For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Dhirubhai Ambani: 1982 సీన్ రిపీట్.. అంబానీలు ఎదుర్కొన్న పరిస్థితే అదానీకి.. స్పెషల్ స్టోరీ..

|

Gautam Adani: ధీరూబాయ్ అంబానీ అంటే వ్యాపార సామ్రాజ్యంలో తెలియని వారు ఉండరు. చిన్న పరిశ్రమను స్థాపించి దానిని ప్రపంచ ప్రఖ్యాత వ్యాపార సమూహంగా మార్చటంలో ఆయన పాత్ర నిజంగా అనిర్వచనీయం. ప్రస్తుతం దేశంలో ఉన్న చాలా మంది వ్యాపారవేత్తలకు ఆయన జీవితం ఆదర్శప్రాయం. ఆయన ఎదుగుతున్న సమయంలో మార్కెట్లో చాలా ఆటుపోట్లను చూశారు. అలా 1982లో ఆయన ఎదుర్కొన్న ఒక పరిస్థితి మళ్లీ ఇప్పుడు రిపీట్ అవ్వటం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రిలయన్స్ ఐపీవో..

రిలయన్స్ ఐపీవో..

దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తొలిసారిగా 1977 అక్టోబరులో తన ఐపీవోను దేశీయ స్టాక్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. అప్పట్లో ఒక్కో షేరను రూ.10 ముఖ విలువతో మెుత్తం 28 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించింది. ఆ తర్వాత కంపెనీ మూలధన అవసరాలకు కన్వర్టబుల్ డిబెంచర్ల మార్గాన్ని వినియోగించింది. ఆ తర్వాత బోనస్ షేర్లను ప్రకటించటం, రైట్స్ ఇష్యూల ద్వారా షేర్ల సంఖ్యను పెంచింది.

1982 బేర్ల దాడి..

1982 బేర్ల దాడి..

ఐపీవోగా ప్రస్థానం ప్రారంభించిన రిలయన్స్ ధీరూబాయ్ నేతృత్వంలో క్రమంగా పెరుగుతూ 1980 షేర్ ధర రూ.104కి చేరుకుంది. ఆ తర్వాత 1982లో రూ.186 స్థాయిని తాకింది. ఆ సమయంలో కోల్‌కతాకు చెందిన బేర్ ఆపేటర్ల కార్టెల్ రిలయన్స్ షేర్లను షార్ట్ చేయటం ప్రారంభించింది. దీంతో రిలయన్స్ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. అలా బేర్స్ దాదాపుగా 3.5 లక్షల షేర్లను విక్రయించారు. దీంతో షేర్ ధర రూ.131 నుంచి రూ.121కి దిగజారింది. అలా స్వదేశీ షార్ట్ సెల్లర్స్ అంబానీ వ్యాపారాలను 1982లో టార్గెట్ చేశారు.

చోటుచేసుకున్న విచిత్రం..

చోటుచేసుకున్న విచిత్రం..

బేర్స్ ఆపరేటర్లను దారికి తీసుకురావటానికి ఏకంగా ధీరూబాయ్ అంబానీ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్లు రిలయన్స్ గ్రూప్ కు అండగా నిలిచారు. బేర్స్ అమ్ముతున్నదాని కంటే ఎక్కువగా అంటే దాదాపు 8 లక్షల రిలయన్స్ షేర్లను వీరు కొనుగోలు చేశారు. ఇందుకోసం ఆరోజుల్లోనే రూ.10 కోట్లను వెచ్చించారు. అప్పట్లో 14 రోజుల ట్రేడింగ్ సెటిల్ మెంట్ వ్యవస్థ ఉండటం కూడా కొంత బేర్ ఆపరేటర్లకు కలిసొచ్చింది. కానీ వారి ప్రయత్నాలను అంబానీ గట్టిగా తిప్పికొట్టి కంపెనీని నిలబెట్టారు. ఇన్వెస్టర్లలో ధైర్యాన్ని నింపి వారి సంపదను కాపాడారు. దీని తర్వార షేర్ ధర రూ.201 స్థాయికి చేరుకుంది.

అదానీ పరిస్థితి..

అదానీ పరిస్థితి..

ధీరూబాయ్ అంబానీ విషయంలో జరిగినట్లే ఇప్పుడు గౌతమ్ అదానీ విషయంలో జరుగుతోంది. అయితే ఇక్కడ తేడా ఏమిటంటే.. ఈ సారి అంతర్జాతీయ షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్ బెర్గ్ అదానీ గ్రూప్ కంపెనీల విషయంలో జరుగుతోంది. మార్కెట్ విశ్లేషకులు ప్రస్తుతం అప్పటి పరిస్థితులను ఇప్పుడు జరుగుతున్న వాటిలో లోప్చి చూస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే అంబానీ మాదిరిగా పరిస్థితులను అదానీ అదుపులోకి తీసుకురాగలరా లేదా అన్నదే.

English summary

Dhirubhai Ambani: 1982 సీన్ రిపీట్.. అంబానీలు ఎదుర్కొన్న పరిస్థితే అదానీకి.. స్పెషల్ స్టోరీ.. | Adani group facing 1982 Dhirubhai Ambani short selling bear cartel attack

Adani group facing 1982 Dhirubhai Ambani short selling bear cartel attack
Story first published: Thursday, February 2, 2023, 14:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X