For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Masturbation break: ఆ కంపెనీ ఉద్యోగులకు హస్త ప్రయోగం కోసం అరగంట విరామం

|

స్టాక్‌హోమ్: సాధారణంగా అన్ని చోట్లా ఉద్యోగులకు లంచ్ బ్రేక్, టీ బ్రేక్, డిన్నర బ్రేక్స్ ఇస్తుంటాయి కంపెనీలు. సిగరెట్ బ్రేక్ కూడా ఇచ్చే కంపెనీలు చాలానే ఉన్నాయి. హస్త ప్రయోగం చేసుకోవడానికి బ్రేక్ ఇచ్చే సంస్థలు కూడా ఉన్నాయంటే నమ్మలేం. అది నిజం. తన సంస్థలో పని చేసే ఉద్యోగులకు హస్త ప్రయోగం కోసం బ్రేక్ ఇచ్చే కంపెనీ కూడా ఒకటుంది. పైగా దానికి ఓ మహిళ.. చీఫ్ కావడం స్పెషాలిటీ.

అడల్ట్ ఫిల్మ్ టాప్ మేకర్..

ఎరికా లస్ట్. పోర్నగ్రఫీ సినిమాల దర్శకురాలు.. నిర్మాత కూడా. స్వీడన్‌కు చెందిన టాప్ అడల్ట్ ఫిల్మ్ మేకర్. 2004లో ది గుడ్ గర్ల్ అనే షార్ట్ మూవీతో ఈ ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. క్లాడియా క్లెయిర్, లూకాస్ ఫోజ్ ఇందులో నటించారు. ది ఎక్స్‌ కన్ఫెషన్స్, ది ఇంటెర్మ్, డర్టీ ఫీట్, యాన్ అపాయింట్‌మెంట్ విత్ మై మాస్టర్, హ్యాండ్‌కఫ్స్, రూమ్ 33, సమ్‌థింగ్ అబౌట్ నాదియా, బార్సిలోనా సెక్స్ ప్రాజెక్ట్ వంటి పలు ఎరోటిక్ ఫిల్మ్స్‌ను తెరకెక్కించింది. టోరంటో ఇంటర్నేషనల్ పోర్న్ ఫెస్టివల్‌లో ఆమె తీసిన సినిమాలదే హవా.

వీడియో ప్రొడక్షన్స్ హౌస్..

స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో ఓ ఆఫీస్‌ను రన్ చేస్తోందీ 44 సంవత్సరాల నీలి చిత్రాల దర్శకురాలు కమ్ నిర్మాత. వీడియో ప్రొడక్షన్ హౌస్ ఇది. లస్ట్ ఫిల్మ్స్ అనే బ్యానర్‌ దీన్ని నడిపిస్తోంది. ఈ ఆఫీస్‌లో 36 మంది ఉద్యోగులు పని చేస్తోన్నారు. వారి మెజారిటీ వర్క్ అంతా అడల్ట్ మూవీ ఎడిటింగ్, మార్కెటింగ్ మీద ఆధారపడి ఉంటుంది.

ఉద్యోగులకు ప్రశాంతత కోసం..

ఉద్యోగులకు ప్రశాంతత కోసం..

సెక్స్ మూవీస్ ఫిల్మింగ్, ఎడిటింగ్.. మీదే ఉద్యోగులు కార్యకలాపాలు ఆధారపడి ఉండటం వల్ల- ఆ సెక్స్ సన్నివేశాలను చూసిన తరువాత ఉద్రేకానికి గురి కావడం అత్యంత సహజం. ఆ ఉద్రేకాన్ని తట్టుకోలేకపోతుండటం, అది కాస్తా వారిని మానసిక ఒత్తిళ్లకు గురి చేస్తున్నట్లు ఎరికా లస్ట్ గుర్తించింది. దీనితో ఆమె సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.

 హస్త ప్రయోగం కోసం బ్రేక్..

హస్త ప్రయోగం కోసం బ్రేక్..

కంపెనీలో పని చేసే ఉద్యోగులందరికీ హస్త ప్రయోగం కోసం అరగంట విరామాన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది. లంచ్ బ్రేక్, టీ బ్రేక్ తరహాలో.. మస్టర్బేషన్ బ్రేక్‌ను ఇచ్చింది. దీనికోసం మస్టర్బేషన్ జోన్‌ను ఏర్పాటు చేసిందామె. అక్కడితో ఆగలేదు. మస్టర్బేషన్ కోసం ప్రత్యేకంగా సెక్స్ టాయ్స్‌ను కూడా అందించింది. దీనికోసం స్పానిష్ సెక్స్ టాయ్ మానుఫ్యాక్చరింగ్ సంస్థ ఫన్ ఫ్యాక్టరీతోనూ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. ఫన్ ఫ్యాక్టరీ తాను తయారు చేసే గూడీస్‌ను ఉచితంగా ఉద్యోగులకు అందజేయాల్సి ఉంటుంది.

Read more about: news
English summary

Masturbation break: ఆ కంపెనీ ఉద్యోగులకు హస్త ప్రయోగం కోసం అరగంట విరామం | Adult filmmaker Erika Lust gives staff sex toys, masturbation breaks at work space

Erika Lust, a prominent director and producer of pornographic films, erected the 'self-love' policy last May in a bid to prioritise the wellbeing of her staff. Under the policy, staff are entitled to a half-an-hour masturbation break.
Story first published: Saturday, June 11, 2022, 19:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X