ఉద్యోగులకు మోడీ బంపరాఫర్: శాలరీ రూ.8,000 పెరిగే ఛాన్స్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం వేతనాల విషయంలో తీపి కబురు అందించనుందా? అంటే కావొచ్చునని అంటున్నారు. ఉద్యోగులకు కనీస వేతనాన్ని పెంచే అవకాశాలను కొట్టి పారేయలేమని అంటున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉద్యోగుల వేతన పెంపుపై సానుకూలంగా నిర్ణయం తీసుకోవచ్చునని అంటున్నారు. ముఖ్యంగా, కనీస వేతనాలను పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు.
రూ.450 కోట్లతో సినిమా, రూ.7,000 కోట్ల చేరువలో కలెక్షన్స్

మోడీ ప్రభుత్వం కనీస వేతనాన్ని పెంచే అవకాశం
ఇంగ్లీష్ మీడియాలో వచ్చిన వార్తల మేరకు... కేంద్ర కేబినెట్ భేటీ ఈ నెల చివరన జరగనుంది. ఈ సమయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇదే కేబినెట్ భేటీలో ఉద్యోగుల కనీస వేతనాలు పెంచే నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం లభిస్తే ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికార ప్రకటన చేస్తుంది.

రూ.8000 పెంచే అవకాశాలు
ఏడో వేతన సంఘం సిఫార్సు మేరకు కనీస వేతనాలను రూ.8,000 పెంచే అవకాశముందని అంటున్నారు. ఆర్థిక మందగమనం నుంచి కోలుకునేందుకు మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చునని చెబుతున్నారు. అన్ని ప్రభుత్వ స్కూల్ ఉద్యోగులు, యూనివర్సిటీ టీచర్లకు ఏడో వేతన కమిషన్ జనవరి 1వ తేదీ నుంచి అప్లికేబుల్ అవుతుంది.

ఆలస్యమైందా?
సాధారణంగా ఉద్యోగుల కనీస వేతన ప్రకటన దీపావళికి ముందు వెలువడాల్సి ఉండెనని, అయితే ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో ఆలస్యమైందని అంటున్నారు. అయితే కేంద్రం ఉద్యోగులకు దీపావళి పండుగ సందర్భంగా డియర్నెస్ అలవెన్స్ (DA) రూపంలో శుభవార్త అందించింది.