయి

ఫుడ్ డెలివరీ ఆర్డర్స్ పడిపోయాయి

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తమ ఫుడ్ డెలివరీ ఆర్డర్స్ భారీగా పడిపోయాయని వెల్లడించారు. రెస్టారెంట్లు మూతబడటంతో ఫుడ్ డెలివరీ ఆర్డర్స్ ఇబ్బందిగా మారిందని చెప్పారు. తమ సూపర్ మార్కెట్ నుండి డిమాండ్ లభించినప్పటికీ, పరిమిత డెలివరీ కెపాసిటీ ఉందని పేర్కొన్నారు.

ఫైనాన్స్ మేనేజర్ మాట్లాడుతూ.. ఫిజికల్ గూడ్స్ పైన ఎక్కువగా ఆధారపడిన అలీబాబా వ్యాపారాలలో చాలా వరకు ఈ త్రైమాసికంలో రెవెన్యూ తగ్గుతుందని చెప్పారు.

అలీబాబాకు తట్టుకునే శక్తి ఉందా?

అలీబాబాకు తట్టుకునే శక్తి ఉందా?

కరోనా వైరస్ కారణంగా అలీబాబా గ్రూప్ ఆదాయం తదుపరి రెండు త్రైమాసికాలలో దెబ్బతినే అవకాశముందని చెబుతున్నారు. అయితే ఇలాంటి స్వల్పకాలిక ప్రమాదాన్ని తట్టుకునే శక్తి అలీబాబాకు ఉందని చెబుతున్నారు.

రెవెన్యూ రికార్డ్

రెవెన్యూ రికార్డ్

గత ఏడాది నవంబర్ నెలలో మెగా సింగిల్ డే షాపింగ్ బొనాంజా ద్వారా డిసెంబర్ క్వార్టర్‌లో అలీబాబా భారీ రెవెన్యూను సాధించింది. ఈ ఈవెంట్ కారణంగా 24 గంటల వ్యవధిలో 38.4 బిలియన్ డాలర్ల భారీ సేల్స్ జరిగినట్లు తెలిపింది. సాధారణంగా అలీబాబా థర్డ్ మర్చంట్ వస్తువుల అడ్వర్టయిజ్‌మెంట్, ప్రమోషనల్ సర్వీసెస్ ద్వారా రెవెన్యూ జనరేట్ చేస్తోంది. తన ఈ-కామర్స్ వెబ్ సైట్ల ద్వారా వాటిని ప్రమోట్ చేస్తూ రెవెన్యూ జనరేట్ చేస్తోంది.

ఇన్ని సమస్యలకు కరోనా తోడు

ఇన్ని సమస్యలకు కరోనా తోడు

కరోనా వైరస్ కారణంగా చైనాలో వాహన విక్రయాలు కూడా పడిపోయాయి. జనవరిలో ఆటో సేల్స్ గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఏకంగా 20.2% తగ్గాయి. 16 లక్షలకు పరిమితమైనట్లు చైనా వాహన తయారీ సంస్థల సమాఖ్య ప్రకటించింది. అమ్మకాలు పడిపోవడంతో కంపెనీలు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాయని తెలిపింది. అమెరికాతో వాణిజ్య యుద్ధం, వృద్ధి మందగమనం, ఉద్యోగాల కోత వంటి సమస్యలతో ఇప్పటికే చైనా సమస్యలు ఎదుర్కొంటుండగా ఇప్పుడు కరోనా వైరస్ దెబ్బతీస్తోందని అంటున్నారు.

దాదాపు అన్ని సేల్స్ పడిపోయాయి

దాదాపు అన్ని సేల్స్ పడిపోయాయి

చైనాలో కరోనా వైరస్ కారణంగా వెయ్యి మందికి పైగా చనిపోయారు. ఈ వైరస్ మరింత విస్తరించకుండా కట్టడి చేసేందుకు నూతన సంవత్సర సెలవులను మరింతగా పొడిగించడంతో కంపెనీలు, డీలర్‌షిప్స్ మూతబడ్డాయి. దీంతో ఆటో సహా అన్ని రంగాల సేల్స్ పడిపోయాయి.

సాధారణంగా అమ్మకాలు పెరగాలి... కానీ

సాధారణంగా అమ్మకాలు పెరగాలి... కానీ

సాధారణంగా జనవరిలో సెలవుల సీజన్ తర్వాత ఫిబ్రవరిలో అమ్మకాలు భారీగా నమోదవుతాయి. కానీ ప్రస్తుతం ఫిబ్రవరి సగం గడిచినా కంపెనీలు ఇంకా తయారీ కార్యకలాపాలు ప్రారంభించలేదు. స్వల్పకాలికంగా వాహనాల ఉత్పత్తి, అమ్మకాలపై గణనీయంగా ప్రతికూల ప్రభావం పడుతోంది. పరికరాల సరఫరా వ్యవస్థకు సమస్యలు ఉంటాయని చెబుతున్నారు.

English summary

Alibaba warns of drop in e commerce revenues due to coronavirus

Alibaba Group Holding Ltd warned of a drop in revenues at its key e commerce businesses this quarter as the coronavirus sweeping China hits supply chains and deliveries.
Story first published: Friday, February 14, 2020, 12:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X