For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డబుల్ కంటే ఎక్కువ: తెలంగాణకు మద్యం అప్లికేషన్ల ఆదాయమే రూ.968 కోట్లు

|

హైదరాబాద్: మద్యం దుకాణాల దరఖాస్తుల రూపంలో తెలంగాణ రాష్ట్ర ఖజానాకు 234 శాతం అధిక ఆదాయం లభించింది. మద్యం దరఖాస్తుల ద్వారా రూ.900 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. కలెక్టర్ల సమక్షంలో డ్రా పద్ధతిలో మద్యం షాప్స్‌ను ఎంపిక చేస్తారు. ఎంపికైనా ఎవరైనా ముందుకు రాకపోతే రూ.5 లక్షల జరిమానా విధిస్తారు. లిక్కర్ నిబంధనల ప్రకారం డ్రాలో ఎంపికైన వారు రెండేళ్ల పాటు మద్యం అమ్మకాలు జరుపుకోవచ్చు. ప్రస్తుత లైసెన్స్ వ్యాలిడిటీ అక్టోబర్ 18వ తేదీన ముగిసింది. షాపులకు కొత్త లైసెన్స్ నవంబర్ 1వ తేదీ నుంచి రానున్నాయి. మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ బుధవారం (అక్టోబర్ 16)తో ముగిసింది.

తెలంగాణలోని మొత్తం 2,216 షాప్స్‌కు 48,401 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా రూ.968.02 కోట్ల ఆదాయం సమకూరింది. క్రితంసారి వచ్చిన ఆదాయం రూ.412 కోట్లు. ఇప్పుడు రెండింతలకు పైగా వచ్చింది. ఈసారి ఒక్కో దుకాణానికి సగటున 22 మంది పోటీ పడ్డారు. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ఒక్కో దుకాణానికి 47 మంది పోటీ పడ్డారు. హైదరాబాద్ జిల్లాలో ఎనిమిది మంది పోటీ పడ్డారు.

2008 కంటే అతిపెద్ద సంక్షోభం, 20 నెలలు ఇంతే2008 కంటే అతిపెద్ద సంక్షోభం, 20 నెలలు ఇంతే

 Telangana earns Rs 900 crore as application fee for new liquor shops

ఎక్సైజ్ డివిజన్ వారీగా అదిలాబాద్‌లో 163 దుకాణాలకు 2956 దరఖాస్తులు, కరీంనగర్‌లో 266 దుకాణాలకు 4013 అప్లికేషన్లు, ఖమ్మంలో 165 దుకాణాలకు 7711 దరఖాస్తులు, మహబూబ్ నగర్‌లో 164 షాపులకు 3383 అప్లికేషన్లు, మెదక్‌లో 193 షాప్స్‌కు 3200 దరఖాస్తులు, నల్గొండలో 278 దుకాణాలకు గాను 7099 అప్లికేషన్లు, నిజామాబాద్‌లో 131 దుకాణాలకు గాను 1547 అప్లికేషన్లు, రంగారెడ్డిలో 422 దుకాణాలకు గాను 8892 దరఖాస్తులు, వరంగల్‌లో 261 దుకాణాలకు గాను 8101 దరఖాస్తులు, హైదరాబాదులో 173 దుకాణాలకు గాను 1499 అప్లికేషన్స్ వచ్చాయి.

ఈ మొత్తం అప్లికేషన్స్ ద్వారా రూ.968.02 కోట్ల ఆధాయం వచ్చింది. మద్యం విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. అదే సమయంలో లాభాలు కూడా బాగా ఉంటున్నాయనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి పోటీ ఎక్కువగా ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. దరఖాస్తులు పెరిగాయి, దాంతో పాటు రెవెన్యూ కూడా పెరిగిందని, దీంతోనే మద్యం దుకాణాలపై ఉన్న ఆసక్తి అర్థమవుతోందని అంటున్నారు.

English summary

డబుల్ కంటే ఎక్కువ: తెలంగాణకు మద్యం అప్లికేషన్ల ఆదాయమే రూ.968 కోట్లు | Telangana earns Rs 900 crore as application fee for new liquor shops

Telangana’s Excise Department has earned Rs 900 crore in lieu of non-refundable application fee for liquour licences.
Story first published: Friday, October 18, 2019, 14:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X