45,000కు సమీపంలో.. సరికొత్త రికార్డు దిశగా సెన్సెక్స్, మారుతీ సుజుకీ 4% జంప్
ముంబై: నిన్న స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు నేడు (గురువారం, డిసెంబర్ 3) లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.20 సమయానికి 335 పాయింట్లు లాభపడి 44,953 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 101 పాయింట్లు ఎగిసి 13,215 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 45,000 మార్కు అడుగు దూరంలో నిలిచింది. నిఫ్టీ 13,200 క్రాస్ చేసింది. దాదాపు అన్ని రంగాల కూడా లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిన్న భారీ నష్టాలు చూసినప్పటికీ, ఆ తర్వాత కోలుకొని స్వల్ప నష్టాల్లో ముగిసింది. డాలర్ మారకంతో రూపాయి 73.81 వద్ద ప్రారంభమైంది. క్రితం సెషన్లో 73.80 వద్ద క్లోజ్ అయింది.
SBI యోనో యాప్‌లో ఎర్రర్, కస్టమర్ల తీవ్ర అసహనం: ట్విట్టర్లో వెల్లువ..

సూచీలు జంప్
ఉదయం గం.11.15 సమయానికి సెన్సెక్స్ 143 పాయింట్ల లాభంతో ఉంది. ప్రారంభ భారీ లాభం నుండి కిందకు పడినప్పటికీ లాభాల్లోనే ఉంది. 80 పాయింట్ల నుండి 160 పాయింట్ల మధ్య కదలాడింది. నిన్న 44,618 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 50 సూచీ ఉదయం గం.11.16 సమయానికి 47 పాయింట్ల లాభంతో 13,163 పాయింట్ల వద్ద ఉంది. 13,200 నుండి 13,150 పాయింట్ల మధ్య కదలాడింది.
అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, మారుతీ, కొటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ స్టాక్స్ లాభపడటంతో సెన్సెక్స్ పైకి కదిలింది.
మెటల్ స్టాక్స్ భారీగా ఎగిశాయి.

మారుతీ సుజుకీ స్టాక్స్ 4 శాతం జంప్
మారుతీ సుజుకీ స్టాక్స్ 4 శాతానికి పైగా లాభపడ్డాయి. నవంబర్ నెలలో సేల్స్ 1.7 శాతం మేర పెరిగాయి. ఈ ప్రభావం స్టాక్ పైన కనిపించింది.
టాప్ గెయినర్స్ జాబితాలో... మారుతీ సుజుకీ స్టాక్ 4.09 శాతం, SBI 3.91 శాతం, NTPC 3.06 శాతం, టాటా స్టీల్ 3.06 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 2.71 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో.. SBI లైఫ్ ఇన్సురెన్స్ 1.79 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 1.49 శాతం, భారతీ ఎయిర్ టెల్ 1.29 శాతం, బజాజ్ ఆటో 1.15 శాతం, ఇన్ఫోసిస్ 1.14 శాతం నష్టపోయాయి.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ లైఫ్, మారుతీ సుజుకీ, రిలయన్స్ ఉన్నాయి.

రంగాలవారీగా..
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.92 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.76 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.08 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.19 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.12 శాతం, నిఫ్టీ మీడియా 2.01 శాతం, నిఫ్టీ మెటల్ 1.76 శాతం, నిఫ్టీ ఫార్మా 0.29 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 4.73 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.03 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.30 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఐటీ మాత్రమే 0.08 శాతం నష్టపోయింది.
ఐటీ స్టాక్స్ విషయానికి వస్తే.. టీసీఎస్ 0.49 శాతం, ఇన్ఫోసిస్ 1.26 శాతం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
టెక్ మహీంద్రా 0.36 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2.23 శాతం, విప్రో 0.39 శాతం, మైండ్ ట్రీ 1.25 శాతం, కోఫోర్జ్ 1.53 శాతం లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.