36లక్షల ఉద్యోగాలు, 76లక్షల రెవెన్యూ:విదేశాల్లో భారత సంతతి వ్యాపారవేత్తల సత్తా ఇదీ
సుందర్ పిచాయ్(గూగుల్), సత్య నాదెళ్ల(గూగుల్), అజయ్ బంగా(మాస్టర్ కార్డ్) ఇలా వివిధ దేశాల్లోని దిగ్గజ కంపెనీల్లో కీలకస్థాయిలో ఉన్నారు. వీరి ఆధ్వర్యంలోని కంపెనీల్లో 11 దేశాల్లో 3.6 మిలియన్ల మందికి పేగా అంటే 36 లక్షల కంటే ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఆయా దేశాలకు ప్రతి సంవత్సరం 76 లక్షలకోట్ల ఆదాయం (లక్ష కోట్ల డాలర్లు) వస్తోంది. ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 4 లక్షల కోట్లుగా ఉంది. ఈ మేరకు ఇండియాస్పోరా అనే స్వచ్చంధ సంస్థ 58 మంది పేర్లతో జాబితాను విడుదల చేసింది.
గోడకు కొట్టిన బంతిలా.. భారత్ అదుర్స్! గుడ్న్యూస్ చెప్పిన ఆర్థికవేత్త

వీరి హయంలో దూసుకెళ్లిన కంపెనీలు
అమెరికా, సింగపూర్, కెనడా, ఇంగ్లాండ్ సహా పదకొండు దేశాల్లో 58 మంది కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు. భారతీయ మూలాలు కలిగిన బిజినెస్ లీడర్స్ గతంలో కంటే ఎక్కువసంఖ్యలో ఆయా కంపెనీలకి నాయకత్వం వహిస్తున్నారు. భారతీయులు టాప్ పొజిషన్లో ఉన్న కాలంలో ఈ కంపెనీల వార్షిక రిటర్న్స్ సగటున 23 శాతంగా ఉన్నాయి. ఎస్ అండ్ పీ 500లో 10 శాతం పెరిగింది. 36 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు.

బ్యాంకింగ్, టెక్, ఫైనాన్స్ సహా వివిధ రంగాల్లో
భారత్ మూలాలు కలిగిన టెక్ దిగ్గజాలు.. వారు సాధిస్తున్న విజయాలను పరిచయం చేయాలని భావించినట్లు సిలికాన్ వ్యాలీ నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇండియాస్పోరా ఫౌండర్ ఎంఆర్ రంగస్వామి అన్నారు. మనవారు వివిధ వ్యాపారాలలో తమదైన సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారని, వారు ఎంతో ప్రభావం చూపిస్తున్నారని, అందుకే ఈ నివేదికను తయారు చేశామని, వారు మరింత ఉన్నత స్థానానికి ఎదుగుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు. కేవలం టెక్ రంగంలోనే కాకుండా బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ గూడ్స్, కన్సల్టింగ్ వంటి వివిధ రంగాల్లో దూసుకెళ్లారని చెప్పారు.

కరోనా సమయంలో సహకారం
ఈ జాబితాలో 37 ఏళ్ల వయస్సు వారు, అలాగే 74 ఏళ్ల వయస్సు వారు ఉన్నారని, సగటు వయస్సు 54 అని రంగస్వామి చెప్పారు. కరోనా సమయంలోనూ ఈ కంపెనీలు మానవతా దృక్పథంతో తమదైన మేరకు సహాయం చేశాయన్నారు. అలాగే ఉద్యోగులను, కస్టమర్లకు కంపెనీ తరఫున అండదండలు అందించారని చెప్పారు. కరోనాపై స్పందించడంతో పాటు బ్లాక్స్ అంశంలో స్పందించారని తెలిపారు.

భారత్తో పాటు వివిధ దేశాల్లో జన్మించారు
ఈ జాబితాలో ఇండియాలో జన్మించిన వారితో పాటు ఉగాండ, ఇథియోపియా, ఇంగ్లాండ్, అమెరికాలో జన్మించినవారు కూడా ఉన్నారని తెలిపారు. బిజినెస్లో ఎంతో దూరం వచ్చామని, ఇది ఆశ్చర్యంగా ఉందని చెబుతున్నారు. పెప్సికో ఇంద్రానూయి, హర్మాన్ ఇంటర్నేషనల్ దినేష్ పాలివాల్ వంటి వారు కూడా అత్యున్నత స్థాయికి చేరుకున్నారు.

స్ఫూర్తిదాయకం
భారత్కు చెందిన వారు వ్యాపారాల్లో, సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఇది స్ఫూర్తిదాయకం అని మాస్టర్ కార్డ్ సీఈవో అండ్ ప్రెసిడెంట్ అజయ్ బంగా అన్నారు. ఈ 58 మందిలో మహిళలు 5గురు ఉన్నారు. జాబితాలో చోటు దక్కించుకోవడం గౌరవంగా ఉందని వర్టెక్స్ ఫార్మా సీఈవో, ఎండీ రేష్మ అన్నారు. సత్య నాదెళ్ల, అజయ్ బంగా, సుందర్ పిచాయ్, శంకర్ నారాయణ్, వసంత్ నరసింహన్, అర్వింద్ కృష్ణ, లక్ష్మీ మిట్టల్, రాజ్ సుబ్రమణియమ్, వివేక్ శంకరన్, పునీత్ రెన్ జెన్, భారత్ మస్రానీ, మైక్ మోహన్ వంటి వారు ఉన్నారు.