For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అయ్యో పాపం... ఎంత కష్టం: ఇండియా లో 70% స్టార్టప్ కంపెనీలకు గడ్డుకాలమే!

|

స్టార్టప్ కంపెనీలు అంటేనే చిన్న సంస్థలు... కొత్త ఐడియా లతో ముందుకు వచ్చి సాహసంతో తాడో పేడో తేల్చుకుందామనుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు. కష్టపడి సంపాదించిన మొత్తంతోనో... అప్పో సప్పో చేసి ఒక కొత్త స్టార్టప్ కంపెనీకి ప్రాణం పోస్తారు. తొలుత అంతా బాగున్నట్టే అనిపించినా రోజులు గడుస్తున్నా కొద్దీ ఊహించిన ఫలితాలు రాబట్టేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది.

ఐడియా గ్రేట్... చాలా బాగుంది అనే వారే కానీ పెట్టుబడి పెట్టి చేయూత అందించేవారు తక్కువ మంది. ప్రభుత్వం కూడా ఎన్నో పథకాలు పెట్టి ఊరిస్తుంది కానీ... ఏదీ పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా ఉండదు. ఇన్ని కష్టాల మధ్య నిలదొక్కునేందుకు రోజూ యుద్ధం చేస్తుంటారు స్టార్టప్ కంపెనీల యజమానులు. సాధారణ పరిస్థితిలోనే అన్ని కష్టాలు భరించాల్సిన స్టార్టప్ కంపెనీలకు కరోనా వైరస్ మరిన్ని కష్టాలను మోసుకు వచ్చింది. లాక్ డౌన్ తో అవి ఇంకా అధికమయ్యాయి. దీనినే ప్రముఖ పారిశ్రామిక సంఘం ఫిక్కీ, ఇండియన్ ఏంజెల్ నెట్వర్క్ నిర్వహించిన ఒక సర్వే కూడా నిరూపించింది.

భారీ షాక్: కాగ్నిజెంట్‌లో 18,000 ఉద్యోగాల కోత? లీగల్ యాక్షన్ దిశగా..

డబ్బులు లేవు...

డబ్బులు లేవు...

ఫిక్కీ, ఇండియన్ ఏంజెల్ నెట్వర్క్ నిర్వహించిన సర్వే ప్రకారం.. దేశంలో 70% స్టార్టప్ కంపెనీలు కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడ్డాయని తేలింది. అందులో కొన్ని సంస్థలు ఐతే మూసివేత దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమైంది. మాయదారి మహమ్మారి ప్రభావం స్టార్టప్ కంపెనీలపై ఏ మేరకు ఉందో తెలుసుకునేందుకు సుమారు 250 స్టార్టప్ కంపెనీల అభిప్రాయాలను తెలుసుకున్నారు. వాటిలో 70% ఇబ్బంది పెడుతున్నామనే సమాధానం చెప్పగా... 17% కంపెనీలైతే మూసివేస్తున్నట్లు చెప్పటం ఆందోళన కలిగిస్తోంది. ఒక 60% సంస్థలు మాత్రం చాలా ఇబ్బందుల మధ్యే కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించాయి. ఈ నివేదికను ఉటంకిస్తూ ప్రముఖ వార్తా ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది.

మరో 3-6 నెలలే...

మరో 3-6 నెలలే...

ఫిక్కీ సర్వే ప్రకారం... ఇండియా లో ప్రస్తుతం కేవలం 22% స్టార్టప్ కంపెనీలు మాత్రమే నిర్వహణ కు తగిన నిధులు ఉన్నట్లు తెలిపాయి. అయితే అవి కూడా మరో 3 నెలల నుంచి 6 నెలల వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెప్పటం గమనార్హం. ఒక వేల ఆ సమయం లోపు పరిస్థితులు చక్కబడకపోతే భవిష్యత్ ఏమిటా అనే ఆందోళన వాటిని కూడా వెంటాడుతోంది. దీంతో వీలైనంత అధిక మొత్తంలో ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. మొత్తం స్టార్టప్ కంపెనీల్లో 68% స్టార్టప్ కంపెనీలు తమ నిర్వహణ వ్యయాలను గణనీయంగా తగ్గించుకుంటుండగా... మరో 30% కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 43% కంపెనీలు తమ ఉద్యోగుల వేతనాల్లో 20% నుంచి 40% వరకు కోతలు విధిస్తున్నాయి. ఇది ఇప్పటి వరకైతే జూన్ నెల వరకే అనుకున్నా... పరిస్థితుల తీవ్రత దృష్ట్యా మరింత కాలం పొడిగించే అవకాశం లేకపోలేదు.

పెట్టుబడులు రావటం లేదు...

పెట్టుబడులు రావటం లేదు...

ఈ సర్వే లో పాల్గొన్న ఇన్వెస్టర్లలో 96% మంది స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు ప్రభావితం అయ్యాయని చెప్పారు. మరో 6 నెలల పాటు ఇన్వెస్ట్మెంట్ పరిస్థితి ఇలాగే ఉంటుందని అభిప్రాయపడ్డారు. చాలా మంది ఇన్వెస్టర్లు ఇప్పటికే పెట్టుబడి పెట్టిన సంస్థలకే పరిమితం అవుతామని చెబుతుండగా.. కొంత మంది మాత్రమే కొత్త డీల్స్ ను కూడా పరిశీలిస్తామన్నారు. అదే సమయంలో ఇప్పుడు హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, అగ్రిటెక్ కంపెనీల పై అధికంగా దృష్టిసారిస్తామన్నారు. ఇదిలా ఉండగా... స్టార్టప్ కంపెనీల్లోకి రావాల్సిన పెట్టుబడులు కూడా నిలిచిపోయాయని 10% స్టార్టప్ కంపెనీలు తెలపగా.. 33% స్టార్టప్ కంపెనీలు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల నిర్ణయాలను వాయిదా వేసుకున్నారని పేర్కొన్నారు. కేవలం 8% కంపెనీలకు మాత్రమే ఎంతో కొంత ఫండింగ్ లభించటం పరిస్థితి తీవ్రతను తెలుపుతోంది.

English summary

About 70 per cent startups impacted by Corona: FICCI survey

Covid-19 has had an impact on 70% of Indian startups, according to a survey, with 17% of them saying they had shuttered their business.
Story first published: Monday, July 6, 2020, 11:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X